Jump to content

Valmiki Ramayanam --Bala Kanda 2Nd Part


vikings

Recommended Posts

[b] 2వ దినము, బాలకాండ[/b]


అలా కొంత కాలం గడిచాక, ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దెగ్గరికి వచ్చి ఇలా అన్నాడు.......అయ్యా! నేను సంతానహీనుడిని, నాకు చాలా దిగులుగా ఉంది, నాకు సంతానం కలగకుండ ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడుతోందొ, ఆ పాపాన్ని పరిహరించుకోడానికి వేదము చేత నిర్ణయింపబడిన అశ్వమేథ యాగాన్ని మీరు నాతొ చేయించాలి అని కాళ్ళు పట్టి ప్రార్ధించాడు. అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు......యాగం చెయ్యాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందొ ఆనాడే నీకు మంచి జెరగడం మొదలయ్యింది. కావున నీకు శూరులు, లోకముచేత కీర్తింపబడే నలుగురు కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు.

[b]చైత్ర మాసం[/b]లొ [b]చిత్రా నక్షత్రం[/b]తొ వచ్చే [b]పౌర్ణమి[/b] నాడు యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టి, దానికి ప్రోక్షణ, స్నాపన, విమోచన చేశారు. ఇంకా కొన్ని ఇతరమైన క్రతువులు చేశాక ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టారు. అది అలా ఒక [b][color=#6aa84f]12[/color][/b] నెలలు తిరుగుతుంది, దాని వెనకాల మహా శూరులైన వాళ్ళు వెళతారు. ఆ అశ్వం తిరిగొచ్చేలోపు అంటె [b]ఫాల్గుణ మాసం[/b]లొ వచ్చె అమావాస్యకి రాజు యాగశాల ప్రవేశం చెయ్యాలి. కాబట్టి దశరథ మహారాజు ఋష్యశృంగుడిని, వశిష్ఠుడిని పిలిచి యాగం ప్రారంభించాల్సిందిగా కోరాడు. ఆ యాగానికి ఇతర దేశాల నుండి రాజులను, ప్రజలను, జానపదులను, వేద బ్రాహ్మణులను, విద్వాంసులను ఆహ్వానించాడు. వచ్చిన వాళ్ళందరికి భోజనాలు పెట్టారు. పల్లెటూర్లనుంచి వచ్చిన వాళ్ళని అశ్రద్ధగా చూడకండి, భోజనం పెట్టేటప్పుడు అందరికీ శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పాడు.

[color=red]సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః |[/color]
[color=red]న చ అవజ్ఞా ప్రయోక్తవ్యా కామ క్రోధ వశాత్ అపి ||[/color]

పది మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది కామక్రోధాలకిలోనై అనరాని మాటలు మాట్లాడితే, మీరు నవ్వి వచ్చెయ్యండి, పట్టించుకోమాకండి. భోజనం చెయ్యడానికి పంక్తిలొ కూర్చున్నవాడు అతిధి రూపంలొ ఉన్న సాక్షాత్తు భగవంతుడు, కాబట్టి మర్యాదలకి ఎటువంటి లోటు రాకూడదు అని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు. అలాగే [b]జనక మహారాజు[/b], [b]కాశి రాజు[/b], [b]రోమపాద రాజు[/b], [b]కైకేయ రాజు[/b]ని పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులనే వెళ్ళమని చెప్పి, అందరికి విడిది ఏర్పాటుచెయ్యండి అని ఆదేశించాడు. అలా వచ్చిన వాళ్ళందరికి భోజనాలు పెడుతున్నారు....

[color=red]వృద్ధాః చ వ్యాధితాః చ ఏవ స్త్రీ బాలాః తథా ఏవ చ |[/color]
[color=red]అనిశం భుంజమానానాం న తృప్తిః ఉపలభ్యతే ||[/color]

అక్కడికి వచ్చినవాళ్ళల్లో వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, స్త్రీలు, చిన్ని చిన్ని పిల్లలు ఉన్నారు. భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళంతా, ఆహ! భోజనాలు ఏమి రుచిగా ఉన్నాయి అని అంటున్నారు. ఇంత రుచికరమైన భోజనాలు మళ్ళి ఎప్పుడు తింటామో అని అనుకుంటున్నారు. దశరథ మహారాజు వాళ్ళందరిని చూసి, ఇంకా తినండి, ఇంకా తినండి అంటున్నాడు. వచ్చిన వాళ్ళందరికి ధనము, వస్త్రములు దానం చేశాడు దశరథుడు. వచ్చినవాళ్ళందరూ "ఆహ! ఎంతచక్కని భోజనం పెట్టావు రాజ, ఎంత గొప్ప వస్త్రాలు ఇచ్చావయ్య, నీ కోరిక తీరి, నీకు సుపుత్రులు కలిగి, నీ వంశము ఆచంద్ర తారార్కంగా వర్ధిల్లుతుందని ఆశీర్వదించి వెళ్లారు.


ఆ యాగశాలని చాలా అద్భుతంగా నిర్మించారు, ఆ యాగశాలలొ [b]21[/b][color=#6aa84f] [/color][b]యూప స్తంభాలని[/b] పాతారు, [b]మారేడు[/b] కర్రలతొ చేసినవి [b]6[/b], [b]మోదుగు[/b] కర్రలతొ చేసినవి [b]6[/b], [b]ఛండ్ర[/b] కర్రలతొ చేసినవి [b]6[/b], [b]దేవదారు[/b] కర్రలతొ చేసినవి [b]2[/b] మరియు [b]శ్లేష్మాతక[/b] కర్రతొ చేసినది ఒకటి ఉంటుంది. దశరథుడు [b]శుక్ల యజుర్వేదానికి[/b] చెందిన వాడు కనుక, దానికి అనుగుణంగా ఆ యాగశాలని నిర్మించారు. ఎంతో శాస్త్రయుక్తంగా ఆ యాగం జెరుగుతుంది. చివర్లో ఆ యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఆ యూప స్తంభానికి కట్టారు. పట్టమహిషి అయిన కౌసల్య మూడు కత్తులతొ ఆ యాగాశ్వాన్ని వధించింది. ఆ రోజు రాత్రి ఓ శాలలొ కౌసల్య ఆ గుర్రం పక్కన పడుకొని ఉండాలి.

మరుసటి రోజున ఈ యాగం చేయించిన ఋత్విక్కులకి, రాజు 4 భార్యలని దానం చెయ్యాల్సి ఉంటుంది. మొదట [b]పట్టమహిషి[/b][color=#6aa84f][color=black]ని[/color][/color], [b]ఉపేక్షిత భార్య[/b]ని, [b]ఉంపుడుగత్తె[/b]ని, చివరిగా [b]ఫాలాకలి[/b]ని దానం చేస్తాడు. ఆ ఋత్విక్కులు ఆ నలుగురు భార్యలని తిరిగి రాజుకి ఇచ్చేస్తారు. అప్పుడు ఆ రాజు తన భార్యలను తీసుకొని ఆ ఋత్విక్కులకి ద్రవ్యాన్ని(ధనం) దానం ఇస్తాడు. ఇప్పుడు ఆ గుర్రం శరీరంలోనుంచి [b]వప[/b](జంతువుల కడుపులొ బొడ్డు కింద వుండే ఉల్లిపొర వంటి కొవ్వు) ని తీసి ఆ అగ్నిలొ వేశారు. ఆ వప అగ్నిలొ కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చాలి, దీనినె అశ్వమేథయాగం అంటారు. అలా పీలిస్తే, తనకి సంతానం కలగకుండా ఏ పాపం అడ్డుపడుతుందొ, ఆ పాపం పోతుంది. చివరగా ఆ గుర్రం శరీరంలోని మిగతా భాగాలని ఆ హోమంలొ హవిస్సుగా సమర్పిస్తారు.

దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేథయాగం చేయించిన ఋత్విక్కులకి దానం చేశాడు, అప్పుడు వాళ్ళు మేము ఈ భూభారాన్ని వహించాలేము, నువ్వు రాజువి, నువ్వే పరిపాలించాలి అని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకే ఇస్తారు. దక్షిణలేని యాగం జెరగకూడదు కనుక, దశరథ మహారాజు ఆ ఋత్విక్కులకి [b]10 లక్షల[/b] గోవుల్ని, [b][color=#6aa84f]100 కోట్ల[/color] [/b]బంగారు నాణాలని, [b]400 కోట్ల[/b] వెండి నాణాలని దానం చేశాడు. అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ ఒక [b][color=#6aa84f]కోటి[/color] [/b]బంగారు నాణాలని దానం చేశాడు. ఋష్యశృంగ మహర్షి లేచి....ఓ రాజా! నీకు సంతానం కలగడం కోసం, నేను [b]అధర్వ వేదం[/b]లో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన యిష్టిని చేయిస్తాను. అదే పుత్రకామేష్టి యాగం అని చెప్పి ఆ యిష్టి చెయ్యడం ప్రారంభించారు.......

[color=red]తతో దేవాః స గంధర్వాః సిద్ధాః చ పరమ ఋషయః | [/color]
[color=red]భాగ ప్రతిగ్రహార్థం వై సమవేతా యథావిధి ||[/color]

ఆ యిష్టి జెరుతున్నప్పుడు, అందులో తమ తమ భాగాలని పుచ్చుకోడానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు మొదలైనవారు అందరూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు. అందరూ ఆయన దెగ్గరికి వెళ్లి, " పితామహ! మీరు ఆ రావణుడి తపస్సుకి మెచ్చి ఆయనకి అనేక వరములు ఇచ్చారు, మీరు ఇచ్చిన వరముల వలన గర్వంపొంది వాడు ఈనాడు.....

[color=red]నైనం సూర్యః ప్రతపతి పార్శ్వే వాతి న మారుతః |[/color]
[color=red]చలోర్మిమాలీ తం దృష్ట్వా సముద్రోపి న కంపతే ||[/color]

రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు, సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది, వాయువు రావణుడి దెగ్గర అవసరంలేకపోయినా మెల్లగా వీస్తుంది, ఈ రకంగా వాడు దిక్పాలకులని బాధపెడుతున్నాడు, ఎక్కడా యజ్ఞములు జెరగనివ్వడంలేదు, ఋషులని హింసిస్తున్నాడు, పర భార్యలని తన వారిగా అనుభవిస్తున్నాడు. ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించె మార్గం చెప్పవలసింది" అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు. అప్పుడు బ్రహ్మగారు " నేనూ వాడి అకృత్యాలు వింటున్నాను, వాడు తపస్సుతో నన్ను మెప్పించి, రాక్షసుల చేత, దేవతల చేత, యక్షుల చేత, గంధర్వ కిన్నెర కింపురుషుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు, కాని వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరాలని అడగలేదు" అని అన్నారు. అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు.

ఒకరు పిలిచారా లేదా అని చూడకుండా, అంతా నిండిపోయిన పరమాత్మ, ఎంతో దయాముర్తి అయిన [b]శ్రీ మహావిష్ణువు[/b] ఆ సభ మధ్యలొ తనంతట తానుగా వచ్చారు....

[color=red]ఏతస్మిన్ అనంతరే విష్ణుః ఉపయాతో మహాద్యుతిః |[/color]
[color=red]శఙ్ఖ చక్ర గదా పాణిః పీత వాసా జగత్పతిః ||[/color]

ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందొ, అందమైన రూపంతొ, మెడలొ వైజయంతి మాలతొ, శంఖ చక్ర గధ పద్మాలని పట్టుకొని శ్రీమహా విష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు......

[color=red]హత్వా క్రూరం దురాధర్షం దేవ ఋషీణాం భయావహం |[/color]
[color=red]దశ వర్ష సహస్రాణి దశ వర్ష శతాని చ ||[/color]
[color=red]వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృధ్వీం ఇమాం |[/color]
[color=red]ఏవం దత్వా వరం దేవో దేవానాం విష్ణుః ఆత్మవాన్ ||[/color]

మీరెవరు కంగారు పడొద్దు, రావణుడు చేసే అక్రుత్యాలన్ని నాకు తెలుసు, వాడిని సంహరించడానికి నేనే [b]మనుష్యుడిగా[/b] జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను. నన్ను నమ్ముకున్న దేవతలని, ఋషులని క్రూరంగా బాధపెడుతున్నాడు, అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద [b]పదకొండు వేల సంవత్సరాలు[/b] ఉండి ఈ పృథ్వి మండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవానుడు అన్నాడు.

[color=red]తతః పద్మ పలాశాక్షః కృత్వా ఆత్మానం చతుర్విధం |[/color]
[color=red]పితరం రోచయామాస తదా దశరథం నృపం ||[/color]

నేనే నలుగురిగా ఈ దశరథ మహారాజుకి పుడతాను అని ప్రతిజ్ఞ చేశారు.


అక్కడ ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగం పూర్తవబోతుంది. ఇంతలో ఆ యోగాగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి, చేతిలొ వెండి మూత కలిగిన ఒక బంగారు పాయస పాత్ర పట్టుకొని, సింహంలా నడుస్తూ బయటకి వచ్చి దశరథ మహారాజుని పిలిచాడు. దశరథుడు ఆయనకి నమస్కరించి నేను మీకు ఏమిచెయ్యగలను అన్నాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు " నాయనా దశరథా! నన్ను[b]ప్రాజాపత్ర్య పురుషుడు[/b] అంటారు, నన్ను [b]ప్రజాపతి[/b] పంపించారు, ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించడం వల్ల నీ రాజ్యంలోని వాళ్ళు ధన ధాన్యాలతో తులతూగుతారు, ఆరోగ్యంతొ ఉంటారు" అని చెప్పి వెళ్ళిపోయాడు.

వెంటనే దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు పత్నులకి ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు. ముగ్గురినీ పిలిచి, ఆ పాయసంలొ సగభాగం కౌసల్యకి ఇచ్చాడు, మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు, ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి, ఒక భాగాన్ని కైకేయకి మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు.

యాగం పూర్తయ్యాక, అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు. రుష్యశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి, ఆయనని సత్కరించి శాంతా రుష్యశృంగులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. ఆ యాగానికి వచ్చిన వాళ్ళందరిని తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు.

కొంత కాలానికి దశరథ మహారజులోని తేజస్సు ఆయన భార్యలలోకి ప్రవేశించి వాళ్ళు గర్భవతులయ్యారు.

[color=red]తతః చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ |[/color]
[color=red]నక్క్షత్రే అదితి దైవత్యే స్వ ఉచ్ఛ సంస్థేషు పంచసు ||[/color]
[color=red]గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా ఇందునా సహ |[/color]
[color=red]ప్రోద్యమానే జగన్నాథం సర్వ లోక నమస్కృతం ||[/color]

జగన్నాధుడైన వాడు, సర్వలోకాల చేత నమస్కారింపబడే వాడు [b]12[/b] నెలలు [b]కౌసల్య[/b] గర్భవాసం చేసి, [b]చైత్ర మాసం[/b]లొ, [b]నవమి తిథి[/b] నాడు, [b]పునర్వసు[/b][color=#6aa84f] [/color][b] నక్షత్రం[/b]లొ, [b]కర్కాటక లగ్నం[/b]లొ [b]రామచంద్రమూర్తి[/b] జన్మించారు. అదే సమయంలొ [b]కైకేయ[/b]కి [b]పుష్యమి నక్షత్రం[/b]లొ, [b]మీన లగ్నం[/b]లొ [b]భరతుడు[/b] జన్మించాడు. తరువాత [b]సుమిత్ర[/b]కి [b]లక్ష్మణుడు[/b], [b]శత్రుఘ్నుడు[/b] జన్మించారు.

తనకి నలుగురు కుమారులు పుట్టారని తెలిసి ఆ దశరథుడు చాలా ఆనందపడ్డాడు. కోసల దేశంలోని ప్రజలంతా సంబరాలు జెరుపుకున్నారు. అదే సమయంలొ బ్రహ్మ గారు దేవతలతొ ఒక సభ తీర్చారు......" శ్రీమహా విష్ణువు భూలోకంలొ రాముడిగా అవతరించారు, రావణసంహారంలొ రాముడికి సహాయం చెయ్యడానికి మీరు మీ అంశలతో కొంతమందిని సృష్టించండి. [b]పార్వతీదేవి[/b] శాపం వల్ల మీకు మీ భార్యలవల్ల సంతానం కలగదు, కావున మీతో సమానమైన తేజస్సు, పరాక్రమము కలిగిన వానరాలని గంధర్వ, అప్సరస, కిన్నెర స్త్రీలందు కనండి" అని చెప్పారు. దేవతలందరూ రామకార్యం కోసం పుట్టడం మన అదృష్టమని ఆనందపడ్డారు.

Link to comment
Share on other sites

అప్పుడు బ్రహ్మ " ఒకసారి నాకు ఆవలింతవచ్చింది, అప్పుడు నా నోట్లోనుంచి ఒకడు కిందపడ్డాడు, అతనే [b]జాంబవంతుడు[/b]. ఇక మీరు సృష్టించండి" అని అన్నారు. [b]ఇంద్రుడి[/b] అంశతొ [b]వాలి[/b] జన్మించాడు, [b]సూర్యుడి[/b] అంశతొ [b]సుగ్రీవుడు[/b] జన్మించాడు, [b]బృహస్పతి[/b] అంశతొ [b]తారుడు[/b] జన్మించాడు, [b]కుబేరుడి[/b] అంశతొ [b][color=#6aa84f]గంధమాదనుడు[/color] [/b]జన్మించాడు, [b]అశ్విని దేవతల[/b] అంశతొ [b]మైందుడు[/b], [b]ద్వివిదుడు[/b] జన్మించారు, [b]అగ్ని[/b] అంశతొ [b]నీలుడు[/b] జన్మించాడు, [b]వాయువు[/b] అంశతొ [b]హనుమంతుడు[/b] జన్మించాడు, [b]పర్జన్యుడికి[/b][color=#6aa84f] [/color][b]శరభుడు[/b], [b]వరుణుడికి[/b][color=#6aa84f] [/color][b]సుషేణుడు[/b] జన్మించాడు. దేవతలు ఇలా సృష్టించడం చుసిన ఋషులు మేము కూడా సృష్టిస్తాం అని కొన్ని కోట్ల కోట్ల వానరాలని సృష్టించారు.

[color=red]అతీత్య ఏకాదశ ఆహం తు నామ కర్మ తథా అకరోత్ |[/color]
[color=red]జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీ సుతం ||[/color]
[color=red]సౌమిత్రిం లక్ష్మణం ఇతి శత్రుఘ్నం అపరం తథా |[/color]
[color=red]వసిష్ఠః పరమ ప్రీతో నామాని కురుతే తదా ||[/color]

రాముడు పుట్టిన [b]11[/b] రోజులకి జాతాసౌచం పోయాక ఆయనకి [b]నామకరణం[/b] చేయించారు కులగురువైన వశిష్ఠ మహర్షి, సర్వజనులు ఆయన గుణములు చూసి పొంగిపోయెదరు కనుక ఆయనకి [b]రామ[/b] ([b]రా[/b] అంటె [b]అగ్ని బీజం[/b], [b]మ[/b] అంటె [b]అమృత బీజం[/b]) అని, సుమిత్ర కుమారుడైన సౌమిత్రి అపారమైన లక్ష్మి సంపన్నుడు (రామ సేవే ఆయన లక్ష్మి) కనుక ఆయనకి [b]లక్ష్మణ[/b] అని, కైకేయ కుమారుడు భరించే గుణము కలవాడు కనుక ఆయనకి [b]భరత[/b] అని, శత్రువులను (అంతః శత్రువులు) సంహరించగలవాడు కనుక [b]శత్రుఘ్ను[/b] అని నామకరణం చేశారు వశిష్ఠ మహర్షి.

తన కుమారులు పెరిగి పెద్దవారవుతుంటె వాళ్ళని చూసుకొని దశరథుడు ఎంతో మురిసిపోయాడు. వాళ్ళు అన్ని వేదాలు, అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఎల్లప్పుడు గురువులని పూజించేవాళ్ళు. లోకంలోని అందరి హితం కోరుకునేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ తండ్రిగారికి సేవ చేసేవాళ్ళు. రాముడు జులపాల జుట్టుతొ రాజమార్గంలొ వెళుతుంటె చూసిన దశరథుడికి తను యవ్వనంలొ ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో రాముడు కూడా అలానే ఉన్నాడనిపించేది. అలా లేక లేక పుట్టిన పిల్లలని చూసుకుంటూ ఆ రాజదంపతులు హాయిగా కాలం గడిపారు.

అలా కొంతకాలం గడిచాక, ఒకనాడు దశరథ మహారాజు సభలొ ఇలా అన్నారు " నా పిల్లలకి [b]12[/b] సంవత్సరాల వయస్సు దాటింది, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, కాబట్టి వాళ్ళకి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను, తగిన సంబంధాలని వెతకమని దశరథుడు అంటుండగా ఆ సభలోకి ఎవరూ అనుకోని విధంగా [b]విశ్వామిత్రుడు[/b] వచ్చాడు. వెంటనే దశరథుడు లేచి ఆయనకి ఎదురొచ్చి స్వాగతం పలికాడు. మీరు మా రాజ్యానికి రావడం మా అదృష్టం, మీలాంటి గొప్ప మహర్షులు ఊరకనే రారు, కాబట్టి మీ కోరికేదైన నేను సంతోషంగా తీరుస్తాను అని దశరథుడు అన్నాడు.

అప్పుడు విశ్వామిత్రుడు " దశరథ! నీకు సామంత రాజులందరూ లొంగి ఉన్నారా, దానధర్మాలు సక్రమంగా చేస్తున్నావా, మంత్రులందరూ నీకు సాచివ్యం చేస్తున్నారా అని పలు కుశల ప్రశ్నలు వేసి, నాకు ఒక కోరిక ఉంది, నువ్వు తీర్చాలి" అన్నాడు.

[color=red]స్వ పుత్రం రాజ శార్దూల రామం సత్య పరాక్రమం |[/color]
[color=red]కాక పక్ష ధరం శూరం జ్యేష్ఠం మే దాతుం అర్హసి ||[/color]

నీ పెద్దకొడుకైన రాముడిని నాతో పంపిస్తావా, మా యాగాలకి అడ్డువస్తున్న రాక్షసులని వధించడానికి తీసుకు వెళతాను, అని విశ్వామిత్రుడు అన్నాడు. ఈ మాట విన్న దశరథుడు కిందపడిపోయాడు.

[color=red]ఊన షోడశ వర్షో మే రామో రాజీవ లోచనః |[/color]
[color=red]న యుద్ధ యోగ్యతాం అస్య పశ్యామి సహ రాక్షసైః ||[/color]

మెల్లగా తేరుకొన్న దశరథుడు, ఇంకా 16 సంవత్సరాలు కూడా నా రాముడికి రాలేదు, ఆ రాక్షసులని ఎలా సంహరించగలడ, కావాలంటె నేను నా చతురంగ బలాలతొ వచ్చి ఆ రాక్షస సంహారం చేస్తాను, పోనీ రాముడే రావాలంటె, రాముడితొ నేను కూడా వస్తాను అని దశరథుడు ప్రాధేయపడ్డాడు.

రాముడు పిల్లవాడు, ఏమిచెయ్యలేడు అని నువ్వు అనుకుంటున్నావు, కాని రాముడంటె ఎవరో నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు. రాముడు రాక్షసులను వధించి తప్పక తిరిగివస్తాడు. నువ్వు తండ్రివి కనుక, నీకు రాముడిమీద ఉన్న పుత్రవాత్సల్యంవల్ల నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, రాముడిని నాతో పంపించు అని విశ్వామిత్రుడు అడిగాడు.

అప్పుడు దశరథుడు " లేక లేక పుట్టిన నా కొడుకుని, నన్ను విడిచిపెట్టు " అన్నాడు. ఈ మాటలు విన్న విశ్వామిత్రుడుకి ఆగ్రహం వచ్చి, " చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేక, మాట తప్పిన ధర్మం తెలియని దశరథా, పుత్ర పౌత్రాదులతో సుఖముగా, శాంతిగా జీవించు" అని వెళ్ళిపోతున్నాడు. వెంటనే వశిష్ఠుడు లేచి, విశ్వామిత్రుడిని కూర్చోమని చెప్పి దశరథుడితొ ఇలా అన్నాడు " ఇంత కాలం రాజ్యం చేశావు, ధర్మాత్ముడవని అనిపించుకున్నావు. ఇప్పుడు ఆడిన మాట తప్పి, దశరథుడు అధర్ముడు, మాట తప్పినవాడు అనిపించుకుంటావ? ఇచ్చిన మాటకి నిలబడు. విశ్వామిత్రుడంటె ఎవరో తెలుసా......

[color=red]ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాం వరః |[/color]
[color=red]ఏష విద్య అధికో లోకే తపసః చ పరాయణం ||[/color]

ఈ లోకంలోని ధర్మం అంతా విశ్వామిత్రుడు, ఈ లోకంలోని తపస్సు అంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు, ఈ లోకంలోని బుద్ధి అంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు, [b]శివుడి[/b] అనుగ్రహంగా ఆయనకి [b]ధనుర్వేదం[/b] మొత్తం భాసించింది, కావున ఆయనకి ఈ లోకంలో ఉన్న అన్ని [b]అస్త్ర-[/b][b]శస్త్రాలు[/b] తెలుసు. ఇన్ని తెలిసిన విశ్వామిత్రుడు తనని తాను రక్షించుకోగలడు. కాని రాముడికి ఆ కీర్తి దక్కాలని, తనకి తెలిసిన సమస్త విద్యలు రాముడికి ధారపొయ్యాలని ఆయన ఆశ, ఎందుకు అడ్డుపడతావు" అని అన్నాడు.

దశరథుడు అంతఃపురంలోకి వెళ్లి రాముడిని తీసుకురా అని కౌసల్యతో చెప్పాడు. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. స్వస్తి వాచకం చేసి, కౌసల్య రాముడిని పంపింది. సభలోకి వచ్చిన రాముడిని అక్కడున్న ఋషులందరూ ఆశీర్వదించారు. దశరథుడు రాముడి మూర్ధ్ని భాగం మీద ముద్దు పెట్టాడు. చాలా సంతోషంతొ నా కొడుకుని మీ చేతులలొ పెడుతున్నాను, మీరు ఎలా కావాలంటె అలా వాడుకోండి అని విశ్వామిత్రుడితో చెప్పాడు. విశ్వామిత్రుడు ఏది చెబితే అది చెయ్యి అని రాముడితో చెప్పి సాగనంపాడు. అలా విశ్వామిత్రుడి వెనక రామలక్ష్మణులు ఇద్దరు బయలుదేరారు.
Source:http://sampoornaramayanam.blogspot.com/2010/05/blog-post_7550.html

Link to comment
Share on other sites

[quote name='vikings' timestamp='1326971342' post='1301325174']
Telugu ki Subtitles kavala &*B@ &*B@ sFun_duh
[/quote]
[quote name='pain' timestamp='1326971651' post='1301325203']
Telugu lo vunna dhaniki sub titles ahh., Ninnu

Link to comment
Share on other sites

[quote name='k2s' timestamp='1326971956' post='1301325236']
english lo kavali :3D_Smiles:
[/quote]
ippudu chaduvu
To him, to such an effectual and virtuously great-souled King Dasharatha, , a dynasty-enriching son is not begotten though his heart is burning to beget children. To that anguished great-soul, a thought occurred this way, "To beget sons, why should not I perform Horse ritual...and thus appease the gods in order to beget worthy sons..."
That intellectual and a conscientious king having resolved with all of his sagacious ministers that such a Vedic ritual is performable, then addressed best ne among ministers, namely Sumantra, ‘ fetch all my teachers and clerics, quickly...’
Then Sumantra gone quickly, for he in quickness is a dauntless one, and fetched all of the clerics like Suyajna, Vaama Deva, Jaabala, Kshyapa, and even Sage Vashishta, and also those other eminent Brahman that are Vedic scholars. Then on adoring them virtuous King Dasharatha spoke this impressible sentence that included justification and meaning.
"My mind is tumultuous without quietude for I have no sons... for that reason, I wish perform Aswametha, Vedic Horse Ritual... this is my thinking... therefore, I contemplate to perform that ritual as enshrined in the scriptures and as a rite-oriented one as well... let this contemplation of mine be well thought of... and as to how my desire to beget sons will be fulfilled..."
Then the Brahman scholars along with Sage Vashishta and all other important personalities in their turn have blessed and honoured him, saying that "splendid is this idea..." thus, for that which is voiced by the king. All of them becoming happy have also said to King Dasharatha, "let the paraphernalia be provided, and your ritual-horse be released...
"Oh, king, by all means you will beget sons as you desired, since you, to whom an upright thinking has suggested itself... let the ritual ground be arranged on the northern banks of River Sarayu...” So said the scholars.
Then King Dasharatha is gladdened on hearing the sayings of those Brahmans. And with happiness lurching on his eyes the king spoke to the ministers, "As advised by my Vedic teachers let the paraphernalia be procured... On the northern banks of River Sarayu the ritual ground be arranged... and the Ritual-Horse be released monitored by capable warriors, along with the religious teachers...” So said the king.
"Let peace invocations be prevailing and prospering, as ordained in the scriptures and tradition...if it is possible for the correct performance to obtain results of this ritual, and if it is possible to conduct this ritual without any difficult faults during its performance, then all the kings on earth would have performed it... Scholarly Brahma-demons will be hunting for the faults alone in the course of this ritual... should the procedure of this ritual be depraved of its set rules, the performer gets ruined... Therefore, you all shall see as to how this ritual of mine be conducted and concluded procedurally, and all of you are evidently experts in conducting such rituals... isn’t it!
Vedic Brahmans are to be very cautious and vigilant while performing the ritual in the order of ritual acts, faultless rendering of the Vedic hymns and other observant items of the Vedic canon. Should they by overconfidence or by negligence commit any mistake or fault, they take rebirth as Brahma-demons. After taking rebirth as such demons they, with their inherent jealousy and ire will always be hunting for such mistakes in other's ritual performances. If they cannot find one, they cause certain hindrances in that performance, so that the performer may commit mistakes and get ruined in the present life span and then take rebirth as Brahma-demon. Hence, every Vedic-ritual performer shall be vigilant.
On listening the words of the king all the ministers adored and assured him saying, ‘It will be conducted faultlessly as has been conducted earlier...” On hearing those words of that best king, and what that is spoken earlier, then the virtue knowing Brahman scholars hailing that best king took leave of him and wentaway as they have come. Then on sending off those Brahman scholars, the king spoke this way to the ministers... “As advised by the Vedic scholars this ritual shall be conducted, procedurally..."
Tha tigerly-king and highly intellectual Dasharatha, on saying thus to his ministers who are still in his audience, sent away those ministers also, and he entered his palace. And on approaching his wives, that best king's heartily dear ones, he said to them, “I am performing a Vedic ritual for the reason of begetting sons, and you all shall enter a vow...”
On hearing those words of the king, the lustrous countenances of the queens have become more gleaming, like the blooming lotuses after the clearance of dew-fall.

Link to comment
Share on other sites

Sumantra, the minister of King Dasharatha, details the importance of Sage Rishyasringa and beseeches the king to invite that sage to preside over the contemplated Vedic ritual, for that Sage's entry into any kingdom is auspicious for that land and people.

.

Sumantra, the charioteer and one of the misters of King Dasharatha, having heard all about the king's desire to perform a Vedic ritual, said this in confidence to king, "Oh, king, I will tell an early legend, an early legendary narration that I listened...
"Oh, king, I have earlier heard of this present advice given to you by Vedic scholars, as godly Sage Sanatkumara has once narrated an account about the arrival of your sons in the presence of other sages, and sage Sanat Kumara said... He said that "Sage Kashyapa has a son known as Vibhaandaka, and his son will be the renowned Sage Rishyasringa, and that Sage Rishyasringa will grow up in forests, and will always be dwelling in forest...
Here the word used by Sumantra is [i]tava putra aagamam [/i], it renders as 'the arrival of your sons', meaning that sons of King Dasharatha arrive from Heavens, but not through an ordinary parturition. Even earlier in time to that of Dasharatha, Sage Sanatkumara predicted the 'arrival' of Vishnu as Rama. The birth-event associated with Rishyasringa’s name is that he is born with a horn on the crown of his head. Thus he is named as Rishyasringa, i.e., em> R^iSi the Sage; [i]shR^i~Nga [/i]horn; a Sage with a horn on his forehead at his birth time. This being the mythological import, he is an acme among sages, as [i]shR^i~Nga [/i]also means a peak.
"Not knowing others, that Brahman the best, namely Rishyasringa, will always be abiding his father and he will follow celibacy of two kinds Brahmanical vows namely [color="#B3003A"]vratitva [/color], [color="#B3003A"]praajaapatya [/color]...
Or
Not knowing others that Brahman the best, will always be abiding his father, lest his renowned celibacy always praised by the Brahmans, will be hindered.
The word [i]dvaividhyam [/i]also means two kinds of celibacy,[i] vratitva [/i]and [i]prajaapatyam[/i]. One, as a bachelor and the other after marriage, voluntarily distancing away from his wife on certain forbidden days like full moon and new moon days, during daytime, eclipses, and other astronomical occurrences and some more. This kind of self-imposed celibacy is one way of observing sustained family planning methods, instead of resorting to medicaments. Here, this word is more nearer to mean 'hindrance', than to mean the 'two way celibacy' as deciphered by some commentators.
"In the world he becomes famous for his celibacy, oh king, and he will always be praised by Brahmans, and thus time will pass on with that kind of his conduct...
Sage Rishyasringa looses no time with his servitor-ship to the Sacrificial Fire and also to his celebrated father, and during this period alone there will be a famed and very strong kingRomapaada, a valiant in Anga country... But by a violation of righteousness of that king there will be a shocking and devastating famine in that country... While the famine is besetting that king Roamapada will be afflicted with grim, and on summoning Brahmans and learned scholars he will address them...
" ‘All of you are well versed in rituals and knowers of the world history... order me how to how the purification from sin will be...
" ‘Thus said by king those scholarly Brahmans and Vedic scholars will say to the king, 'oh, king, son of Sage Vibhaandaka, namely Rishyasringa, is to be fetched by all methods...
"Oh! King, having brought Sage Rishyasringa and honouring him well with good care, procedurally give him your daughter Shanta in marriage to that Vedic Brahman and the son of Sage Vibhaandaka... On listening them the king becomes thoughtful about the idea by which it is possible to bring that self-controlled sage to his place...Then that intellectual king decides along with ministers, to dispatch clergymen and ministers, honouring them well, and then sends them...
"They on hearing king's words are awestruck and lowering their faces they will say, 'we can not go there as we are afraid of sage Vibhandaka, father of Rishyasringa...' After thinking over they will say as a second thought, and having found a solution with a plan to bring that sage, 'we will fetch that Brahman and also by that no stigma will occur...'
"Thus by the king of Anga kingdom and by his courtesans the son of sage Rishyasringa will be brought and the presiding deity for rains will showers rains, and Shanta will also be given in marriage to that sage...’
"Sage Rishyasringa, son-in-law of Romapaada, King of Anga ad as well as to you, if invited to our kingdom he will bless you to beget sons, oh! King... so said Sage Sanatkumaara to other sages and all this is retold by me."
Thus the charioteer and the Minister Sumantra completed his narration in confidence to King Dasharatha.
Comment: Sage Rishyasringa is also a son-in-law to King Dasharatha. Princess Shanta, in a distant relationship is a daughter to King Dasharatha in relation and the adopted daughter of Romapaada, the King of Anga. Thus Sumantra's saying son-in-law also means Dasharatha's son-in-law, besides Romapada’s.
Then King Dasharatha is delighted and in turn spoke to Sumantra "By what idea Rishyasringa is brought to Anga kingdom, that shall be said..."

source: http://www.valmikiramayan.net/bala/sarga9/bala_9_prose.htm

Link to comment
Share on other sites

×
×
  • Create New...