Jump to content

Konchem Late But Flash News


jimcarrey

Recommended Posts

[b] జగన్ సంస్థల ఆస్తుల దిగ్బంధం
బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్; ఆర్థిక లావాదేవీలు నిలిపివేత
ఆందోళనలో జగతి పబ్లికేషన్స్ ఉద్యోగులు[/b]


హైదరాబాద్, మే 8: జగన్ అక్రమాస్తుల కేసు కీలక ఘట్టానికి చేరుకుంది. జగతి పబ్లికేషన్స్‌తో పాటు జగన్‌కు చెందిన సంస్థల సర్వం సహా ఆర్థిక లావాదేవీలను మంగళవారం సీబీఐ స్తంభింపజేసింది. 1944 ఆర్డినెన్స్ ఆధారంగా సీఆర్‌పీసీ 102 సెక్షన్ ప్రకారం సంక్రమించిన అధికారాల మేరకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని జగన్ సంస్థల ఖాతాలలో ఆర్థిక లావాదేవీలను నిలిపివేసినట్లు సీబీఐ పేర్కొన్నది.

ఈ పరిణామంతో జగన్ ఆస్తులను స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. మరోపక్క జగతి పబ్లికేషన్స్ ఉద్యోగులు భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Link to comment
Share on other sites

×
×
  • Create New...