Jump to content

Jr.ntr And Tdp


BENDU_APPARAO

Recommended Posts

తెలుగుదేశం పార్టీ ఇక జూనియర్ ఎన్.టి.ఆర్ ను వదలివేసినట్లేనా?తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు సాధారణంగా ఎన్.టి.ఆర్. కుటుంబానికి సంబంధించినవారి గురించి బహిరంగంగా వ్యాఖ్యానించరు. అలాంటిది ఇటీవలి కాలంలో చంద్రబాబు చాలా స్పష్టంగా జూనియర్ ఎన్.టి.ఆర్ గురించి, ఆయన మామ గురించి కూడా వ్యాఖ్యానిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూనియర్ ఎన్.టి.ఆర్ ను పట్టించుకోనవసరం లేదని ఆయన తమ ముందు చెప్పినట్లు ఒక శాసనసభ్యుడు చెప్పారు.తనతోనే తెలుగుదేశం ఉందన్నట్లుగా జూనియర్ ఎన్.టి.ఆర్ వ్యవహరిస్తున్నారని, అలాంటి భావాలను వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నారని చంద్రబాబు దృష్టికి వచ్చిందని చెబుతున్నారు. అంతేకాక మహానాడు సమయంలోను, ఆ తర్వాత హరికృష్ణగాని, తదుపరి జూనియర్ ఎన్.టి.ఆర్ వ్యవహరించిన తీరు టిడిపికి, చంద్రబాబుకు నష్టం కలిగించింది. అయితే అప్పుడు సంయమనం పాటించిన చంద్రబాబు కాలక్రమేణ పార్టీ వారికి దూరంగా ఉంటోందన్న సంకేతాన్ని ఇవ్వడానికి యత్నిస్తున్నారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. జూనియర్ ఎన్.టి.ఆర్.కు సంబంధించి అలాంటి స్పష్టమైన సంకేతం పార్టీ శ్రేణులకు వెళ్లవలసిన అవసరం ఉందని అనుకుని చంద్రబాబు ఇలా బహిరంగంగా చెబుతుండవచ్చని ఒక ఎమ్మెల్యే అన్నారు.దానికి తగిన విధంగా తన వియ్యంకుడు , ఎన్.టి.ఆర్ కుమారుడు అయిన బాలకృష్ణ ఎన్నికల పోటీ ప్రకటన కూడా వెలువడిందని కొందరు అంచనా వేస్తున్నారు. జూనియర్ ఎన్.టి.ఆర్ ను రాజకీయాలకు వాడుకోవడం కన్నా, బాలకృష్ణనే ఆ పనిమీద ఉపయోగించుకోవడం మంచిదని, అంతేకాక ఎన్.టి.ఆర్.కుటుంబ వారసత్వం బాలకృష్ణదే అని సంకేతం ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో తన కుమారుడు లోకేష్ రాజకీయాలలోకి రావాలనుకున్నా ఇబ్బంది ఉండదని భావిస్తుండవచ్చని ప్రచారం జరుగుతోంది.

Link to comment
Share on other sites

[quote name='demo' timestamp='1326203339' post='1301274930']
so what
[/quote]


neenu adhee seputhunna ... eelaa nolli manaku endhuku ani :)

Link to comment
Share on other sites

×
×
  • Create New...