Jump to content

Saradaaga Kasepu.......telugu Jokes

biscuitRAJA000

Recommended Posts

లేడీస్ సీట్లో కూర్చొన్న రాము, రాణి రాగానే లేచి సీటు ఇవ్వబోయాడు"ఫర్వాలేదు కూర్చొండి. నేను నిలబడతాను" చెప్పింది రాణి మళ్ళీ ఇంకో స్టాప్ రాగానే రాము లేవబోగా..."వద్దొద్దు కూర్చోండి" మళ్ళీ అంది రాణి. ఇంకో స్టేజి రాగానే... రాణితో..."మేడమ్... దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. ఇప్పటికే నేను దిగాల్సిన స్టేజికంటే చాలా దూరం వచ్చేశాను" బాధగా చెప్పాడు రాము.

హైదరాబాదు జూ లో కొత్తగా ఒక గుర్రాన్ని తెచ్చి ఉంచారు. ఎవరైనా చిరుతిళ్ళు పెడతారేమో అని అధికారులు ఒక బోర్డు పెట్టారు. " దయచేసి ఈ గుర్రానికి చిరుతిళ్ళు పెట్టవద్దు... ఇట్లు జూ యాజమాన్యం" అని
మర్నాడు చూస్తే దానికింద మరో బోర్డు ఉంది "పైనున్న నోటీసుని ఎవరు పట్టించుకోనవసరం లేదు. ఇట్లు గుర్రం"

Link to comment
Share on other sites

ఇంటర్వ్యూ చేసే వ్యక్తి:మీరు మూడో ఫ్లోర్లో ఉన్నారని ఊహించు కోండి. అప్పుడు అకస్మాత్తుగా ఆ ఫ్లోర్ కు నిప్పంటుకుందనుకోండి.అక్కడనుంచి ఎలా తప్పించుకుంటారు?

అభ్యర్ధి:ఏముంది?సింపుల్. ఊహించుకోవటం మానేస్తాను

Link to comment
Share on other sites

ఒక రైల్లోని అన్ రిజర్వుడ్ కంపార్ట్‌మెంట్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది.
"కిళ్లీ ఉమ్మడానికి కూడా కదిలే వీల్లేకుండా ఉంది'' మొహం వెనక్కి తిప్పి తన వెనక నిల్చున్న ప్రయాణికుడితో అన్నాడు గోవిందు.
"మీ ముందున్న వాడి వెనక జేబులో ఊసేయండి'' మెల్లగా సలహా ఇచ్చాడు ఆయన.
"ఆయనకి తెలిస్తే ...'' కిళ్లీ తుంపర్లు కింద పడకుండా అన్నాడు గోవిందు.
"తెలీదు - నేను ఊసింది మీకు తెలిసిందా?'' అడిగాడు ప్రయాణికుడు.

Link to comment
Share on other sites

గణేశ్ తన గర్ల్‌ఫ్రెండ్‌ని గుడికి రమ్మని ఫోన్ చేశాడు.

సురేష్ : ఒరేయ్...నీకేమైనా పిచ్చా! "ఐ లవ్ యు" చెప్పడానికి ఏదైనా మంచి పార్కుకో, సినిమాకో తీసుకెళ్ళాలి కాని గుడికెందుకురా?

గణేశ్ : గుడిలో చెప్పులు వేసుకోదు కదా సేఫ్ అని!

Link to comment
Share on other sites

come on...paina 'tumparlu' ane word ekkadundo choopinchu...pawan-kalyan-trivikram-laugh-gif.gif

take right...and then left..there you see pan shop...infront of tht..is tumparlu word pawan-kalyan-trivikram-laugh-gif.gif

Link to comment
Share on other sites

ఒక రైల్లోని అన్ రిజర్వుడ్ కంపార్ట్‌మెంట్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది.
"కిళ్లీ ఉమ్మడానికి కూడా కదిలే వీల్లేకుండా ఉంది'' మొహం వెనక్కి తిప్పి తన వెనక నిల్చున్న ప్రయాణికుడితో అన్నాడు గోవిందు.
"మీ ముందున్న వాడి వెనక జేబులో ఊసేయండి'' మెల్లగా సలహా ఇచ్చాడు ఆయన.
"ఆయనకి తెలిస్తే ...'' కిళ్లీ తుంపర్లు కింద పడకుండా అన్నాడు గోవిందు.
"తెలీదు - నేను ఊసింది మీకు తెలిసిందా?'' అడిగాడు ప్రయాణికుడు.

idi highlight...

Link to comment
Share on other sites

×
×
  • Create New...