Jump to content

Kcr Modi Lu Kulam Tho Gelicharaa Ani Prashnishina Cbn


ramudu3

Recommended Posts

కులాలతో ఎవరూ ఎన్నికల్లో గెలవరని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కుల ఉద్యమాలకు మీడియా విపరీతమైన ప్రచారం కల్పించడాన్ని ఆక్షేపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ‘కులం - రాజకీయం’పై ఆసక్తికరంగా మాట్లాడారు. ‘‘కులంతో ఎవరూ గెలవరు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ది ఏ కులం? ఆయన కులంతో గెలిచారా? ప్రధాని మోదీది ఏ కులం? ఆయన కులం ప్రాతిపదికన గెలిచారా? బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌లవి ఏ కులాలు?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. కుల ఉద్యమం చేసిన మాదిగ దండోరా నేత మంద కృష్ణ మాదిగ పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయని ప్రశ్నించారు. కాపులకు కోటాను వ్యతిరేకిస్తున్న బీసీ నేత, తమ పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య పేరు కూడా ప్రస్తావించారు. ఆర్‌.కృష్ణయ్యను పోటీకి పెట్టడంవల్లే ఆ స్థానంలో (ఎల్బీ నగర్‌) తమకు మెజారిటీ తగ్గిందని వ్యాఖ్యానించారు. కులం, మతం, ప్రాంతం పేరుతో విడిపోతే సమస్యలు వస్తాయన్నారు. ‘‘కులం అనేది మనం గీసుకున్న గీత. నాకు తెలిసి రెండే కులాలున్నాయి. అవి... ధనికులు, పేదలు. నా మద్దతు ఎప్పుడూ పేదలకే. ఫలానా కులంలో పుట్టాలని ఎవరూ ఎంచుకోరు. అంతా సంపన్నులుగానే పుట్టాలనుకుంటారు. నేను రాయలసీమలో పుట్టాను. కృష్ణా జిల్లాలో బాగా నీళ్లుంటాయి. సీమవాసులకు నీళ్లు దొరకవు. ఆయా ప్రాంతాల్లో పుట్టడం అన్నది మనుషుల చేతుల్లో లేదు’’ అని సీఎం పేర్కొన్నారు. మన చేతుల్లో లేని కులం, ప్రాంతాలతో రాజకీయలు చేయడం, దుష్ట రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదని, ఈ అంశంపై ప్రజల్లో చైతన్యం తెస్తానని చెప్పారు. కుల, మత రాజకీయాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ‘కాపు కమిషన్‌ నివేదిక వచ్చేవరకు రిజర్వేషన్‌ అంశంపై మరేమీ చర్యలు ఉండవు కదా?’ అని ఓ విలేకరి ప్రశ్నించడంతో చంద్రబాబు మండిపడ్డారు. ‘ఏం చేయాలి? మీడియాకు నెగెటివ్‌ అంశాలే కావాలి. విశాఖలో 50 దేశాల ప్రతినిధులు పాల్గొన్న నేవీ ఫ్లీట్‌ రివ్యూపై సరైన కవరేజ్‌ రాలేదు. కానీ... నన్ను ఎవరైనా తిడితే మాత్రం బాగా ఇస్తారు. ఇండియాలో మైండ్‌సెట్‌ అలాగే ఉంది. విధ్వంసకర రాజకీయాలకు ప్రచారం ఎక్కువ’’ అని వ్యాఖ్యానించారు. మీడియా కూడా కుల ఉద్యమాలకు ప్రచారం కల్పించి రెచ్చగొడుతోందన్నారు. హైదరాబాద్‌లో తాను చేసిన అభివృద్ధికి తిరిగి ప్రతిఫలాన్ని ఆశించలేదని, అందుకే ఎన్నికల్లో ఓటమికి బాధ పడటంలేదని చంద్రబాబు చెప్పారు. ‘ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దామని చెప్పుకొంటున్నా... మీ పార్టీకి గ్రేటర్‌ ప్రజలు కేవలం ఒక్క సీటు ఇచ్చారేమిటి?’ అని ప్రశ్నించగా... ‘‘పర్లేదు. నా బాధ్యత నేను చేశాను. ఎందుకు బాధ పడాలి. చేసిన దానికి ఫలితం ఆశిస్తేనే మనిషికి బాధ ఉంటుంది. నేను ఏమీ ఆశించలేదు కాబట్టి బాధ లేదు’’ అని అన్నారు. ఇప్పుడు కూడా తాను అభివృద్ధి చేస్తున్నది ఫలితం ఆశించి కాదన్నారు. ‘‘రేపు నాకు ఓట్లు వేస్తారా? నాతోనే ఉంటారా? అని ఆలోచిస్తే పని చేయలేం. ప్రజల శ్రేయస్సు కోసం చేస్తున్నాను. నేను చేసిన అభివృద్ధిని, ఎందుకు ఓడిపోయామనే అంశాలను బేరీజు వేస్తూ ఇంటర్నెట్‌లో ఓ వ్యక్తి లేఖ రాశారు. అది చదివితే కళ్లలో నీళ్లు వస్తాయి’’ అని అన్నారు.

Link to comment
Share on other sites

super fishy undi idi - sakshit lo SC ga puttalani ane dialog ki christian bedars ki kaaluddi - kulam tho kcr or modi gelavakapoina - kulam lekapothe babu goru maatram geliche matter ledu 

Link to comment
Share on other sites

×
×
  • Create New...