Jump to content

Mikam....The story....koncham peddadi...mee vopika....


veeruN

Recommended Posts

''ఎప్పుడు ....?''

ఉత్సాహంగా అడిగాడు రాజేష్. అతని మోహంలో సంతోషం.... ఏదో సాదించినట్లు కించిత్తు గర్వం కూడా చోటు చేసుకుంది.... ''నువ్వేప్పుడంటే అప్పుడే.... నేను రెడీ'' అవతలి నుండి స్వప్న మాటలు తియ్యగా వినిపించాయి.... ''ఇంకా ఆలస్యం చేయడం నా వాళ్ళ కాదు....నువ్వు నా ఆఫర్ ని ఒప్పుకున్నావంటేనే ఇంకా నమ్మలేకపోతున్నాను రేపే కలుసుకుందాం..'' అన్నాడు ఆనందంగా రాజేష్....

''అన్నమాట ప్రకారం నేనడిగింది నాకివ్వాలి అదినా చేతిలో పడ్డాకే మిగతాపని...''


''ఓ ష్యూర్.....తప్పకుండా...నీక్కావలసింది నికిచ్చాకే నిన్ను నా కౌగిలిలో బంధీ చేస్తాను....అన్నట్టు మరోముఖ్య విషయం అని ఆగాడు రాజేష్.....

''ఏమిటది'' అంది స్వప్న...కాసేపు మౌనం తర్వాత మెల్లిగా చెప్పాడు రాజేష్....''రేపు ....నాతోపాటు నా ఫ్రెండ్ కూడా రొమాన్స్ లో పాటిస్పెంట్ చేస్తాడు.

అతని నోట్లో మాట పూర్తి కాకముందే స్వప్న కోపంగా అంది.... ''యూ రాస్కెల్....నువ్వసలు మనిషివేనా..? నా మనసు చంపుకుని నీతో ఒకరోజు గడుపుతానన్నంత మాత్రాన అది అలుసుగా తీసుకుని మరొకడి తో కుడా ...ఛి....ఛి..అసలు అలా అనడానికి నీకు నోరెలా వచ్చింది...ఫోన్లో మాట్లాడుతున్నావు కాబట్టి బ్రతికిపోయావు..

అదేనా కళ్ళ ముందు ఉండి ఉంటే రెండు చెంపలు వాయించే దానిని ..'' కోపంగా అరిచింది స్వప్న...ఆమె మాటల్ని పట్టించుకోనట్లు కూల్ గా అన్నాడు రాజేష్...''

అలా కోప్పడితే ఎలా బేబి..ఈ మాత్రం దానికే అంతలా రియాక్ట్ అవ్వాలా...అయినా వన్ బైటు రొమాన్స్ ఎంత త్రిలింగ్ గా ఉంటుందో తెలుసా ..ఒక్కసారి అలవాటుపడ్డావంటే...ఇక ప్రతీసారి ఇద్దరితో..

'' షటప్ యూ బాస్టర్'' అవతలి నుండి మొబైల్ ఆఫ్ చేసింది. స్వప్న ..రాజేష్ కూడా మొబైల్ ఆఫ్ చేసి రిలాక్స్ గా చైర్ వెనక్కివాలి ఎదురుగా కూర్చున్న స్వరూప్ వంక చూశాడు....

''చాలా హార్ట్ అయినట్టుంది..'' అన్నాడు స్వరూప్..రాజేష్ చిన్నగా నవ్వాడు...''సో వాట్..ఆమె హార్ట్ అయితే మనకేంటీ.....? మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలంటే స్ట్రెయిట్ ఫార్వార్డ్ గానే విషయం చెప్పేయాలి..''

అన్నాడు...''నా గురించి ఆమెకి ముందుగానే చేప్పిఉండాల్సింది కాదు...రేపు ఎలాగో ఆ సమయానికి నేను వచ్చేవాడిని కదా..!'' అన్నాడు స్వరూప్.... ''నువ్వన్నదీ నిజమే...కానీ సడన్ గా నిన్ను చుడగానే మనసు మార్చుకుని వచ్చిన దారినే వెనక్కి వేల్లోపోయే ఛాన్స్ కూడా ఉంది కదా...!

ఈ విషయాన్ని ముందుగానే చెబితే మెంటల్ గా ప్రిపేర్ అయివస్తుంది. కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు..'' అసలు వస్తుందంటావా...?'' అనుమానంగా అడిగాడు స్వరూప్.... ''రాక చస్తుందా? తనకి కావలసింది మన దగ్గరుంది...దాన్ని పొందడానికి ఎంతకైనా తెగిస్తుందని నా నమ్మకం...చూస్తూ ఉండు మరో అయిదు నిమిషాల్లో నా సెల్ కి ఫోన్ చేస్తుంది.

''' నమ్మకంగా అన్నాడు రాజేష్. ''ఏమో నాకైతే ఆమె ఫోన్ చేస్తుందనే నమ్మకం లేదు.... అనవసరమైన మాటలు మాట్లాడి అందివచ్చిన అవకాశాన్ని జారవిదిచావేమోననిపిస్తుంది నాకు...'' నిరుత్సాహంగా అన్నాడు స్వరూప్....

రాజేష్ చిన్నగా నవ్వాడు..తన చైర్ లో నుండి లేచి జేబులోంచి సిగరెట్ నోట్లో పెట్టుకుని వెలిగించుకున్నాడు.... రెండు దమ్ములు సిగరెట్ పీల్చిన తర్వాత అన్నాడు స్వరూప్ తో...'ఆడవాళ్ళ సైకాలజీని అంచనా వేయడంలో నువ్వు చాలా పూర్..

.వయసులో ఉన్న పెళ్ళికాని అమ్మాయిలని పడగొట్టడానికి ఏం కావాలో తెలుసా...? కొంచెం ఓపిక...! ఓ వారం రోజులు వాళ్ళ చుట్టూ తిరిగితే చాలు ఇట్టే మన ఒళ్ళోపడిపోతారు.... పైగా ఇప్పుడు వస్తున్న లవ్ సినిమాల పుణ్యమా అని ఇంకా తేలిగ్గా అలాంటి ప్రయత్నాలు ఫలిస్తున్నాయి....

అయినా మన దారిలోకి రాలేదనుకో ...రెండో ప్రయత్నం ప్రారంభించాలి.... అదేమిటంటే వాళ్ళ బలహినతల్ని పట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం.... ఎక్కడ తమ బలహీనతలు బయటి వాళ్ళకి తెలిసిపోతాయో అనే భయంతో తమ పరువు పోతుందనుకునో, అందరిముందు చులకన అయిపోతామనుకునో...వెంటనే సరెండర్ అయిపోతారు..

ఇంకా మూడో రకం ప్రయత్నం...వారు ఎంతో ఇష్ష్టపడేది....లేక కోరుకునేదేమిటో తెలుసుకుని దాన్ని మనం సంపాదించి వారిని మనవైపు తిప్పుకోవడం...ఇప్పుడు మనం చేస్తున్నదీ అదే....తనకు కావలసింది తనకి ఇవ్వడం కోసం మనం కోరే కోర్కెలను మొదట్లో కోపం కలిగించినా, తరువాత ఆలోచిస్తారు ఆ తర్వాత అంగీకరిస్తారు....

'' అతను అలా చెబుతూ ఉండగానే అతని సెల్ మ్రోగింది... రాజేష్ విజయ గర్వంతో స్వరూప్ వంక చూశాడు..తన సెల్ స్వరూప్ కి చూపించాడు. డిస్ ప్లే పైన అవాప్న అక్షరాలను గమనించి ఆశ్చర్యపోయాడు స్వరూప్..

రాజేష్ బటన్ ప్రెస్ చేసి సెల్ చెవిదగ్గర పెట్టుకుని అన్నాడు ''ఏం నిర్నయించుకున్నావు...?'' అని అవతలి నుండి సమాదానం రాలేదు..కొద్ది క్షణాలు మౌనం తర్వాత మెల్లిగా అంది స్వప్న.. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితులలో ను ఎక్కడ లీక్ చ్వ్హేయనని ప్రామిస్ చేస్తే ఓ..ప్పు...కుం...టా..ను''

చివరిమాట పలుకుతున్నప్పుడు ఆమె గొంతు సన్నగా వణికింది..''నువ్వంతలా భయపడాల్సిన పనిలేదు.. నా పైన నమ్మకం పెట్టుకో..ఎక్కడా లీక్ చేయనని ప్రామిస్ చేస్తున్నాను...''నమ్మకంగా పలికాడు రాజేష్.....

అవతలి నుండి మల్లీ మౌనం... ఆ తర్వాత ''రేపు నేను వచ్చినా ఎక్కువ సేపు ఉండను....అరగంటలోపే పని పూర్తీ చేసుకుని పంపించాలి...'' అంది .... ' నో ప్రాబ్లం..అసలి అరగంట సమయం కుడా పట్టాడు..ఇద్దరం ఒకేసారి....'' ఏమిటీ?? ఒకేసారా...?

అలా ఏం కుదరదు వన్ బై వన్..'' కోపంగా అంది స్వప్న.. రాజేష్ చిన్నగా నవ్వాడు..'ఓకే..బేబి నివ్వేలా కావాలంటే అలాగే చేస్తాం...'' అన్నాడు రాజేష్....''మరి నాక్కావలసింది..'' అనుమానంగా అంది స్వప్న...

'' హండ్రేడ్ పర్సెంట్ ఇస్తాను..అది నీ చేతిలో పెట్టాకే మా పని కానిస్తాం.....'' అన్నాడు ..ఇద్దరి మధ్యా కాసేపు నిశ్శబ్దం కొద్ది క్షణాల తర్వాత స్వప్న ఏదో చెప్పడానికి తటపటాయిస్తున్నట్లు ''అదీ....అదీ..అంటూ నసగడం ప్రారంభించింది..

.''కమాన్ బేబీ..నువ్వెదీ చెప్పదలుచుకున్నా నిరభ్యంతరంగా చెప్పేసెయ్'' అన్నాడు రాజేష్... ''అదే మీరు..కండోమ్స్..మరవకండి..'' అంది మెల్లగా...ఆమె ముందు జాగ్రత్తకి నోరు తెరిచాడు రాజేష్ వెంటనే తేరుకుని ''ఓ...కే..బేబీ'' అన్నాడు. ఆ సంభాషణంతా నోరు తెరుచుకుని వింటూ ఉండి పోయాడు స్వరూప్.

''వస్తుందంటావా...?'' అనుమానంగా అడిగాడు స్వరూప్... అతని మొహం టెన్షన్ టో నిండిపోయింది.. రాజేష్ అతన్ని చూసి చిన్నగా నవ్వాడు... ''నువ్వనవసరంగా కంగారుపడకు బీ..కూల్....స్వప్న తప్పకుండా వస్తుంది..''

స్వరూప్ భుజంపైన చేయివేసి అన్నాడు రాజేష్....''నాకెందుకో భయంగా ఉంది'' అన్నాడు మల్లీ చిరాకుగా చూశాడు రాజేష్ స్వరూప్ వైపు....ఈ మాత్రం దానికే అలా టెన్షన్ పడితే ఇక ముందు ఇలాంటి కేసులని ఎలా డీల్ చేస్తావు'' అన్నాడు రాజేష్.....

''అదికాదు ఒకవేళ ఆమె వచ్చినా మన ప్లాన్ వర్కవుట్ అవుతుండంటావా..?'' అనుమానంగా అన్నాడు మళ్ళి... ''అబ్బా..నీ అనుమానాలతో నన్ను కాల్చుకు తినకు నేను ప్లాను వేసానంటే ఖచ్చింతంగా జరిగి తీరుతుంది...

అన్నట్టు ఆమె వచ్చే సరికి మనం చేయాల్సిన పని ఇంకొకటి ఉంది..'' అంటూ బెడ్రూం లోకి నడిచాడు రాజేష్.....అతన్ని అనుసరించాడు స్వరూప్.. ఒక బ్యాగ్ లో నుండి హండి క్యామ్ కెమెరాని తీసి సరిగ్గా బెడ్ ని కవర్ చేసే విధంగా సెట్ చేసి బెడ్ కి ఎదురుగా ఉన్న విండోలో పెట్టాడు....

సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ మ్రోగింది.....స్వప్న వచ్చిందని అర్థమయింది వాళ్ళకి...''నే వెళ్లి దాక్కుంటాను'' అన్నాడు స్వరూప్.... 'సరే వెళ్ళు నేను పిలిచే వరకు రాకు..'' అన్నాడు రాజేష్...

.''సరే'' అని గదిలో నుండి మరో గదిలోకి వెళ్ళిపోయాడు స్వరూప్...రాజేష్ వెళ్లి తలుపు తీసాడు...ఎదురుగా స్వప్న ఆమె లోపలికి రాగానే తలుపులు గడిపెట్టాడు రాజేష్..ఎవరో తరిమితే ఆ ఇంట్లో కి వచ్చినట్లుగా ఏంతో అనీజీ'గా వుంది ఆమె మోహం...

రాజేష్ మొహం చూస్తూనే ఆత్రుతగా అంది.... నాక్కావలసింది నాకిచ్చేయ్'' అంది ఆమె...ఏ...ఇవ్వగానే పారిపోదామనా?'' అన్నాడు రాజేష్... ఆమె అతన్ని రోషంగా చూసింది...''మాట తప్పే దాన్ని కాదు నేను.. త్వరగా కానివ్వంది....తొందరగా వెళ్లిపోవాలి'' అంది... ''

పద బెడ్రూం లోకి'' ఆమెవైపు చూస్తూ అన్నాడు రాజేష్....''ముందు నాక్కావాల్సింది నాకివ్వండి.... భరించలేకపోతున్నాను..నరాలు చిట్లిపోతున్నాయి'' తొందర చేసింది అతన్ని...బెడ్రూంలోకి పద..ఇస్తాను''

అన్నాడు రాజేష్. మౌనంగా...అడుగులు వేస్తూ....ఆమె అతన్ని అనుసరించింది..ఆమె బెడ్రూంలోకి రాగానే పక్కనే ఉన్న టేబుల్ సోరగులోంచి రెండు చిన్న పోట్లాలని బయటకు తీసాడు...

అందులో తెల్లగా మెరుస్తున్న పొడిని చూడగానే ఆమెకు ప్రాణం లేచి వచ్చినట్లయింది... గబుక్కున అతని చేతిలోని కవర్ లాక్కుంది.... మరింక ఆలస్యం చేయకుండా ఆ తెల్లటి పొదిని పేపర్లో పోసుకుని ముక్కు దగ్గర పెట్టి గట్టిగా పీల్చింది....

ఆమె కళ్ళు మైకంతో మూసుకుపోయాయి..ఆమె ఒంట్లోకి ప్రసరించిన ఆ పొడి నరనరాలని ఉత్తేజపరుస్తుంటే స్వర్గంలోకంలో తేలిపోతున్నట్లు అనిపించింది ఆమెకి.... ఇంకాస్త పొడిని పేపర్ పైన వేసుకుని మళ్లీ పీల్చింది స్వప్న....

.ఆ క్షణంలో ఆమెకి గాలిలో తేలిపోతున్న భావన కలిగింది....ఆడదానికి ఎంతో అమూల్యమైన శీలాన్ని తాకట్టు పెట్టి ఆ ఆనందాన్ని అనుభవిస్తుంది ఆమె.... చదువులో ఫస్ట్ ర్యాంక్ సాధించి గోల్డ్ మెడల్ సంపాదించిన ఇరవైరెండు సంవత్సరాల స్వప్న కి ఇప్పుడవన్నీ గుర్తుకు రావడం లేదు.....

ఒక్క స్వప్నే కాదు. ప్రపంచంలో యువతీ యువకులందరిని తనకి బానిసగా చేసుకుని వారి భావిష్యత్తుని ప్రశార్థకంగా నిలబెడుతున్న ఆ పదార్ధం పేరే బ్రౌన్ షుగర్......ఎంతటి మనోనిబ్బరంగాలవాడైనా సరే ఇక్కసారి దానికి లొంగిపోతే, ఇక జీవితాంతం మత్తులోనే మునిగిపోయెలా చేస్తుంది అది...

మనిషికుండే విచక్షణా జ్ఞానాన్ని చెరిపేసి ఆ స్థానంలోనే ఆ పౌడరు కోసం ఎంతటి ఘేరానికైన తెగించేలా చేస్తుంది అది.... రాజేష్ స్వప్ననే గమనిస్తున్నాడు... ఆమె మోహం పూర్తిగా మారిపోయింది...ఆమె మెదడుని మత్తు క్రమంగా ఆవరిస్తుండగా రాజేష్ వైపు చూసింది స్వప్న...

తూలుతూ అతనికేదురుగా వచ్చి నిలబడింది...చొరవగా అతని రెండు భూజాలపై చేతులు వేసి...''థాంక్స్ మిస్టర్....నా ప్రాణాన్ని కాపాడావు నువ్వు... ఈ బ్రౌన్ షుగర్ దొరకడం ఆలస్యం అయితే ఆ నరకయాతన భరించలేక ఆత్మహాత్య చేసుకునే దానిని....నా ప్రాణాన్ని కాపాడింది నువ్వే....ఈ శరీరం నీదే...నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో.... నువ్వొక్కడివే అనిభావిస్తావో.... నీ ఫ్రెండ్స్ కి కూడా నన్ను ఉపయోగిస్తావో...నీ ఇష్టం..

ఒకరి తరువాత ఒకరు వచ్చినా సరే .. అందరూ కలిసి ఒకేసారైనా సరే..నేను రెడీ'' ఆమె మాటలు తడబడుతున్నాయి..కళ్ళు మూతలు పడుతున్నాయి..... ఆమె శరీరం ఆమె అదుపులో లేదు....తానేం చేస్తుందో...ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకునే పరిస్థితి లేకుండా ఆమె శరీరం అంతా మైకంతో నిండిపోయింది...

''ఇంకా ఆలస్యం ఎందుకు..? నేను భరించలేను...'' అంటూ మైకంతో నిండిపోయింది....''ఇంకా ఆలస్యం ఎందుకు....? నేను భరించలేను...'' అంటూ అతన్ని విసురుగా తన మీదకు లాక్కుంది. ఆ ఊపుకి ఇద్దరు బెడ్ పైన పడిపోయారు...సరిగ్గా అప్పుడే ఆ గదిలోకి వచ్చాడు స్వరూప్...

రాజేష్ ఒంటిపైన ఉన్న షర్ట్ ని విప్పడానికి ప్రయత్నిస్తూ స్వరూప్ ని చూసింది స్వప్న. హాయ్.... బావా! ఏంటి బావా నువ్వుకుడా వచ్చావా..లేటజ్ ఎంజాయ్..రా..ముగ్గురం కలిసి రోమన్స్ చేసుకుందాం. ఆనందంగా అంది స్వప్న ఏమీ మాట్లాడకుండా హ్యాండిక్యామ్ కెమెరాని తన చేతిలోకి తీసుకున్నాడు.

అప్పటికే బెడ్ పైన ఉన్న ఇద్దరిని తన కెమెరాలో బంధీ చేసుకుంటున్న దాని యాగింల్ మార్చి షూట్ చేయడం ప్రారంభించాడు స్వరూప్ సరిగ్గా అదే సమయంలో ఆ గదిలోకి మరొకతను ప్రవేశించాడు... అతను నిదానంగా బెడ్ దగ్గరకు వెళ్లి స్వప్న రాజేష్ లతో కలిసిపోయాడు...

వెక్కి వెక్కి ఏడుస్తోంది స్వప్న..ఆమె బెడ్ పైన పడుకుని ఉంది. ఆ బెడ్ ప్రక్కనే కూర్చుని ఉన్నారు....రాజేష్, స్వరూప్ లు... ఆపక్కనే నిలబడి స్వప్నకి మెడికల్ చెకప్ చేస్తున్నాడు డాక్టర్ ఆనంద్....

స్వప్న ఏడుస్తున్న పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు ఆనంద్... రాజేష్, స్వరూప్ లు కూడా మౌనంగా కూర్చుని ఉన్నారు... పదినిమిషాలపాటు ఏడ్చీ,ఏడ్చీ అలాగే నిద్రలోకి జారిపోయింది స్వప్న....

ఆనంద్ తేలిగ్గాకంది ఊపిరి పీల్చి వారందరి వైపు చూశాడు...''నేను చేయాల్సిందంతా చేశాను. ఓ పదిహేను రోజుల పాటు మెడిసన్ వాడితే ఆమె పూర్తి నార్మల్ కండీషన్లోకి వస్తుంది....ఈ మధ్య కాలంలోనే డ్రగ్స్ కి అలవాటు పడింది కాబట్టి వాటివల్ల ఆమె బాడీకి ఎమీ ఎఫెక్ట్ అవలేదు....

ఇక నుండైనా ఆమెని డ్రగ్స్ కి దూరంగా ఉంచితే ఇక ఏ ప్రాబ్లెమూ ఉండదు. ఇక ఆమె మెదడులో డ్రగ్స్ అనే ఆలోచన రాకుండా చూడాల్సిన బాధ్యత ఒక సైకాలజిస్ట్ గా మీ పైనే ఉంది'' అన్నాడు ఆనంద్...రాజేష్ వైపు చూస్తూ....రాజేష్ చిన్నగా నవ్వాడు...

ముగ్గురూ కలిసి ఆ గదిలో నుండి ఆనంద్ చాంబర్ లోకి నడిచారు...''అన్నట్లు నాకోవిషయం అర్థం కావటం లేదు డాక్టర్ రాజేష్'' అన్నాడు ప్రశ్నార్థకంగా మొహం పెట్టి ఆనంద్..''ఏమిటి?'' అన్నాడు రాజేష్..'' స్వప్నకి మీరే స్వయంగా డ్రగ్స్ ఇవ్వడం....

ఆ సమయంలో నన్నక్కడికి పిలిపించడం..జరిగిన దాన్నంతా కెమెరాలో షూట్ చేసి తిరిగి స్వనకిచూపించడం.. ఇదంతా ఎందుకు చేశారు...'' ఆశ్చర్యంగా అన్నాడు ఆనంద్..రాజేష్ చిన్నగా నవ్వి....

''స్వప్న ఒక బ్రిలియంట్ స్టూడెంట్....స్టడీ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నట్లు ఆమె ఫోటోని పేపర్ లో చూసి ఎంతో ఆనందించాను..కానీ ఇప్పుడిప్పుడే ఆమె డ్రగ్స్ కి అలవాటు పడిందని తెలిసి ఎంతో బాదేసింది నాకు....

ఈడ్రగ్స్ వల్ల ఆమె భవిష్యత్తు పాడవకుండా చూడాలనుకున్నాను..ఆమెకి డ్రగ్స్ చేరవేసే అన్ని మార్గాలన్నీ మూసివేశాను....ఆమె మేనేబావ అయిన స్వరూప్ హెల్ప్ తీసుకుని నా దగ్గర డ్రగ్స్ ఉన్నట్లు ఆమెకి ఫోన్ చేశాను. నేను కోరుకున్న ఎఫెక్ట్ వచ్చింది.

సాధారణంగా డ్రగ్స్ తీసుకున్న తర్వాత వారేం చేసారన్న విషయం తిర

Link to comment
Share on other sites

ahaa... emana story aa..  you rock you rock you rock you rock

manishi vichakshana marhcipoyi mattu padardhalaki ela banisa avutunado ... baa chepadu... and treatment kuda adiripoyindi...  *=: *=: *=: *=: *=: *=: *=: you rock you rock you rock you rock you rock

first lo post chusi enti intha pedaga undi ani lite tesukundam anukuna.. kani first two lines chadivanu.. edo alaanti sotry la unde naukunanu...

inka chadivanu.... rajesh and swaroop ni tittukunanu... and fafam anukuna swapna ni chusi... chetilo ki handy cam tesukune daka ee rajesh and swaroop kanipisthe kalchedam anukuna.. and aa next chadivaka ardham ayindi abbo super twist naku.... you rock you rock *=: *=: *=:

Link to comment
Share on other sites

×
×
  • Create New...