Jump to content

Chiru X Balayya !


akhil79

Recommended Posts

[size=6][b] చిరు X బాలయ్య[/b]

[color=#333333][font=arial][img]http://suryaa.com/Main/gallery/2012/Jan/13/chirus.jpg[/img]హైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌:రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌, తెలుగుదేశం మధ్య మాటల యుద్ధం పెరిగిపోతున్నది. ఈ యుద్ధంలో ఇద్దరు హీరోలు కీలకపాత్ర పోషిస్తుంటే, ఆయా పార్టీల నేతలు వారికి దన్నుగా నిలుస్తు న్నారు. ఇటీవలే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసిన చిరంజీవి ఒకవైపు, త్వరలో ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి ప్రజాసేవ చేస్తానని ప్రకటించిన బాల కృష్ణ మరోవైపు పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. పరస్పరం వీరిద్దరూ చే సుకుంటున్న వ్యాఖ్యలు సినీరంగాన్ని దాటి రాజకీయ రంగ ప్రవేశం చేయ టంతో సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతున్నది.

[color=#DB3434]రామ్‌చరణ్‌ తేజ వ్యాఖ్యలతో మొదలు[/color]
అసలు ఈ వివాదం అంతా చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్‌తేజ చేసిన ఘాటైన వ్యాఖ్యలతో ప్రారంభమైంది. తమిళ దర్శకుల మాదిరిగా తెలుగు దర్శ కులలో సృజనాత్మకత లేదంటూ రామ్‌చరణ్‌ చేసిన వ్యాఖ్యను బాలయ్య తీవ్రం గా ఖండించారు. ఈ సందర్భంగానే కొంత ఘాటైన పదజాలం వాడటం, అది వివాదాస్పదం కావటం జరిగిపోయింది. అది సద్దుమణిగిన తర్వాత తాజాగా బాలకృష్ణ ఇటీవల కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్ళిన సందర్భంగా తన రాజకీయ ప్రవేశాన్ని మరోసారి ప్రకటించారు. ఇదే సమయంలోనే ఎన్టీరామారావు గురించీ, ఆయన అమలు చేసిన సామాజిక న్యాయం గురించీ, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషి గురించీ ప్రస్తావించారు. [/font][/color]


[img]http://suryaa.com/Main/gallery/2012/Jan/13/balu.jpg[/img]ఎన్టీఆర్‌ ఎన్నడూ సా మాజిక న్యాయాన్ని వోటుబ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకోలేదని, ఇప్పుడు కొందరు నాయకులు దానికే అంకితమయ్యారంటూ చిరంజీవిని ఉద్దే శించి వ్యంగ్యంగా మాట్లాడారు. సామాజిక న్యాయం నినాదంతో పుట్టిన పార్టీ కాంగ్రెస్‌లో కలసిపోయిందన్నారు. ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీ నిపై చిరంజీవి పెద్దగా స్పందించకపోయినా కటువుగా లేకపోయినప్పటికీ బాల య్యను ఉద్దేశించి విశాఖలో స్పందించారు. బాలకృష్ణ వ్యాఖ్యలను పట్టించు కోన క్కర లేదని, ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం అంటూ, అసలు పేరులోనే బాల అని ఉందన్నారు.

[color=#DB3434]మాటల యుద్ధం మొదలు[/color]
ఈ పరస్పర వ్యాఖ్యలతో అటు కాంగ్రెస్‌, ఇటు టీడీపీలో వేడి మొదలైంది. చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్యానించే అర్హత బాలయ్యకు లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనం వివేకానందరెడ్డి లాంటి వారు ధ్వజమెత్తారు. వెన్నుపోట్ల సంస్కృతికి పేరు పొందిన తెలుగుదేశం పార్టీకీ, చిరంజీవికీ పొంతన లేదన్నారు. అంతకు ముందు కొందరు కాంగ్రెస్‌ నేతలు బాలయ్య రాజకీయ రంగ ప్రవేశంపై స్పంది స్తూ 2014 నాటికన్న ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికలలో పోటీ చేయాలని సవాల్‌ చేశారు. ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు బాలయ్యకు దన్నుగా నిలిచారు. ఆయన మాటల్లో తప్పేముందని నిలదీశారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో కలపలేదా? సామాజిక న్యాయం నినాదం ఇవ్వలేదా అని ప్రశ్నిం చారు. కర్నూలు వంటి నగరాలలో బాలయ్య అభిమానులు చిరంజీవి దిష్టిబొ మ్మలను దగ్ధం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

[color=#DB3434]కుల నేతలకు వల కోసమే?[/color]
ఇటు చిరంజీవి చేస్తున్న వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో ప్రధానంగా ఉన్న కా పు సామాజిక వర్గ నేతలను ఆకర్షించేందుకేనని, సీ రామచంద్రయ్య లాంటి వారు మరి కొందరిని కాంగ్రెస్‌వైపు ఆకర్షించేందుకే ఆయన బాలకృష్ణను టార్గెట్‌ చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. తనకు అత్యంత సన్నిహితుడైన సీఆర్‌ కు మంత్రి పదవి ఇప్పించుకోవటం ద్వారా టీడీపీలోని కాపు సామాజిక వర్గ నేతలు ఎవరైనా ఉంటే ఆకర్షించవచ్చునన్నది చిరంజీవి వ్యూహంగా కనిపిస్తున్న దని కొందరు నేతలు తెలిపారు. అటు తెలుగుదేశం పార్టీ బాలయ్యను అడ్డు పెట్టుకుని కాంగ్రెస్‌లో కమ్మ సామాజిక వర్గం నేతలను లాగేయాలని ప్రయ త్నిస్తున్నట్టు తెలిసింది. ‘ఈ మాటల యుద్ధం ఎంత దూరం వెళ్తుందో తెలి యదు...మొత్తం మీద రెండు పార్టీలూ వీరిద్దరినీ ఉపయోగించుకుని ప్రయో జనం పొందేందుకు ప్రయత్నిస్తున్న మాట వాస్తవం...’ అని కొందరు నేతలు వ్యాఖ్యానించారు.[/size]

Link to comment
Share on other sites

×
×
  • Create New...