Jump to content

కులాల కుంపట్లను రగిల్చింది ఎవరు?


Photography

Recommended Posts

politics1453867528.jpg

ఆవు గట్టున మేస్తే దూడ ఒడ్డున మేస్తుందా? తండ్రి బూతులు మాట్లాడుతుంటే కొడుకు నీతులు నేర్చుకుంటాడా? మన రాజకీయం మొత్తం కులాల చుట్టూ తిరుగుతుంటే, భవిష్యత్ నాయకులను తయారు చేసే యూనివర్సిటీలు కులాలకు దూరంగా పయనిస్తాయా? దానవీరశూరకర్ణ లో ఎన్టీఆర్ డైలాగులా..ఏనాడో కులాల కుంపట్లు రగిల్చేసి..’ కాగా నేడు కులము..కులము..అనే వ్యర్థ ప్రలాపమలు ఎందుకు?’. సెంట్రల్ యూనివర్సిటీ ఉదంతం తరువాత జనాలు అయ్యో యూనివర్సిటీలు కులాల కంపుతో భ్రష్ఠు పట్టిపోతున్నాయే అని చాలా మంది బాధపడిపోతున్నారు..కొన్ని మీడియాలైతే కాలమ్ కాలమ్ లకు ఈ విధమైన  సుద్దులు చెబుతూ వ్యాసాలు వండి వారుస్తున్నాయి. అంతే కానీ, అసలు ఈ కులాల కంపు ఆరంభం కావడానికి పునాదులు ఎక్కడ పడ్డాయి అన్నది ఆలోచించి, కారణమైన వారిని నిలదీయడం లేదు.

కుల సంఘాలు కొత్త కాదు

కులం..కుల సంఘాలు మనకేమీ కొత్త కాదు. అనాదిగా ఎవరి కులాన్ని వారు ఉద్దరించుకోవడం కోసం నెలకొన్నవే. రెడ్డి హాస్టల్, కమ్మ సంఘం అన్నది ఈనాడు కొత్తగా పుట్టుకు రాలేదు. దశాబ్ధాల కిందటే వున్నాయి. అయినా ఆనాడు చదువుకునే వారిలో ఏ సమస్య లేదు. ఆయా సంఘాలను తమను ఆదుకునే వాటిగానే చూసారంతే. కమ్మ పురోహితులను తయారుచేసి, బ్రాహ్మణులను ఎడం పెట్టాలని ప్రయత్నించినా కూడా ఘర్షణ వాతావరణం ఏనాడూ తలెత్త లేదు.

అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి బ్రాహ్మణులు, రెడ్లు, వెలమలు, ఎస్సీలు, కమ్మవారు ఎందరు ముఖ్యమంత్రులు చేసినా, కులం తెరవెనుకే వుంది తప్ప, దాన్ని తోసుకుని ముందుకు రాలేదు. ఎవరికి టికెట్ లు ఇస్తున్నారో? ఎవరికి అవార్డులు ఇస్తున్నారో? ఎవరికి అవకాశాలు దక్కుతున్నాయో? ఏనాడూ ఎవరూ లెక్కలు తీయలేదు. బాగుపడ్డవారు బాగు పడ్డారు. అవకాశం లేని వారు వేరే ప్రయత్నాలు చేసుకున్నారు. అంతే తప్ప, కులం ఆలోచనా లేదు..ఆక్రోశమూ లేదు.

అదిగో అప్పుడు వచ్చింది తెలుగుదేశం

తెలుగుదేశం ఆవిర్భావం పునాదులే సామాజికవర్గం పై అన్నది ఎవరు అవున్నన్నా, కాదన్నా కూడా నిజం. ఆనాటి రాజకీయ నాయకుల రచనలు రాస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. సరే, తమ కులానికి ఎక్కువగా రాజకీయ అవకాశాలు రావడం లేదు అని, ఓ వర్గం భావించడం కానీ, ఆ దిశగా ప్రయత్నించడం కానీ ఎంత మాత్రం తప్పు కాదు. కానీ అలా పార్టీ పెట్టిన తరువాత కులాలపై ఆలోచనలు మెదిలే దిశగా చేసిన తప్పులు మాత్రం చాలానే వున్నాయి.

తెలుగుదేశం పార్టీ పుడుతూనే తమది బీసీల అనుకూలం పార్టీ అనే ముద్రను తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. బీసీలకు ఎక్కువ టికెట్ లు ఇచ్చామన్నదాన్ని చాటాలని చూసింది. అంటే కులాల చిచ్చును రగల్చడం అక్కడ ప్రారంభమైంది. తమ పార్టీ పుట్టిన సామాజిక వర్గ పునాదులను బలోపేతం చేసుకోవడం కోసం, డిసిమల్ శాతం కూడా తమ జనాభా లేని చోట్ల కూడా కనీసం ఒక్క ఎమ్మెల్యే తమ వారు వుండాలన్న వ్యూహాన్ని ఆనాడే అమలు చేసింది. శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లాల్లో కూడా కమ్మవారిని వెదికి వెదికి టికెట్ లు ఇచ్చి, శాసనసభ్యులను చేసింది. అప్పటి వరకు కమ్మవారు..రాజకీయ అంటే కేవలం రెండు మూడు జిల్లాలకే పరిమితం అయితే, దాన్ని దాదాపు రాష్ట్రం అంతా వ్యాపింప చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగింది. శ్రీకాకుళం లాంటి వెనుకబడిన ప్రాంతం రాజకీయ పగ్గాలు కూడా తమ వారి చేతిలో వుండేలా ఎన్టీఆర్ చూసుకున్నారు.

అధికారం వచ్చిన తరువాత ఏ విభాగానికి సరైన వ్యక్తి కావాలి అంటే ముందు కమ్మవారిలో వెదికారు. ఎక్కడో వున్న కాకర్ల సుబ్బారావు, కోనేరు రామకృష్ణారావు లాంటి వారిని వెదికి వెదికి తెచ్చారు. వాళ్లంతా వారి వారి విభాగాల్లో లబ్ద ప్రతిష్టులే. అందులో కాదనడానికి లేదు. అణుమాత్రం సందేహం లేదు. కానీ వెదికి వెదికి అందరినీ ఒకే సామాజిక వర్గం వారిని తీసుకురావడంలో జరిగింది కీలక పరిణామం. తెలుగుదేశం పార్టీ కులం ప్రాతిపదిక అనేదాన్ని ఎంత సీరియస్ గా తీసుకుందీ అంటే...వేరే కులం వారు తమ కులం వారిని పెళ్లి చేసుకున్నా  దగ్గరకు తీసుకుంది. తమ కులం వారు వేరే మతం లోకి వెళ్లినా పట్టుకువచ్చింది. ఇలా అడుగుడుగునా కులం లెక్కలు బేరీజు వేసింది.

వీలయినన్ని ఎక్కువ టికెట్ లు, బీసీలకు టికెట్ లు ఇచ్చి, ఆ విధంగా అధికారం సంపాదించి, ఆపై వచ్చిన అధికారంతో , పార్టీ పదవులు, అధికార పదవులు ఇలా అన్నింటా కమ్మవారికి ప్రాధాన్యత పెరగడం, కీలక అధికారాలు తమ చేతిలో వుంచుకోవడంతో, మొదలయింది మిగిలిన కులాల వారిలో ఆలోచన. ముఖ్యంగా అప్పటి వరకు ఎక్కువగా రాజకీయ అధికారాన్ని అనుభవించిన రెడ్డి సామాజిక వర్గంలో. అయితే తెలంగాణ, రాయలసీమ, కోస్తా, తూర్పు ఇలా రకరకాలుగా విడిపోయి వున్నారు రెడ్డి సామాజిక వర్గ జనాభా. వీళ్లకు అధికారం వస్తే, వాళ్లు కాళ్లు లాగడం, వాళ్లకు వస్తే వాళ్లు కిందా మీదా అయిపోవడం.

వైఎస్ రాకతో

వైఎస్ పాదయాత్ర నాటికి పీక్ కు చేరుకుంది రాష్ట్రంలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల నడుమ కనిపించని పోరు. వైఎస్ ఓ ఆశాకిరణంలా కనిపించారు రెడ్డి సామాజిక వర్గానికి. తొలిసారి ఏకమయ్యారు..అందరూ..అధికారం అందుకున్నారు. అక్కడే మళ్లీ మరోసారి తప్పు జరిగింది. వైఎస్ కూడా ఎన్టీఆర్..తెలుగుదేశం బాటలోనే పయనించారు. అప్పటి వరకు దాదాపు దశాబ్ధ కాలంగా అన్ని విధాలా అవకాశాలకు దూరమైన రెడ్లను ముందకు తోసారు. ఎక్కడ ఏమున్నా..ఎక్కడ ఎవరు కావాలన్నా ఓ రెడ్డిని వెదికి పట్టుకు వచ్చారు.

చిత్రమేమిటంటే పదవులు, అధికారం అన్నీ రెడ్లకు కట్టబెట్టినా వ్యాపారపరంగా వైఎస్ వల్ల ఎక్కువగా లబ్ది పొందింది కమ్మ సామాజిక వర్గమే. ఆ విషయాన్ని అప్పట్లో వారే బాహాటంగా చెప్పుకునేవారు. చంద్రబాబు కన్నా వైఎస్ హయామే తమకు వ్యాపార అవకాశాలు ఎక్కువ ఇచ్చిందని. అదంతా వేరే సంగతి.

ఒక్కటైన కమ్మవారు

ఎప్పడైతే ఎక్కడబడితే అక్కడ రెడ్ల ప్రాబల్యం కనిపించిందో, పదేళ్లు అధికారానికి దూరమైన కమ్మ సామాజిక వర్గం భూమ్యాకాశాలు ఏకం చేసేంతగా శ్రమించింది. ప్రతి ఒక్కరు ఎవరి శక్తి, ఎవరి ఆయుధాలు వారు అందించారు. మరోసారి తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. వస్తూనే చంద్రబాబు కూడా వైఎస్ బాట పట్టారు. గతంలో చంద్రబాబు అధికారంలో వున్నా చేయనంతగా, ఈసారి కమ్మ సామాజికవర్గం కోసం చేయడం ప్రారంభించారు. అధికార పదవులను చకచకా ఏ మాత్రం ఆల్యస్యం చేయకుండా తమ వర్గానికి అందించేసారు. ఒక గెలవని వారిని, టికెట్ లు అందని వారిని ఎంపికచేసి మరీ ఎమ్మెల్సీలను చేసారు. లేదూ అంటే ఏదో ఒక పదవి అందించారు. ఇదంతా తొలి ఆర్నెల్లలోనే ఎక్కువగా జరగడం విశేషం.  ఆఖరికి కేంద్రం ఇచ్చే పద్మ అవార్డల్లో 90 శాతం కమ్మవారే ఎంపికయ్యారు అంటే తెరవెనుక ఏమీ జరగలేదు అని ఎలా నమ్మాలి?

చిరంజీవితో మూడో వర్గం

అయితే రెడ్లు..కమ్మవారు ఇలా అధికారం కోసం కొట్టుకుంటున్న తరుణంలో మధ్యలో చిరంజీవి వచ్చారు..ప్రజారాజ్యం అన్నారు. ఆ పార్టీ పుట్టింది కాపుల కోసమే అన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. దీంతో కాపుల్లో కూడా రాజకీయచైతన్యం పెరిగింది. కానీ అధికారం మాత్రం అందలేదు. కానీ రాజకీయాల్లో కాపుల ప్రాధాన్యత మరింత పెరిగింది. దాంతో 2014 ఎన్నికల్లో కాపులను ట్రంప్ కార్డుగా వాడుకుంది తెలుగుదేశం పార్టీ.  అదే సమయంలో తెలంగాణలో బీసీలను వాడుకునే ప్రయత్నం చేసింది. ఇలా రెండు చోట్లా రెండు వర్గాలను తెరముందుకు తెచ్చింది.ఒకప్పుడు బిసీల పార్టీ అని ముద్ర వేసుకునేందుకు ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కాపుల పార్టీ అని ముద్రవేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాపులకు పార్టీ పదవులు, అధికారిక పదవులు కొన్ని అయినా ఇచ్చి, భవిష్యత్ లో ఆ వర్గ ఓటు బ్యాంకు తమతొనే వుండేలా చూసుకుంటోంది.  దీంతో వైకాపా పార్టీ కూడా కాపుల అండ వీలయినంత సంపాదించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.

80 దశకం తరువాతే

నిజానికి 80 దశకానికి ముందు కులాలు, చుట్టరికాలు వ్యక్తిగత జీవితం వరకే పరిమితం అయ్యేవి. కానీ ఆ తరువాతే అవి పెరిగిపోయాయన్నది వాస్తవం. అప్పటివరకు చదువుకున్న వారిలో కులాల ముచ్చట్లు తక్కువ. కానీ ఇప్పుడు చదవుకున్నవారిలో, చదువుతున్నవారిలో, అందరిలో కులాల బాధే. సమస్య ఏమిటంటే ఎవరి కులాల వారితో వారు సంబంధ బాంధవ్యాలు నెరపుకునే వరకు తప్పులేదు. కానీ మాదే గొప్ప, మా వాళ్లే గొప్ప, మా నాయకుడు తప్పు చేసినా ఒప్పే, మా నాయకుడి అవినీతి అయినా ముద్దే..మా పార్టీయే సూపర్..మా కుల హీరోనే హీరో..ఇలాంటి జాఢ్యాలు మాత్రం అస్సలు తగవు. కానీ ఇప్పడేం చేయలేరు ఎవరు? ఎందుకంటే తెలుగునాట ఈ కులజాఢ్యం క్యాన్సర్ లా ముదిరిపోయి, అన్ని రంగాలను ఆక్రమించేసింది. వ్యాపారాలు, సినిమాలు, కెరీర్ లు అన్నీ కులాల ఆలంబనగా సాగుతున్నాయి..

ఎదుటవారికే నీతులు

చిత్రమేమిటంటే మన మీడియా సంస్థలు ఎదుటవారికి మాత్రం భలేగా నీతులు చెబుతాయి. కానీ ఆచరణలో మాత్రం తమ తమ వర్గాలకే పెద్ద పీట వేస్తాయి. తమ తమ కులం వారికి పెద్ద పీట, ప్రాధాన్యత వేయకుంటే మన సినిమా రంగంలో కమ్మవారే ఎందుకు అంత ప్రాబల్యం సంపాదించగలిగారు. మన మీడియా రంగంలో తొంభై శాతం కమ్మవారి చేతుల్లోనే ఎందుకు వుంది? పేరుకు కులాలు పనికిరావు..తగవు..ఇలాంటి నీతి సూత్రాలు వల్లిస్తుంటారు. కానీ ఆచరణలో మాత్రం ఏ కులం వారు ఆ కులం వారిని దగ్గరకు తీసుకుంటారు. ఇక్కడ రాయలేని ఈక్వేషన్లు, వ్యవహారాలు ఇంకా చాలా వున్నాయి..అవన్నీ ఏకరవు పెడితే కులం అన్నది తెలుగువారి జీవితాల్లో ఎంత దూరిపోయిందో అర్థం అవుతుంది.

విదేశాల్లో

ఇప్పుడు విదేశాల్లో కూడా అన్నీ కులసంఘలే..పేరుకే తెలుగు సంఘాలు. ఎవరి కుంపటి వారిది. బాగుండదని ఓ జాయింట్ సెక్రటరీనో, వైస్ ప్రెసిడెంట్ నో అవతలి కులం వారికి అందిస్తారు. దేశంలో విదేశంలో అని లేదు..సంఘాలు అన్నీ కులాల ప్రాతిపదికగానే. భలే చమక్కు ఏమిటంటే..ఓ కమ్మ వారి సంఘం..మరీ బాగుండదనో, ఏదైనా లోపాయి కారీ వ్యవహారం వుండో, వేరే కులం వారికి సన్మానం చేసింది అనుకుందాం..కానీ సమావేశానికి అతిధులు, ముఖ్య అతిధులు అంతా కమ్మవారే వుంటారు. పోనీ ఎవరు ఏమయినా అనుకుంటారని వుండదు. ఈ విషయంలో రెడ్లు చాలా వరకు నయం. కుల పిచ్చి మరీ ఇంత పీక్ కు వెళ్లలేదు.

ఇప్పుడు చెప్పండి

ఇప్పుడు మన రాజకీయం మొత్తం కులాల చుట్టూ తిరుగుతోంది. ఓట్లు వున్నవారిని చేరదీసి, వారికి కాసిన్ని సీట్లు, పదవులు ఇచ్చి, అధికారం సంపాదించి, ఆపై తమవారికి అన్ని విదాలా మేలుచేయడం అనేదే రెడ్డి..కమ్మ పార్టీల ఎజెండా అయింది. అయతే ఈ పార్టీల ఎజెండాను కనిపెట్టి, ముందుగా వీలయినన్నది పదవులు సంపాదించి, తమ ప్రాబల్యం పెంచుకుని ఎప్పటికైనా రాజ్యాధికారం అందుకోవాలనేది కాపుల తపనగా మారింది.  మిగిలిన కులాలు ఎలాగూ రాజ్యాధికారం అందుకోలేవు. కాంగ్రెస్ పార్టీ కాదు..ఎస్సీలకు, వెలమలకు, బ్రాహ్మణులకు, కోమట్లకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి. ఇప్పుడు లీడ్ లో వున్న రెండు పార్టీలు తెలుగుదేశం, వైకాపా ఎప్పటికీ ఆ పని చేయలేవు..చేయవు.

ఇలా రెండు కులాల ప్రాతిపదికగా రాష్ట్రం, రాజకీయాలు చీలిపోయినపుడు, వర్సిటీల్లో మాత్రం ఎందుకు కులాల కుమ్ములాటలు వుండవు? ఏ పార్టీ అధికారంలోకి వస్తే, ఆ కులం వ్యక్తులను కీలక పదవుల్లో నియమిస్తుంది. దాంతో ఆ కులం జనాలదే పైచేయి అవుతుంది. దాంతో మిగిలిన కులాలకు వాళ్లకు నడుమ సంఘర్షణ తప్పదు. అది వర్సిటీ కావచ్చు..మరే సంస్థ అయినా కావచ్చు.  

అందువల్ల ఈ కులాల రావణకాష్ఠం ఇలా మండుతూనే వుంటుంది. దీన్ని ఆర్పడం అన్నది అసాధ్యం. పోనీ కులాంతర వివాహాలు చేసకుంటే ఈ కులాల  జాడ్యం పోతుందా అని అనుకంటే అప్పుడు మరీ డబుల్ అయిపోతోంది..కమ్మ..కాపు పెళ్లాడారు అనుకుందాం..అక్కడి నుంచి ఇక ఉభయ చరం గా మారిపోతున్నారు. కమ్మవారి కోటానా.కాపుల కోటానా అన్నట్లు అధికారం సంపాదిస్తున్నారు. అందువల్లే కులాలు ఇక పోవు. పోవు అనేకన్నా, పోనివ్వరు అనడం సబబేమో? ఎందుకంటే రాబోయే తరానికి కూడా ఉగ్గుపాలతో దీన్ని రంగరించి పోసేస్తున్నారు కదా... 

ఒక్కపుడు బ్రాహ్మణులకో, రెడ్లకో పేరు చివర తోక వుండేది.. ఇప్పుడు అందరూ కావాలని తగిలించుకుంటున్నారు. తద్వారా తాము ఫలానా అని తెలియ చెప్పాలనుకుంటున్నారు. లబ్దిపొందాలనుకుంటునారు. మరి ఎలా పోతుంది కులం..వ్యాసాలు రాసినంత వీజీ కాదు..కులాలు పోగొట్టడం. రెడ్లు.. కమ్మలు.. కాపులు.. తమ కులాల వారినే నెత్తిన పెట్టుకుందాం..మిగిలిన వారిని కిందకు తొక్కేద్దాం అనే జాఢ్యం పొగోట్టుకునేదాకా..అది దాదాపు అసాధ్యం.

Link to comment
Share on other sites

naa koduku nenu dalit kadu ani HCU died father cheptuna aa news ni head lines lo nunchi tesesi every 5 min ki oka sari dalit scholar.. dalit scholar 

 

antaru media is really sick on paid news

Link to comment
Share on other sites

avv jai KCR  

 

oh..got it...

neeku Jai Baliah ante caste based  or party based lo anna ani artham ainda...

nenu normal ga anna andaru funny ga annattu..

 

nice man... Stereo type ki add chesav ga nannu...good

gurthunchukunta...

Link to comment
Share on other sites

greatandhra lo chusa bhayya...eppudu ikkada kottukuntu untaru kada ani vesa

 

nuvvu eh Andhra lo chusina kuda ilanti controversial topics post esthe undav...aipothav...

just ee warning ichinanduke agatledu nagara pourulu....inka nuvvu post esav...lite inka..

Link to comment
Share on other sites

oh..got it...

neeku Jai Baliah ante caste based  or party based lo anna ani artham ainda...

nenu normal ga anna andaru funny ga annattu..

 

nice man... Stereo type ki add chesav ga nannu...good

gurthunchukunta...

maali eeapudu cheptav brahmanandam+venkatesh.gif

Link to comment
Share on other sites

కులాల గొడవలు మన దగ్గర నుంచే మొదలు అవుతాయి...అంటే ప్రజలే

Link to comment
Share on other sites

×
×
  • Create New...