Jump to content

టీడీపీ డైరెక్షన్‌లో పవన్‌ గర్జిస్తాడు.!


Photography

Recommended Posts

janasena_pawan1454295779.jpg

పవన్‌కళ్యాణ్ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమా షూటింగ్‌ పక్కన పెట్టేశాడట. ఈ రోజు మీడియా ముందుకొస్తాడట. అయ్యగారు వస్తున్నారహో.. అంటూ చాటింపు కూడా జరిగిపోయింది. రైలు తగలబడితేగానీ, బోల్డన్ని వాహనాలు ధ్వంసమైతేగానీ, పోలీసులపై దాడులు జరిగితేగానీ, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తేగానీ.. పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌కి తెల్లారినట్లు లేదు.. ఇప్పుడే ఆయన నిద్ర లేచారు. కాదు కాదు, నిద్రలోంచి లేపబడ్డారు. ఔను, కుంభర్ణుడిలా నిద్రపోతోంటే, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన్ని నిద్రలేపారు మరి.! 

కాపు గర్జన ఉద్రిక్తమవడం, ఈ క్రమంలో విధ్వంసాలు జరగడంతో చంద్రబాబు కంగారుపడ్డారు. ఇలాంటి సందర్భాల్లో పవన్‌కళ్యాణ్‌ గుర్తుకొస్తున్నారు చిత్రంగా చంద్రబాబుకి. బాబ్బాబూ, కాస్త మీడియా ముందుకొచ్చి ఏదో ఒకటి మాట్లాడవయ్యా.. అని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ని బతిమాలుకున్నట్టున్నారు. చంద్రబాబు పిలిస్తే పవన్‌ రాకుండా వుంటారా.? ఆ మధ్య రాజధాని భూ సమీకరణ విషయంలో చంద్రబాబుకి, పవన్‌కళ్యాణ్‌ ఏ స్థాయిలో 'ఉపయోగపడ్డాడో' అందరికీ తెల్సిందే. ఇప్పుడీ కాపు గర్జన సంక్షోభం నుంచీ చంద్రబాబుని బయటపడాలంటే కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్‌కళ్యాణే, టీడీపీకి పెద్ద దిక్కు కామెడీగా. 

పవన్‌కళ్యాణ్‌ మీడియా ముందుకొస్తే ఏం మాట్లాడతాడు.? ఇంకేముంటుంది, రిజర్వేషన్ల పేరుతో కులాల కుంపట్లు రేపుతున్నారంటూ పవన్‌కళ్యాణ్‌ షరామామూలుగానే ఆవేదన వ్యక్తం చేసేస్తారు. ఓ పక్క కాపు సామాజిక వర్గానికి అండగా తానుంటానని పవన్‌ అంటాడేమో. అయితే పోరాటం చేయాల్సిన పద్ధతి ఇది కాదు. చంద్రబాబు మీద తనకు నమ్మకం వుంది.. అని ఆయన చెప్పడం ఖాయం. ఇకనేం, మేటర్‌ ఫినిష్‌. అంతే తప్ప, ఎన్నికల సమయంలో చంద్రబాబు, కాపుల్ని బీసీల్లో చేరుస్తామనే హామీ ఇచ్చారు, ఇచ్చిన హామీ నిలబెట్టుకోనందుకే ఇలా జరిగింది.. అని చంద్రబాబుని కడిగేస్తారా.? ఛాన్సే లేదు. 

ఒక్క మాటలో చెప్పాలంటే, పవన్‌ మీడియా ముందుకొచ్చి గర్జిస్తాడు.. అన్నది ఉత్తమాట. పిల్లిలా, చంద్రబాబు స్క్రీన్‌ ప్లే ప్రకారం నటిస్తాడు. అంతకు మించి, పవన్‌ గడచిన పద్ధెనిమిది నెలల్లో రాజకీయ నాయకుడిగా చేసిందేమీ లేదు.

Link to comment
Share on other sites

×
×
  • Create New...