Jump to content

Old Telugu Mp3 Songs Download Links


timmy

Recommended Posts

sample

 

https://www.youtube.com/watch?v=3ksCh3RzMFg

 

చిత్రం: చీకటి వెలుగులు (1975)
గీత రచయిత: దేవులపల్లి కృష్ణశాస్త్రి 
సంగీతం: చక్రవర్తి 
పాడిన వారు: పి.సుశీల, ఎస్ పి.బాలసుబ్రమణ్యం 
చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు
చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు 
ఏకమైన హృదయాలలో ..ఏకమైన హృదయాలలో పాకే బంగరురంగులు
ఈ మెడచుట్టు గులాబీలు, ఈ సిగపాయల మందారాలు .. ఈ మెడచుట్టు గులాబీలు, ఈ సిగపాయల మందారాలు
ఎక్కడివీ రాగాలు చిక్కని ఈ అరుణ రాగాలు .. అందీఅందని సత్యాలా,సుందర మధుర స్వప్నాలా ...

తేటనీటి ఈ ఏటిఒడ్డున నాటిన పువ్వుల తోట .. తేటనీటి ఈ ఏటిఒడ్డున నాటిన పువ్వుల తోట
నిండు కడవల నీరుపోసి .. గుండెల వలపులు కుమ్మరించి, ప్రతి తీగకు చేయూతనిచ్చి , ప్రతి మాను పులకింపచేసి
మనమే పెంచినదీతోట .. మరి ఎన్నడు వాడనిదీతోట. మనమే పెంచినదీతోట .. మరి ఎన్నడు వాడనిదీతోట.
మరచిపోకుమా తోటమాలి పొరపడి అయినా మతిమాలి. మరచిపోకుమా తోటమాలి పొరపడి ఐనా మతిమాలి.

ఆరు ఋతువులు ఆమని వేళలే మన తోటలో .. అన్ని రాత్రులు పున్నమి రాత్రులే మన మనసులో ..
మల్లెలతో వసంతం, చేమంతులతో హేమంతం. మల్లెలతో వసంతం, చేమంతులతో హేమంతం.
వెన్నెల పారిజాతాలు, వానకారు సంపెంగలు . వెన్నెల పారిజాతాలు, వానకారు సంపెంగలు .
అన్నీ మనకు చుట్టాలే ..వచ్చెపోయే అథిదులె. ఈ మెడచుట్టు గులాబీలు, ఈ సిగపాయల మందారాలు
ఎక్కడివీ రాగాలు చిక్కని ఈ అరుణ రాగాలు ..ఎక్కడివీ రాగాలు చిక్కని ఈ అరుణ రాగాలు

ష్ .. గలగలమనకూడదు ఆకులలో గాలి ,జలజలమనరాదు అలలతో కొండవాగు
నిదరోయె కొలనునీరు.. నిదరోయె కొలనునీరు కదపకూడదు. ఒదిగుండే పూలతీగ ఊపరాదు.
కొమ్మపై ఇక జంటపూలు. గూటిలో ఇక రెండు గువ్వలు. 
ఈ మెడచుట్టు గులాబీలు, ఈ సిగపాయల మందారాలు ..
ఎక్కడివీ రాగాలు చిక్కని ఈ అరుణ రాగాలు .
.మరచిపోకుమా తోటమాలి పొరపడి ఐనా మతిమాలి.

Link to comment
Share on other sites

×
×
  • Create New...