Jump to content

సెక్స్ అంటే ఇంతేనా...?! వారం తర్వాత చేద్దాంలే... మోడ్రన్ కపుల్స్...


chedugudu_chidambaram

Recommended Posts

కాలేజీ వయసులో ఘాటైన ప్రేమ తాలూకు తీయని అనుభవాలను పంచుకునేందుకు అబ్బాయిలు - అమ్మాయిలు తహతహలాడతారు. అలా మొదలైన కొందరి ప్రేమ ప్రయాణం పెళ్లితో బిగుస్తుంది. ఆ తర్వాత సంసారం... సెక్స్.... ఆధునిక కాలంలో ఈ సెక్స్ వాంఛను తీర్చుకోవాలనే ఆరాటం యువతీయువకుల్లో మితిమీరిన స్థాయిలో ఉంటున్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.

అదే సమయంలో మితిమీరిన సెక్స్ కోర్కెల తాలూకు ఆలోచనలతో పడక గదిలో అడుగు పెడుతున్న నూతన దంపతులు అనుకున్నంత స్థాయిలో తన భాగస్వామి నుంచి స్పందన రాలేదని వగర్చడం కూడా ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నట్లు అధ్యయనంలో తేలింది. అప్పటివరకూ సెక్స్ అంటే ఏమిటో తెలియని వ్యక్తిని భాగస్వామిగా పొందినపుడు ఇటువంటి చేదు అనుభవం ఎదురవుతోంది. అయితే చాలా సందర్భాల్లో తాము అనుకున్న సెక్స్ పద్ధతులన్నిటినీ ఒక్క రాత్రిలోనే చేసేయాలన్న విపరీత ధోరణి వల్ల భాగస్వామికి చిక్కొచ్చి పడుతోంది.

ఇలా తొలిరేయినాడు సెక్స్‌కోసం తహతహలాడే ఆధునిక జంటలు 16 రోజులు గడవగానే " సెక్స్ అంటే ఇంతేనా.." అనే భావనలో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో ఆ సుఖాన్ని వారంలో ఏదో ఒకరోజు అన్నట్లు కానించేస్తున్నారు. అంతేకాదు కొంతమంది ప్రేమగా దగ్గరకు వచ్చే భాగస్వామితో రోజూ అదేగా అన్నట్లు చూస్తుండటంతో ఆ కోరిక కాస్తా ఆవిరైపోతోంది. కాదు.. కూడదని ఒత్తిడి చేసి సెక్స్‌కు ఉపక్రమిస్తే అది అత్యంత బాధాకరమైన ఓ అనుభవాన్ని మిగిల్చి ఆ తర్వాత మరో వారం రోజులు దాకా సెక్స్ అనే పదం దంపతుల మధ్య లేకుండా అయిపోతోంది.

 

Link to comment
Share on other sites

ఇకపోతే... ఏ ఇద్దరి వ్యక్తుల్లోనో ఒకే స్థాయిలో సెక్స్ కోర్కెలు నిబిడీకృతమై ఉంటాయి. అటువంటి స్త్రీపురుషులు వివాహమాడితే వారి సెక్స్ జీవితం సక్సెస్‌ఫుల్‌గా గడిచిపోతుంది. కానీ చాలా సందర్భాల్లో ఒకే రకమైన సెక్స్ వాంఛలను కలిగి ఉన్న వ్యక్తులకు పెళ్లయ్యే సందర్భం చాలా తక్కువ. అంతెందుకు ప్రేమికులైనవారు పెళ్లితో ఏకమైనప్పటికీ వారి మనోభావాలు ఒకటైనప్పటికీ సెక్స్ దగ్గరకు వచ్చేసరికి భిన్న ధృవాలు కలిగిన మనస్తత్వాలుగా ఉంటున్నట్లు తేలింది. దీంతో మోజుపడి చేసుకున్న భార్య/భర్త తనకు పూర్తి స్థాయిలో సుఖాన్ని అందివ్వడం లేదని చిటపటలాడేవారు ఉంటున్నారు.

ఆ తర్వాత సెక్స్ చేసేటపుడు అనుసరించే పద్ధతులు. ఈ పద్ధతులు కూడా ఒకరికి కొన్ని రకాల పద్ధతులు మాత్రమే నచ్చితే, రెండో వ్యక్తికి ప్రత్యేకించి తను అత్యంత ప్రీతిపాత్రంగా తోచే సెక్స్ పద్ధతిని అనుసరించాలంటారు. ఫలితంగా చిన్నగా కీచులాట మొదలవుతుంది. ఆ తర్వాత అదే తీవ్రరూపం దాల్చి, ఆ పద్ధతి ఇష్టం లేదని చెపితే ఒకసారి అర్థం కాదా...? అంటూ సెక్స్‌కు సమాయత్తమవుతున్న తరుణంలో భాగస్వామిపై విసుక్కోవడంతో ఆ వేడి కోరిక కాస్తా తుస్సుమంటుంది. చివరికి ఇరువురి మధ్య సెక్స్ గ్యాప్ ఓ పక్షం రోజులైనా ఉంటోంది.

ఇక ఇటీవల కాలంలో టీనేజ్ దాటిన ప్రతి వ్యక్తిలో సెక్స్ గురించిన విజ్ఞానం ఎక్కువైంది. ఎక్కడ చూసినా సెక్స్ గురించిన కథనాలు దర్శనమివ్వడం దీనికి కారణం. ఆ విజ్ఞానాన్నంతా మెదడులో నింపుకుని భాగస్వామిపై ప్రయోగించాలనుకునేవారూ ఎక్కువవుతున్నారు. కానీ ఏదైనా క్రమేణా సాధ్యం చేసుకోవాలన్న విజ్ఞతను పక్కనపెట్టి తాము తెలుసుకున్నదే తడవుగా చేసేయాలని భాగస్వామిపైకి ఉరుకుతారు. అంతేతప్ప ఆ సమయంలో భాగస్వామి మనసు ఎలా ఉన్నదనే విషయానికి ప్రాధాన్యం ఇవ్వరు. ఫలితంగా సెక్స్ అనేది ఓ యాంత్రికమైన అనుభవాన్ని మిగుల్చుతుంది.

ఆ తర్వాత అన్నిటికీ మించి... పడక గదిలో యుద్ధాలు. సెక్స్ చేసేటపుడు ఆ రోజు భాగస్వామి చేసిన తప్పులను ఎత్తిచూపటం కొందరికి అలవాటుగా మారిపోతోంది. స్వర్గసుఖాలను చవిచూడాల్సిన ఆ సమయంలో... ఎలాగూ సెక్స్ తనకు అవసరం కనుక తను చెప్పేది చచ్చినట్లు వింటారన్న భావనతో ఇటువంటి చర్చలను పడకగదిలో తెస్తారు. ముఖ్యంగా ఆ సమయంలో స్త్రీలు పురుషులతో గొడవపడుతుంటారు. సెక్స్ కోసం వచ్చాడు కనుక చిక్కాడులే అనుకుంటూ అతడు చేసిన తప్పుల తాలూకు చిట్టా విప్పి వాగ్యుద్ధానికి దారితీస్తారు. ఫలితంగా పక్షం రోజులో.. లేదంటే ఓ నెల రోజులో సెక్స్‌కు బిగ్ గ్యాప్.

ఇలా ఆధునిక జంటల్లో అధికులు తమ తీయని రాత్రులను చేదుగా మిగుల్చుకుంటూ ఒగర్చుతున్నారని అధ్యయనకారులు చెపుతున్నారు. దీనిని అధిగమించిన దంపతుల సెక్స్ లైఫ్ స్వర్గ సుఖాల మాధుర్యం ఎంతో తెలుసుకుని తదనుగుణంగా పరస్పరం సహకరించుకోవాలని అంటున్నారు. ఏదేమైనా ప్రస్తుత సమాజంలో పెళ్లితో ఒకటయ్యే విద్యావంతులైన దంపతులు సెక్స్ లైఫ్‌పై అవగాహనను పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని హెచ్చరిస్తున్నారు.

Link to comment
Share on other sites

patha thread kanabadadam ledu any help ...

 

"peddavallaki chilipi friends ki matrame" ani undedi chala rojula nunchi naduputhunna thread almost 25000 views in 2 months.

 

asalu aa link undo ledo elaa kanukkovadam

Link to comment
Share on other sites

patha thread kanabadadam ledu any help ...

 

"peddavallaki chilipi friends ki matrame" ani undedi chala rojula nunchi naduputhunna thread almost 25000 views in 2 months.

 

asalu aa link undo ledo elaa kanukkovadam

 

Nee profile lo "My Content" lo untundi..chudu

Link to comment
Share on other sites

  • 3 weeks later...
×
×
  • Create New...