Jump to content

Vizag Ki Railway Zone Confirm Ayyindii


aakathaai

Recommended Posts

మోదీ కోర్టులో రైల్వేజోన్‌!
10-02-2016 00:28:35
 
 
  • రైల్వే శాఖ గ్రీన్‌ సిగ్నల్‌
  • ప్రధాని నిర్ణయమే తరువాయి
  • రైల్వేమంత్రితో చంద్రబాబు భేటీ
  • పలు లైన్లు, రైళ్లపై విన్నపాలు
  • మంగళగిరి - అమరావతి లైను
  • కీలక ప్రాజెక్టులకు త్వరలో ఎస్పీవీలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా విశాఖపట్నంలో రైల్వే జోన్‌కు రైల్వే శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సంబంధిత ఫైలును ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించింది. ప్రధాని మోదీ ఓకే అనడమే ఆల స్యం... నవ్యాంధ్రకు రైల్వే జోన్‌ దక్కనుంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు సీఎం చంద్రబాబుకు చెప్పినట్లు తెలిసింది. విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటుకు రైల్వే మంత్రి సుముఖత వ్యక్తం చేశారని, త్వరలో ఈ అంశం కేబినెట్‌కు వెళ్లనుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి విలేక రులకు తెలిపారు. సీఎం చంద్రబాబు మంగళ వారం ఢిల్లీలో రైల్వే మంత్రితో ఆయన కార్యాల యంలో భేటీ అయ్యారు. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలని, ఈ మేరకు విభజన చట్టంలో కూడా హామీ ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. రైల్వే మంత్రి స్పంది స్తూ.. ఈ అంశంపై ఇప్పటికే తమ పరిధిలో నిర్ణ యం తీసేసుకున్నామని, తదుపరి అనుమతుల కోసం నివేదిక సిద్ధం చేశామని తెలిపారు.
 

విశాఖ-తడ లైను సర్వే పూర్తయింది


రైల్వే మంత్రితో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నం నుంచి తడ వరకూ మూడో లైనును నిర్మించాలని, తద్వారా ప్రస్తుతం ఉన్న రెండు లైన్లపై రద్దీని తగ్గించాలని రైల్వే మంత్రిని కోరినట్లు చెప్పారు. ‘ఈ రైల్వేలైను నిర్మాణానికి సంబంధించి సాధ్యాసాధ్యాల నివేదిక, సర్వే కూడా పూర్తయ్యాయి. మరో 3-4 ఏళ్లలో ఈ లైనును పూర్తి చేయాలని కోరాం. విశాఖ -హౌరా, రాయచూర్‌-విజయనగరం మధ్య కూడా రద్దీని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశాం. విశాఖ-చెన్నై మధ్య నూతన రైళ్లను ప్రవేశపెట్టాలని కూడా కోరాం. నూతన రాజధాని అమరావతికి రైల్వే అనుసంధానత పెంచేందుకు, రైల్వే మౌలిక సదుపాయాలను పెంచేందుకు చర్యలు చేపట్టాలని, ఇందులో భాగంగా మంగళగిరి నుంచి అమరావతికి కొత్త రైల్వేలైను వేయాలని అభ్యర్థించాం. అమరావతి నుంచి విశాఖకు, అమరావతి నుంచి చెన్నైకి వెళ్లేలా మంగళగిరి వద్ద వై-జంక్షన్‌ను నిర్మించాలని, తద్వారా ఎటువైపు రైలు వెళ్లాలన్నా ఇబ్బంది లేకుండా ఉంటుందని సూచించాం. ఈ ప్రతిపాదనను పరిశీలించి, త్వరగా చేపట్టాలని బోర్డు చైర్మన్‌ ఏకే మిట్టల్‌ను మంత్రి ఆదేశించారు. అమరావతికి ప్రజలు ఉదయం పూట వచ్చి, సాయంత్రానికల్లా తిరిగి వెళ్లేలా విశాఖపట్నం, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నగరాల నుంచి శతాబ్ది సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని కోరాం. తద్వారా నలువైపులా అమరావతికి అనుసంధానత పెరుగుతుంది. ఈ అంశాలను కూడా త్వరగా పరిశీలించి, పరిష్కరిస్తామని రైల్వే మంత్రి హామీ ఇచ్చారు’ అని వెల్లడించారు.
Link to comment
Share on other sites

  • Replies 39
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Kool_SRG

    7

  • aakathaai

    6

  • VizagRocks

    3

  • sandie

    2

Top Posters In This Topic

×
×
  • Create New...