Jump to content

Telugu Review

Ispate Raju

Recommended Posts

[color=#333333][font=helvetica, arial, sans-serif]రెండేళ్లకో సినిమా పూర్తి చేస్తాడని పేరున్న మహేష్ బాబుతో పూరి జగన్నాథ్ 74 రోజుల్లో సినిమా ఎలా తీసేశాడబ్బా అని కొన్ని రోజులుగా ఒకటే డౌటు. కానీ బిజినెస్ మేన్ చూశాక అర్థమైంది.. అర్థం పర్థం లేని కథతో, క్యారెక్టర్లతో.. ఏమాత్రం కొత్తదనం లేని కథనంతో.. తానిప్పటికే ఎన్నోసార్లు వడ్డించిన సన్నివేశాలతో.. పూరి జగన్నాథ్ శరవేగంగా సినిమాను ఎలా పూర్తి చేయగలిగాడో. ఇలాంటి సినిమాను 74 రోజులేంటి.. 47 రోజుల్లోనూ పూర్తి చేసేయొచ్చు.[/font][/color]
[color=#333333][font=helvetica, arial, sans-serif]మాఫియా డాన్ ల శకం ముగిసిన ముంబయిలోకి సూర్య (మహేష్ బాబు) అడుగుపెట్టడంతో కథ మొదలవుతుంది. పెద్ద డాన్ కావాలన్నది అతని ఆశయం (డాన్ శీనులో రవితేజలా కామెడీగా కాదు.. చాలా సీరియస్). వెంటనే రంగంలోకి దిగిపోతాడు. కొందరు రౌడీల్ని కొట్టి, వాళ్లతోనే గ్యాంగ్ ఏర్పాటు చేస్తాడు. దందాలు మొదలుపెడతాడు. అదే సమయంలో కమిషనర్ (నాజర్) కూతురు చిత్ర (కాజల్)ను ప్రేమలోకి దింపుతాడు. కేంద్ర మంత్రి జైదేవ్ (ప్రకాష్ రాజ్)ను ఎదిరించి మరీ సూర్య తాను కోరుకున్న లాలు (షాయాజి షిండే)ను ముంబయి మేయర్ గా చేయడంతో ఇద్దరికీ ఘర్షణ మొదలవుతుంది. ఐతే సూర్య.. జైదేవ్ ను టార్గెట్ చేయడానికి ఓ కారణముంటుంది. అదేంటి? ఇంతకీ సూర్య ఎందుకు డాన్ కావాలనుకుంటాడు? చివరికతను ఏం చేశాడు అనేది మిగిలిన కథ.[/font][/color]
[color=#333333][font=helvetica, arial, sans-serif]పూరి జగన్నాథ్ కు మాఫియా కథలంటే ఎంతో ఇష్టం ఉండొచ్చుగాక.. అంతమాత్రాన తన ప్రతి సినిమాలోనూ మాఫియా విందే వడ్డిస్తానంటే ఎలా? అదే డాన్ లు, అదే పోలీసులు.. అవే గన్నులు.. అవే కాల్పులు.. అవే ఫైట్లు.. అవే డైలాగులు.. ఎన్నాళ్లు చూడాలి స్వామీ ఈ సినిమాల్ని? అర్థం లేని కథ ఇది. పోకిరి సినిమాలో హీరో రౌడీల్ని చంపవతల పడేస్తుంటే.. హీరోయిన్ అవి చూసి ఏడుస్తూ నువ్వు మనిషివేనా? మానవత్వం లేదా? ఇలా చంపేస్తున్నావేంటి? అంటుంది. బిజినెస్ మేన్ కూడా మహేష్ ఆ పనే చేస్తుంటాడు. కానీ ఈసారి ఏడ్చేది.. అతణ్ని ప్రశ్నించేది కాజల్. అంతే తేడా. పోకిరి హీరో ప్రవర్తనకు ఓ కారణమంటూ ఉంటుంది. కానీ ఇందులో హీరో ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు. అతని ఫ్లాష్ బ్యాక్ కూడా దాన్ని జస్టిఫై చేయదు. పూరి జగన్నాథ్ సినిమాల్లో కన్ఫ్యూజింగ్ గా.. తిక్కతిక్కగా ఉండే హీరో క్యారెక్టరైజేషనే హైలైట్ అవుతుంటుంది. ఐతే ఆ తిక్కకు మొదట్లోనో, చివర్లోనో ఎక్కడో ఓ చోట ఓ జస్టిఫికేషన్ ఉండేది. కానీ బిజినెస్ మేన్ లో అలా లేదు. సూర్య క్యారెక్టర్ తిక్కకు ఓ హద్దూ పద్దూ లేదు.. ఓసారి దేశాన్ని ఏలాలంటాడు.. ఇంకోసారి చోర్ సాలేగాళ్లనంతా ఏరేయాలంటాడు.. ఇంకోసారి అన్యాయం జరిగింది కాబట్టి ఇలా చేస్తున్నాడంటాడు. తల్లిదండ్రుల్ని చంపిన వాణ్ని చంపడం వరకు పగ ఉంటుంది కానీ.. మొత్తం జనాల మీద పగబట్టి, మాఫియా డాన్ కావాలనుకోవడం ఏంటో?
సడెన్ గా ముంబయికి వస్తాడు.. ఆ సిటీని ఉచ్చపోయిస్తానంటాడు.. వాళ్లనీ వీళ్లనీ కొట్టి డాన్ అయిపోతాడు.. దందాలు చేసేస్తాడు.. పోలీసులు, పొలిటీషియన్లు.. ఎవ్వరూ అతణ్నే చేయలేరు. సూర్య భాయ్ ఎదిగిన తీరు చూస్తే సినిమా చూసే జనాలక్కూడా.. దేశాన్ని వణికించేసే డాన్ అయిపోవడం ఇంత సులువా అనిపించేస్తుంది. సూర్య-చిత్రల లవ్ స్టోరీ కూడా పేలవంగా ఉంది. అసలు సూర్యను చిత్ర ప్రేమించడానికి సరైన కారణమే కనిపించదు. మొదట చిత్రను తన పని కోసం వాడుకోవడానికి ప్రేమించినట్లు నటించానని చెప్పే సూర్య.. తర్వాత ఆమెతో నిజంగానే ప్రేమలో ఉన్నానంటాడు. అందుకు కూడా సరైన రీజనింగ్ ఉండదు.
ఇక సినిమాలో ప్లస్ పాయింట్ అంటే మహేష్ బాబే. మొత్తం తన భుజాలపైనే నడిపించాడు. ఒక్క కమెడియనూ లేని ఈ సినిమాలో ఏకైక ఎంటర్టైనర్ అతనొక్కడే. నటనలో కొత్తదనం చూపకపోయినా.. పాత స్టయలే కొనసాగించినా పూరి డైలాగుల్ని తనదైన శైలిలో పలికి అభిమానుల్ని అలరించాడు. కాజల్ క్యారెక్టర్ వేస్ట్. చందమామ పాటలో గ్లామరస్ గా కనిపించింది. ఈ పాటలో ‘లిప్ కిస్’ ఓ సర్ప్రైజ్. థమన్ సంగీతంలో ‘సార్ వస్తారా’, ‘ముంబయ్’ పాటలు పర్వాలేదు. పూరి జగన్నాథ్ డైలాగులు చాలావరకు పేలాయి. ఇప్పటికే డైలాగులు పాపులరయ్యాయి కాబట్టి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఐతే పూరికి బూతంటే అంత ప్రేమ ఎందుకో? పోకిరి సమయంలో బయటపడిన అతని బూతు పిచ్చి.. తర్వాత క్రమక్రమంగా పెరిగి, బిజినెస్ మేన్ తో పరాకాష్టకు చేరింది. ఒకప్పుడు సినిమాల్లో ఊహించడానికీ భయపడే బూతుల్ని పూరి కొంచెం కూడా ఆలోచించకుండా రాసిపారేస్తున్నాడు. సినిమాలో కనీసం పది చోట్ల అతని బూతులకు కట్ పడింది. ఉచ్చపోయించడమనే మాటనే అదేపనిగా ప్రచారం చేయిస్తున్న పూరి.. లం..కొడకా లాంటి బూతుల్ని విస్తృతంగా వాడేశాడు. మాట కట్ చేసినంత మాత్రాన ఏం లాభం.. ఆ పలుకేంటో స్పష్టంగా అర్థమవుతుంటే. జనాలు వాడుతున్నారనో, ఓ వర్గం ప్రేక్షకులు ఇలాంటివి ఇష్టపడతారనో సినిమాల్ని బూతుమయం చేయడం ఎంతవరకు కరెక్ట్? పూరి బూతు ప్రేమ మాటలకే పరిమితం కాలేదు. పాటల కొరియోగ్రఫీ కూడా అతని టేస్టుకు తగ్గట్లే సాగింది. ఆ ఊపుళ్ల గురించి, తట్టడాల గురించి మాటల్లో చెప్పడం కష్టం. సినిమా చూసి తరించాల్సిందే.
ప్రిన్స్ ని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చవచ్చు. పూరి మాస్ ను ఆకట్టుకునే డైలాగ్స్ రాశాడు కాబట్టి ఆ వర్గం వారూ సినిమాను ఇష్టపడొచ్చు. కానీ సగటు ప్రేక్షకుణ్ని మాత్రం బిజినెస్ మేన్ నిరాశపరుస్తుంది. అర్థవంతమైన కథాకథనాలుండాలని, సినిమాలో కాస్తైనా కొత్తదనం ఉండాలని కోరుకునే వారు ఈ వ్యాపారి జోలికెళ్లవద్దు. 2 వేల థియేటర్లలో రిలీజ్ చేశారు కాబట్టి, మహేష్ దూకుడు మీదున్నాడు కాబట్టి, బాడీగార్డ్ మినహా పోటీ లేదు కాబట్టి కలెక్షన్ల పరంగా బిజినెస్ మేన్ ఒకటి రెండు వారాలు బాక్సాఫీస్ ను కొల్లగొట్టొచ్చు. రికార్డులు కూడా బద్దలు కొట్టొచ్చు. కానీ ఆ తర్వాత మాత్రం థియేటర్లలో నిలబడటం చాలా కష్టం.[/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif] [/font][/color]

Link to comment
Share on other sites

[quote name='Ispate Raju' timestamp='1326517639' post='1301301054']
[color=#333333][font=helvetica, arial, sans-serif]రెండేళ్లకో సినిమా పూర్తి చేస్తాడని పేరున్న మహేష్ బాబుతో పూరి జగన్నాథ్ 74 రోజుల్లో సినిమా ఎలా తీసేశాడబ్బా అని కొన్ని రోజులుగా ఒకటే డౌటు. కానీ బిజినెస్ మేన్ చూశాక అర్థమైంది.. అర్థం పర్థం లేని కథతో, క్యారెక్టర్లతో.. ఏమాత్రం కొత్తదనం లేని కథనంతో.. తానిప్పటికే ఎన్నోసార్లు వడ్డించిన సన్నివేశాలతో.. పూరి జగన్నాథ్ శరవేగంగా సినిమాను ఎలా పూర్తి చేయగలిగాడో. ఇలాంటి సినిమాను 74 రోజులేంటి.. 47 రోజుల్లోనూ పూర్తి చేసేయొచ్చు.[/font][/color]
[color=#333333][font=helvetica, arial, sans-serif]మాఫియా డాన్ ల శకం ముగిసిన ముంబయిలోకి సూర్య (మహేష్ బాబు) అడుగుపెట్టడంతో కథ మొదలవుతుంది. పెద్ద డాన్ కావాలన్నది అతని ఆశయం (డాన్ శీనులో రవితేజలా కామెడీగా కాదు.. చాలా సీరియస్). వెంటనే రంగంలోకి దిగిపోతాడు. కొందరు రౌడీల్ని కొట్టి, వాళ్లతోనే గ్యాంగ్ ఏర్పాటు చేస్తాడు. దందాలు మొదలుపెడతాడు. అదే సమయంలో కమిషనర్ (నాజర్) కూతురు చిత్ర (కాజల్)ను ప్రేమలోకి దింపుతాడు. కేంద్ర మంత్రి జైదేవ్ (ప్రకాష్ రాజ్)ను ఎదిరించి మరీ సూర్య తాను కోరుకున్న లాలు (షాయాజి షిండే)ను ముంబయి మేయర్ గా చేయడంతో ఇద్దరికీ ఘర్షణ మొదలవుతుంది. ఐతే సూర్య.. జైదేవ్ ను టార్గెట్ చేయడానికి ఓ కారణముంటుంది. అదేంటి? ఇంతకీ సూర్య ఎందుకు డాన్ కావాలనుకుంటాడు? చివరికతను ఏం చేశాడు అనేది మిగిలిన కథ.[/font][/color]
[color=#333333][font=helvetica, arial, sans-serif]పూరి జగన్నాథ్ కు మాఫియా కథలంటే ఎంతో ఇష్టం ఉండొచ్చుగాక.. అంతమాత్రాన తన ప్రతి సినిమాలోనూ మాఫియా విందే వడ్డిస్తానంటే ఎలా? అదే డాన్ లు, అదే పోలీసులు.. అవే గన్నులు.. అవే కాల్పులు.. అవే ఫైట్లు.. అవే డైలాగులు.. ఎన్నాళ్లు చూడాలి స్వామీ ఈ సినిమాల్ని? అర్థం లేని కథ ఇది. పోకిరి సినిమాలో హీరో రౌడీల్ని చంపవతల పడేస్తుంటే.. హీరోయిన్ అవి చూసి ఏడుస్తూ నువ్వు మనిషివేనా? మానవత్వం లేదా? ఇలా చంపేస్తున్నావేంటి? అంటుంది. బిజినెస్ మేన్ కూడా మహేష్ ఆ పనే చేస్తుంటాడు. కానీ ఈసారి ఏడ్చేది.. అతణ్ని ప్రశ్నించేది కాజల్. అంతే తేడా. పోకిరి హీరో ప్రవర్తనకు ఓ కారణమంటూ ఉంటుంది. కానీ ఇందులో హీరో ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు. అతని ఫ్లాష్ బ్యాక్ కూడా దాన్ని జస్టిఫై చేయదు. పూరి జగన్నాథ్ సినిమాల్లో కన్ఫ్యూజింగ్ గా.. తిక్కతిక్కగా ఉండే హీరో క్యారెక్టరైజేషనే హైలైట్ అవుతుంటుంది. ఐతే ఆ తిక్కకు మొదట్లోనో, చివర్లోనో ఎక్కడో ఓ చోట ఓ జస్టిఫికేషన్ ఉండేది. కానీ బిజినెస్ మేన్ లో అలా లేదు. సూర్య క్యారెక్టర్ తిక్కకు ఓ హద్దూ పద్దూ లేదు.. ఓసారి దేశాన్ని ఏలాలంటాడు.. ఇంకోసారి చోర్ సాలేగాళ్లనంతా ఏరేయాలంటాడు.. ఇంకోసారి అన్యాయం జరిగింది కాబట్టి ఇలా చేస్తున్నాడంటాడు. తల్లిదండ్రుల్ని చంపిన వాణ్ని చంపడం వరకు పగ ఉంటుంది కానీ.. మొత్తం జనాల మీద పగబట్టి, మాఫియా డాన్ కావాలనుకోవడం ఏంటో?
సడెన్ గా ముంబయికి వస్తాడు.. ఆ సిటీని ఉచ్చపోయిస్తానంటాడు.. వాళ్లనీ వీళ్లనీ కొట్టి డాన్ అయిపోతాడు.. దందాలు చేసేస్తాడు.. పోలీసులు, పొలిటీషియన్లు.. ఎవ్వరూ అతణ్నే చేయలేరు. సూర్య భాయ్ ఎదిగిన తీరు చూస్తే సినిమా చూసే జనాలక్కూడా.. దేశాన్ని వణికించేసే డాన్ అయిపోవడం ఇంత సులువా అనిపించేస్తుంది. సూర్య-చిత్రల లవ్ స్టోరీ కూడా పేలవంగా ఉంది. అసలు సూర్యను చిత్ర ప్రేమించడానికి సరైన కారణమే కనిపించదు. మొదట చిత్రను తన పని కోసం వాడుకోవడానికి ప్రేమించినట్లు నటించానని చెప్పే సూర్య.. తర్వాత ఆమెతో నిజంగానే ప్రేమలో ఉన్నానంటాడు. అందుకు కూడా సరైన రీజనింగ్ ఉండదు.
ఇక సినిమాలో ప్లస్ పాయింట్ అంటే మహేష్ బాబే. మొత్తం తన భుజాలపైనే నడిపించాడు. ఒక్క కమెడియనూ లేని ఈ సినిమాలో ఏకైక ఎంటర్టైనర్ అతనొక్కడే. నటనలో కొత్తదనం చూపకపోయినా.. పాత స్టయలే కొనసాగించినా పూరి డైలాగుల్ని తనదైన శైలిలో పలికి అభిమానుల్ని అలరించాడు. కాజల్ క్యారెక్టర్ వేస్ట్. చందమామ పాటలో గ్లామరస్ గా కనిపించింది. ఈ పాటలో ‘లిప్ కిస్’ ఓ సర్ప్రైజ్. థమన్ సంగీతంలో ‘సార్ వస్తారా’, ‘ముంబయ్’ పాటలు పర్వాలేదు. పూరి జగన్నాథ్ డైలాగులు చాలావరకు పేలాయి. ఇప్పటికే డైలాగులు పాపులరయ్యాయి కాబట్టి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఐతే పూరికి బూతంటే అంత ప్రేమ ఎందుకో? పోకిరి సమయంలో బయటపడిన అతని బూతు పిచ్చి.. తర్వాత క్రమక్రమంగా పెరిగి, బిజినెస్ మేన్ తో పరాకాష్టకు చేరింది. ఒకప్పుడు సినిమాల్లో ఊహించడానికీ భయపడే బూతుల్ని పూరి కొంచెం కూడా ఆలోచించకుండా రాసిపారేస్తున్నాడు. సినిమాలో కనీసం పది చోట్ల అతని బూతులకు కట్ పడింది. ఉచ్చపోయించడమనే మాటనే అదేపనిగా ప్రచారం చేయిస్తున్న పూరి.. లం..కొడకా లాంటి బూతుల్ని విస్తృతంగా వాడేశాడు. మాట కట్ చేసినంత మాత్రాన ఏం లాభం.. ఆ పలుకేంటో స్పష్టంగా అర్థమవుతుంటే. జనాలు వాడుతున్నారనో, ఓ వర్గం ప్రేక్షకులు ఇలాంటివి ఇష్టపడతారనో సినిమాల్ని బూతుమయం చేయడం ఎంతవరకు కరెక్ట్? పూరి బూతు ప్రేమ మాటలకే పరిమితం కాలేదు. పాటల కొరియోగ్రఫీ కూడా అతని టేస్టుకు తగ్గట్లే సాగింది. ఆ ఊపుళ్ల గురించి, తట్టడాల గురించి మాటల్లో చెప్పడం కష్టం. సినిమా చూసి తరించాల్సిందే.
ప్రిన్స్ ని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చవచ్చు. [/font][/color][color=#ff0000][font=helvetica, arial, sans-serif][b]పూరి[/b][/font][/color][color=#333333][font=helvetica, arial, sans-serif] మాస్ ను ఆకట్టుకునే [/font][/color][b][color=#ff0000][font=helvetica, arial, sans-serif]డైలాగ్స్ [/font][/color][/b][color=#333333][font=helvetica, arial, sans-serif]రాశాడు కాబట్టి ఆ వర్గం వారూ సినిమాను [/font][/color][b][color=#ff0000][font=helvetica, arial, sans-serif]ఇష్టపడొచ్చు[/font][/color][/b][color=#333333][font=helvetica, arial, sans-serif]. [/font][/color][b][color=#ff0000][font=helvetica, arial, sans-serif]కానీ సగటు ప్రేక్షకుణ్ని మాత్రం బిజినెస్ మేన్ నిరాశపరుస్తుంది.[/font][/color][/b][color=#333333][font=helvetica, arial, sans-serif] అర్థవంతమైన కథాకథనాలుండాలని, సినిమాలో కాస్తైనా కొత్తదనం ఉండాలని కోరుకునే వారు ఈ వ్యాపారి జోలికెళ్లవద్దు. 2 వేల థియేటర్లలో రిలీజ్ చేశారు కాబట్టి, మహేష్ దూకుడు మీదున్నాడు కాబట్టి, బాడీగార్డ్ మినహా పోటీ లేదు కాబట్టి కలెక్షన్ల పరంగా బిజినెస్ మేన్ ఒకటి రెండు వారాలు బాక్సాఫీస్ ను కొల్లగొట్టొచ్చు. రికార్డులు కూడా బద్దలు కొట్టొచ్చు. కానీ ఆ తర్వాత మాత్రం థియేటర్లలో నిలబడటం చాలా కష్టం.[/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif] [/font][/color]
[/quote]

idhe naa view

Link to comment
Share on other sites

×
×
  • Create New...