Jump to content

Antha Aaatram Vaddammaa!


jimcarrey

Recommended Posts

[color=#b22222][/color][size=4][color=#FF0000][b] అంత ఆత్రం వద్దమ్మా![/b][/color][/size]
[size=4][color=#FF0000][b] సాయిరెడ్డికి న్యాయమూర్తి హితువు[/b][/color][/size]
[size=4][color=#FF0000][b] కేసును నేను స్టడీ చేయాలి కదా:! నాగమారుతీ శర్మ[/b][/color][/size]


[size=4][b][font=arial,helvetica,sans-serif]హైదరాబాద్, జనవరి 3 : జగన్ అక్రమ ఆస్తుల కేసులో రెండో నిందితుడు, జగతి పబ్లికేషన్స్‌వైస్ చైర్మన్ విజయ సాయిరెడ్డికి కోర్టులో అనుకోని అనుభవం ఎదురైంది. తన వాదనను తానే వినిపించేందుకు సిద్ధమైన సాయిరెడ్డిని న్యాయమూర్తి నిలువరించారు. అంత ఆతృత వద్దంటూ పరోక్షంగా కట్టడి చేశారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో రెండో నిందితుడు సాయిరెడ్డిని సీబీఐ సోమవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం విచారణకు స్వీకరించింది.[/font][/b][/size]

[size=4][b]సాయిరెడ్డిని పోలీసులు కోర్టులో హాజరు పరిచిన వెంటనే ఆయన తరఫు న్యాయవాది ఉమా మహేశ్వరరావు వాదనలు ప్రారంభించారు. అదే సందర్భంలో సాయిరెడ్డి జోక్యం చేసుకుని తన వాదనను తానే వినిపించే ప్రయత్నం చేశారు. తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా, కోర్టుకు హాజరవడం ద్వారా విచారణ చేయాలని కోర్టును అభ్యర్థించారు. తనపై సీబీఐ చేసిన ఆరోపణలన్నీ అబద్ధమని, సీబీఐ పేర్కొన్న సెక్షన్లు తనకు వర్తించవని అన్నారు.[/b][/size]

[size=4][b]దీనిపై సీబీఐ న్యాయవాది రవీంద్రనాథ్ కాస్త ఘాటుగా స్పందిస్తూ.. 'సీబీఐ చట్ట ప్రకారమే వెళుతోంది. కోర్టులో సీబీఐపై ఆరోపణలు చేస్తున్న మీరు, మీ న్యాయవాది కలిసి సొంతంగా చట్టాలు తయారు చేసుకోండి' అని వ్యాఖ్యానించారు. దీంతో, తనకూ సీబీఐ జేడీకి, ఎస్పీకి, ఇన్ స్పెక్టరుకు మధ్య ఏం జరిగిందో తనకు మాత్రమే తెలుసునని, అవన్నీ వివరించే ప్రయత్నం చేస్తున్నానని సాయిరెడ్డి బదులిచ్చారు. దీంతో, న్యాయమూర్తి 'మనకి ఎంత ఆతృత ఉండాలో అంతే ఉండాలి' అని వ్యాఖ్యానించారు. దాంతో సాయిరెడ్డి వెనక్కి తగ్గారు.[/b][/size]

[size=4][b]ఇప్పటి వరకు (3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు) మీ గతంలో ఏం జరిగిందో వదిలేసి, భవిష్యత్ గురించి ఆలోచించండి. మీ వాదనలు అన్నీ వింటాను అని న్యాయమూర్తి చెప్పారు. అంతకుముందు నాగమారుతీశర్మ, సాయిరెడ్డిని నేరుగా ప్రశ్నిస్తూ.. 'మిమ్మల్ని సీబీఐ పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా?' అని అడిగారు. ఇప్పటి వరకు లేదని అంటూ, ఇబ్బంది కలిగించవచ్చు అన్న భావనలో 'ఐయాం ఎక్స్‌పెక్టింగ్..' అని బదులిచ్చారు.[/b][/size]

[size=4][b]సాయిరెడ్డి తరపు న్యాయవాది తన వాదనలు కొనసాగిస్తూ.. 'రిమాండ్ కాపీ కూడా ఏమీ లేకుండా నేరుగా కోర్టుకు తీసుకొచ్చారు. తమ కస్టడీకి ఇవ్వాలని అడుగుతున్నారు. వాటి కోసం వేర్వేరుగా రెండు పిటిషన్లు ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు. జగన్ సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి 73 మందిని విచారించామని సీబీఐ చెబుతోందని, వారిలో ఒక్క అధికారి పేరు కూడా ఇవ్వలేకపోయింద'ని తప్పుబట్టారు. 'విజయసాయిరెడ్డిని ఈ కోర్టుకు ఎందుకు తీసుకొచ్చారు? కొందరిని ఇతర కోర్టులకు ఎందుకు తీసుకెళుతున్నారు? అంటే అందుకు కారణం ఉండాలి కదా?' అని ప్రశ్నించారు.[/b][/size]

[size=4][b]దానిపై న్యాయమూర్తి మాట్లాడుతూ..'ఈ రోజే తీసుకొచ్చారు, కోర్టు కేసును విచారణకు తీసుకుంటోంది. ఆయన్ను జ్యుడీషియల్ కస్టడీకి పంపి, బుధవారం వాదనలు వింటుంది' అన్నారు. ఇరుపక్షాలు తమ తమ వాదనలు వినిపించేందుకు ప్రయత్నిస్తుండగా.. 'ఈ కేసును నేను స్టడీ చేయాలి. మీరంతా బాగా ప్రిపేరై (సిద్ధపడి వచ్చారు) వచ్యారు. వాదనలు వినేందుకు సమయం కావాలి. నేను ఆలోచించాలి కదా' అని న్యాయమూర్తి వారిని వారించారు.[/b][/size]

[size=4][b]సీబీఐకి కూడా జడ్జి కొన్ని సూచనలు చేశారు. కోర్టుకు దాఖలు చేసే పిటిషన్‌లో ఆయా కేసులకు సంబంధించిన సమాచారం ఒక పేరా అయినా ఉండాలన్నారు. కౌంటర్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు 24 గంటలు సమయం ఇవ్వాలని ఉమామహేశ్వరరావు కోర్టును కోరారు. తన న్యాయవాదితో మాట్లాడుకునేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ సాయిరెడ్డి కోర్టును కోరారు. న్యాయమూర్తి వారికి గంటన్నరకుపైగా సమయం ఇచ్చారు.[/b][/size]

Link to comment
Share on other sites

×
×
  • Create New...