Jump to content

Rajmouli Interview


venkychumma

Recommended Posts

[color="red"]మీతో పని చేయడానికి ఎందరో హీరోలు ఉండగా, ‘ఈగ’తో సినిమా చేయడానికి కారణం?[/color]
[color=#000000]‘మర్యాద రామన్న’ తర్వాత నిజానికి ప్రభాస్‌తో సినిమా చేయాలి. కానీ తను వేరే సినిమా బిజీ వల్ల నాలుగు నెలల గ్యాప్ వస్తోంది. ఆ గ్యాప్‌లో ఓ చిన్న సినిమాగా ఏదైనా ప్రయోగం చేద్దామని మొదలుపెట్టాను. కథ అంతా పూర్తయ్యాక ‘ఈగ’ మీద ఎక్కడ లేని మమకారం మొదలై భారీ సినిమాగా అవతరించింది. 25 ప్రింట్లతో మల్టీఫ్లెక్స్ థియేటర్లలో విడుదల చేద్దామనుకున్నది కాస్తా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున చేయాల్సివచ్చింది. [/color]

[color="red"]ఇంతకుముందు సినిమాలన్నీ తెలుగులోనే చేశారు. ‘ఈగ’ను మాత్రం ప్రత్యేకంగా నాలుగు భాషల్లో చేయాలనుకున్నారు. ఎందుకని?[/color]
[img]http://sakshi.com/newsimages/contentimages/03072012/Eega-(17W)2-7-12-49974.jpg[/img][color=#000000]రజనీకాంత్ తెలియని దేశం ఉంటుంది కానీ, ‘ఈగ’ తెలియని దేశం ఉంటుందా? ఈగ ఎవ్వరికైనా ఈగే. గ్రాఫిక్స్ కూడా అంతే. స్టార్‌డమ్ సమస్య కూడా లేదాయె. అందుకే ‘ఈగ’ను నాలుగు భాషల్లో చేశాం. [/color]

[color="red"]అసలు ఈగతో సినిమా తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?[/color]
[color=#000000]ఇది పదిహేనేళ్ల క్రితం నాటి ఆలోచన. మా నాన్నగారు సరదాగా ఈగ ప్రధాన పాత్రలో ఓ కథ చెబితే చాలా ఎంజాయ్ చేశాను. ఈ కథతో భవిష్యత్తులో నేనే సినిమా చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ‘ఛత్రపతి’ చేస్తున్నప్పుడు... తర్వాత ఏదైనా చిన్న సినిమా చేద్దామా అనిపించింది. లవ్‌స్టోరీనో, కామెడీ స్టోరీనో అయితే నా వల్ల కాదు. ఏదైనా అబ్బురంగా అనిపించే కథాంశం కావాలనిపించింది. అలా ‘ఈగ’ ముందుకొచ్చింది.[/color]

[color="red"]‘ఈగ’కు మీరే డబ్బింగ్ చెప్పారట?[/color]
[color=#000000]ఈగ మాట్లాడదు. కనీసం శబ్దం కూడా చేయదు. మరి డబ్బింగ్ ఎలా చెబుతాను. అయితే ‘ఈగ’ రెక్కలు సెకనుకు 200 సార్లు కొట్టుకుంటాయి. ఆ రెక్కల సవ్వడిని ఎమోషనల్‌గా వాడుకుంటే బావుంటుంద నిపించి, నేనే నోటితో సౌండ్స్ సృష్టించా. వాటిని కంప్యూటర్‌తో మేజిక్ చేసి అచ్చం ‘ఈగ’ శబ్దం చేస్తున్నట్టుగానే భ్రమింపజేశాం. [/color]

[color="red"]రీ-రికార్డింగ్‌కి కీరవాణి చాలా శ్రమపడ్డట్టున్నారు?[/color]
[color=#000000]ఎవరైనా హీరో అయ్యుంటే, ఆ ఇమేజ్‌కి తగ్గట్టుగా రీ-రికార్డింగ్ చేసేయొచ్చు. మరి ‘ఈగ’కు ఎలా చేయాలి? అందుకే ఆయన చాలా శ్రమ తీసుకుని బ్యాగ్రౌండ్ స్కోర్ చేశారు. అయితే దాన్ని ఫోర్ గ్రౌండ్ స్కోర్ అనాలి.[/color]

[color="red"]నాని ఎంపిక ఎలా జరిగింది?[/color]
[color=#000000]అష్టా చమ్మా, అలా మొదలైంది హిట్ల తర్వాత నాని ఈ 20 నిమిషాల పాత్రకు ఒప్పుకుంటాడా అనిపించింది. కానీ తను వెంటనే ఒప్పుకున్నాడు. [/color]

[color="red"]ఇలాంటి సినిమాను త్రీడీలో చేసి ఉంటే బాగుండేది కదా?[/color]
[color=#000000]నాకు వ్యక్తిగతంగా త్రీడీ సినిమాలంటే ఇష్టం లేదు. ఎందుకంటే బిగ్‌స్క్రీన్‌లో బిగ్ లెవిల్లో వచ్చే కిక్ త్రీడీలో రాదేమోననిపిస్తుంది. అందుకే కొంతమంది త్రీడీలో చేయమని సూచించినా, నేను ఒప్పుకోలేదు. అయితే ఈ మధ్య ప్రసాద్ స్టూడియో వాళ్లు దీన్ని త్రీడీగా కన్వర్ట్ చేద్దామన్నారు. నేను ఒప్పుకోలేదు. చివరకు వాళ్లు బలవంతం చేయడంతో అయిష్టంగానే నాలుగైదు సీన్లు ఇచ్చి త్రీడీలో కన్వర్ట్ చేయమన్నా. తర్వాత వాళ్లు ఇచ్చిన అవుట్‌పుట్ చూసి అదిరిపోయా. అంత గొప్ప క్వాలిటీతో ఉంది. అయితే ఇప్పటికిప్పుడు కన్వర్షన్ అంటే మూడు, నాలుగు నెలలు పడుతుంది. అందుకే హిందీ వెర్షన్‌ని మాత్రం త్రీడీలో విడుదల చేద్దామనుకుంటున్నాం. హిందీ డబ్బింగ్ పూర్తయినా, ఇప్పుడు విడుదల చేయకపోవడానికి కారణం అదే.[/color]

[color="red"]అందరూ కథల విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తుంటే, మీరేమో సినిమా ఓపెనింగ్ రోజునే కథాంశం చెప్పేస్తుంటారు. ఏంటా ధైర్యం?[/color]
[color=#000000]‘ఈగ’ ఫుల్‌బౌండ్ స్క్రిప్ట్ దొరికినా కూడా ఎవ్వరూ కాపీ కొట్టలేరు. కొన్ని కథల గురించి ప్రేక్షకులకు ముందు చెప్పేస్తేనే వాళ్లకూ ఆసక్తిగా అనిపిస్తుంది. అలా అన్ని కథల గుట్టు విప్పలేం. ‘సింహాద్రి’ని ఇప్పుడు తీస్తే మాత్రం అస్సలు కథ చెప్పను. [/color]

[color="red"]మీ కథలన్నీ హిందీలోకి వెళ్తున్నాయి కదా. మరి మీ బాలీవుడ్ ప్రవేశం ఎప్పుడు?[/color]
[color=#000000]హిందీలో చేయాలని నాకూ ఉంది. అయితే అటునుంచి అవకాశాలు కూడా రావాలి కదా. అయినా తెలుగులో పూర్తి చేయాల్సిన కమిట్‌మెంట్లు చాలా ఉన్నాయి. [/color]

[color="red"]‘మగధీర’ను హిందీలో చేయాలని మిమ్మల్నే అడిగినట్టున్నారు?[/color]
[color=#000000]చేసినదాన్నే మళ్లీ చేయడమంటే కష్టం. ఏదైనా కొత్త కథతో ఎంటర్‌కావాలి. [/color]

[color="red"]‘ఈగ’ చేస్తున్నప్పుడు ఎందుకు మొదలెట్టామా అనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా?[/color]
[color=#000000]నా ప్రతి సినిమాకీ ఇలాంటి ఫీలింగే ఉంటుంది. కానీ మొండిధైర్యంతో ముందుకెళ్లిపోతుంటాను. ‘ఈగ’ లాంటి గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ మూవీకి ప్రీ ప్రొడక్షన్ చాలా ముఖ్యమనే విషయం, షూటింగ్ సగం పూర్తయ్యాక గానీ అర్థం కాలేదు. ‘మకుట’ గ్రాఫిక్స్ స్టూడియో వాళ్లు ‘ఈగ’ డిజైన్ చేసి చూపిస్తే అస్సలు నచ్చలేదు. ఏదో కంప్యూటర్ గ్రాఫిక్స్‌లా ఉంది తప్ప, ‘ఈగ’ పోలికలే లేవు. నా గుండె జారిపోయింది. అప్పటికే పదికోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశాం. ఏదో యాభై లక్షలో, కోటి రూపాయలో అయ్యుంటే సినిమాను అక్కడికక్కడ ఆపేసేవాళ్లం. అప్పటికే సగం దూరం వచ్చేశాం. ముందుకు వెళ్లాల్సిందే. ఆ పదిరోజులూ నరకం అనుభవించాను. తర్వాత గ్రాఫిక్స్ వాళ్లతో ‘ఎంత ఆలస్యమైనా పర్లేదు... ప్రాజెక్ట్ కరెక్ట్‌గా రావాలి’ అని చెప్పాను. అప్పుడు కరెక్ట్ ప్రాసెస్‌లో వెళ్లాను. ‘ఈగ’ మోడలింగ్‌కే మూడు నెలలు పట్టింది. చివరకు నేననుకున్నట్టుగా ‘ఈగ’ తయారైంది. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్‌కే దాదాపు రెండేళ్లు పట్టింది. [/color]

[color="red"]నెక్ట్స్ ప్రభాస్‌తో చేసేది పీరియడ్ మూవీనా?[/color]
[color=#000000]ప్రస్తుతం నా మెదడులో ‘ఈగ’ రొద తప్ప ఏమీ లేదు. ‘ఈగ’ విడుదలయ్యాకే ప్రభాస్ సినిమా గురించి ఆలోచిస్తా.[/color]

Link to comment
Share on other sites

×
×
  • Create New...