Jump to content

Develop Ina Hideravaad Inka Develop Avataniki 77K Crores Kavali


NO17

Recommended Posts

‘విశ్వనగరం’ కోసం 77 వేల కోట్లు కావాలి
బ్రిక్స్ రుణం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు
గ్రేటర్ పరిధిలో ప్రాజెక్టుల వారీగా సమగ్ర నివేదికల తయారీ
అంచనాల ముసాయిదాను కేంద్రానికి పంపిన సర్కారు
మూడో వంతు నిధులు రహదారుల అభివృద్ధికే
కౌంటర్ మాగ్నెట్ సిటీలు, ఓఆర్‌ఆర్‌కు అనుసంధాన రోడ్లు
మూసీపై స్కైవేలు, ట్రాన్సిట్ ఓరియెంటెడ్ గ్రోత్ సెంటర్లు

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. నగరాన్ని వివిధ రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పలు భారీ ప్రాజెక్టులు చేపడుతోంది. ఈ పనులకు అవసరమైన నిధులను బ్రిక్స్ బ్యాంకు నుంచి రుణంగా సేకరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకు వీలుగా రూపొందించిన ప్రాజెక్టు రిపోర్టును ఇటీవలే కేంద్రానికి పంపింది. మొత్తం రూ.77,553 కోట్ల అంచనాలతో ఈ భారీ రుణ ప్రణాళికను తయారు చేసింది. నగరంలో కొత్తగా ఎంచుకున్న ప్రాజెక్టులతో పాటు చేపట్టబోయే అభివృద్ధి పనులను అందులో ప్రస్తావించింది. వీటితో ఒనగూరే ప్రయోజనాలు, భవిష్యత్ ఫలితాలను సైతం విశ్లేషించింది. ఈ అంచనాల ముసాయిదాను మున్సిపల్ శాఖ కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగానికి పంపించింది. రాష్ట్రాలు అంతర్జాతీయ సంస్థల నుంచి రుణ సాయం పొందేందుకు కేంద్రం నిర్దేశించిన నమూనాకు అనుగుణంగా... ఈ అంచనాలను సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం ఆమోదించిన తర్వాత ఈ ప్రతిపాదనలను బ్రిక్స్ బ్యాంకుకు పంపించనున్నారు. జీహెచ్‌ఎంసీ పేరిట తీసుకునే ఈ రుణానికి ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటుంది.

Link to comment
Share on other sites

×
×
  • Create New...