Jump to content

Etv Majority Stake Sold To Tv18 ( Mukesh Ambani)


jimcarrey

Recommended Posts

[b] టీవీ 18 చేతికి ఈటీవీ
చక్రం తిప్పిన ముఖేష్ అంబానీ
ఈటీవీలో రిలయన్స్ వాటాల విక్రయం[/b]

[b]తెలుగు మినహా ఇతర వార్తా చానళ్లలో 100శాతం
ఇతర భాషా వినోద చానళ్లలో 50 శాతం
తెలుగు వార్తా, వినోద చానళ్లలో 2.5 శాతం [/b]

న్యూఢిల్లీ, జనవరి 3: ఈటీవీకి చెందిన పలు చానళ్లు టీవీ 18 చేతుల్లోకి వెళ్లాయి. రామోజీరావు నేతృత్వంలోని ఈటీవీలో తనకున్న వాటాలను రిలయన్స్ సంస్థ నెట్‌వర్క్ 18 గ్రూప్‌నకు విక్రయించింది. ఈ డీల్ విలువ రూ. 2,100 కోట్లు. ఈ ఒప్పందంలో భాగంగా తెలుగు మినహా మిగిలిన భాషల్లోని ఈటీవీ చానళ్లలో వార్తాప్రసార చానళ్ల హక్కులు నూటికి నూరుశాతం టీవీ18కి దక్కాయి.

అలాగే, ఇతర భాషల్లోని వినోద చానళ్లలో 50% వాటాలు, తెలుగులోని ఈటీవీ న్యూస్, ఈటీవీ వినోద చానళ్లలో 24.50% వాటాలను ఈ సంస్థ దక్కించుకుంది. ప్రస్తుతం నెట్‌వర్క్ 18, టీవీ 18లకు జాతీయ చానళ్లు మాత్రమే ఉన్నాయి. తాజా డీల్‌తో ప్రాంతీయ టెలివిజన్ ప్రసారాలపై కూడా ఈ సంస్థ పట్టు బిగించింది. రిలయన్స్ అధినేత అంబానీ అండదండలు లభించడమే ఇందుకు కారణం. ఈ డీల్‌కు ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఆర్థిక సలహాలు అందించగా, న్యాయ సలహాలను ఖైతాన్ అండ్ కో అందించింది.

ఇది అంబానీ మాయ.. ఈటీవీ చానళ్ల విలీనంతో సంచలనం సృష్టించిన నెట్‌వర్క్18 గ్రూప్ ప్రమోటర్ రాఘవ్‌బాల్ పనిలో పనిగా సొంత ఇంటినీ చక్కదిద్దుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. మొత్తం అప్పులన్నీ తీర్చేసేందుకు రైట్స్ ఇష్యూను జారీ చేసి 4000 కోట్ల రూపాయల సమీకరణకు సిద్ధమయ్యారు. నిజానికి ముఖేష్ అంబానీయే ఈ కథను వెనక నుంచి నడిపిస్తున్నట్లు సమాచారం.

డీల్‌లో భాగంగా ఈటీవీలో రిలయన్స్ గ్రూప్ కంపెనీల వాటాలు విక్రయించడంతో పాటు టీవీ18 గ్రూప్ ప్రమోటర్లకు కావాల్సిన నిధులను కూడా ముకేష్ అంబానీ అందించినట్లు తెలిసింది. ఈ వార్తలను రిలయన్స్ «ద్రువీకరించింది.

పేరుకు టీవీ18 ఈటీవీ చానళ్లను చేజిక్కించుకున్నట్లు కనపడుతున్నా, నిజానికి ఈటీవీ అంబానీ గూటికే చేరింది. టీవీ18 రిలయన్స్ ఇన్ఫోటెల్‌తో బ్రాడ్‌బాండ్ ప్రసారాల ఒప్పందం కుదుర్చుకోవడమే ఇందుకు నిదర్శనం. ప్రతిపాదిత 4జీ బ్రాడ్‌బాండ్ నెట్‌వర్క్ ద్వారా రిలయన్స్ సంస్థ ప్రసారాలు అందిస్తుంది.

వాటాలు మారిన చానళ్లివే.. నూటికి నూరుశాతం వాటాలను పొందిన ఈటీవీ చానళ్లలో ఈటీవీ ఉత్తరప్రదేశ్, ఈటీవీ మధ్యప్రదేశ్, ఈటీవీ రాజస్థాన్, ఈటీవీ బీహార్, ఈటీవీ ఉర్దూ చానళ్లున్నాయి. ఇవన్నీ వార్తా చానళ్లు. ఇక వినోద చానళ్లయిన ఈటీవీ మరాఠీ, ఈటీవీ కన్నడ, ఈటీవీ బంగ్లా, ఈటీవీ గుజరాతీ, ఈటీవీ ఒరియాలలో 50% వాటాలను సంస్థ చేజిక్కించుకుంది.

అలాగే ఈటీవీ తెలుగు, ఈటీవీ తెలుగు న్యూస్ చానళ్లలో 24.50% వాటాలను పొందింది. ఇందుకోసం 2100 కోట్ల రూపాయల మొత్తాన్ని టీవీ18 వెచ్చిస్తోంది. ఈటీవీ నాన్ తెలుగు వినోద చానళ్లలో మిగిలిన 50%, ఈటీవీ తెలుగు చానళ్లలో అదనంగా మరో 24.5% వాటాలను కొనుగోలు చేసే సదుపాయం కూడా ఈ డీల్‌తో టీవీ18కి లభించింది. తెలుగు మినహా ఇతర చానళ్ల బోర్డు, యాజమాన్యం టీవీ18 చేతుల్లోకి వచ్చేసింది.

Link to comment
Share on other sites

×
×
  • Create New...