Jump to content

" Hudhud" Cyclone In Ap..emergency Numbers Here


posaanisam

Recommended Posts

  • Replies 108
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • posaanisam

    35

  • timmy

    27

  • micxas

    5

  • chandra916

    5

60 అడుగులు చొచ్చుకు వచ్చిన సముద్రం... భయం గుప్పిట్లో ప్రజలు     11:20 AM
గంటగంటకూ హుదూద్ తుపాను తీరం వైపుకు దూసుకు వస్తోంది. ఈ క్రమంలో గాలుల వేగం అంతకంతకూ పెరుగుతోంది. అంతేకాకుండా సముద్రంలోని అలలు విలయ తాండవం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలోని బోయపాడు, బంగారంపేట, రాజయ్యపేట గ్రామాల వద్ద అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం ఏకంగా 60 అడుగుల మేర చొచ్చుకు వచ్చింది. దీంతో, మత్స్యకారులు పడవలు, వలలు, తెప్పలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విశాఖ నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు బలగాలు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా గస్తీ నిర్వహిస్తున్నాయి.

 

Link to comment
Share on other sites

జిల్లా కలెక్టర్లతో చంద్రబాబు సమీక్ష     11:07 AM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హుదూద్ తుపాను నేపథ్యంలో, అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఎప్పటికప్పుడు తనకు సమాచారాన్ని అందజేస్తూ ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా పొల్గొన్నారు

 

Link to comment
Share on other sites

Telanagana state  ki affaet ledu ga .. bye1

 

Untundhi may be heavy rains. panta nastam jaragachhu 

 

 
10Tv : KCR alerts officers ahead of Cyclone Hud Hud threat
    In the wake of cyclone Hud Hud threat, Telangana CM KCR has alerted the district Collectors and the Revenue officers. MeT department has cautioned the district administration saying that North Telangana may experience heavy rainfall. CM KCR as a means of preventive measures directed the concerned District Collectors, Officers and the ministers concerned to take a note of the situation . Telangana state governments is on high alert and working round the clock to ensure safety of people and property.

 

 

https://www.youtube.com/watch?v=NCnQHo9N8pg

Link to comment
Share on other sites

దిశ మార్చుకున్న హుదూద్... శ్రీకాకుళం దిశగా పయనం     10:48 AM
విశాఖ తీరం వైపు దూసుకొస్తున్న హుదూద్ తుఫాన్ దిశ మార్చుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అది శ్రీకాకుళం వైపు పయనిస్తోంది. అందరూ ఊహిస్తున్నట్టు ఆదివారం ఉదయం కంటే ముందుగానే హుదూద్ తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీరం దాటే సమయంలో 150 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయి. ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా మారింది. కొన్ని చోట్ల రెండు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడుతున్నాయి. మరికొన్ని చోట్ల 20 అడుగుల మేర సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. తీరంలోని మత్స్యకార గ్రామాల ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని, బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. అయితే, మార్గమధ్యంలో హుదూద్ మరోసారి తన మార్గాన్ని మార్చుకునే అవకాశాలు లేకపోలేదు.

 

Link to comment
Share on other sites

×
×
  • Create New...