Jump to content

తెలంగాణ క‌క్కుర్తిపై సుప్రీం ఫైర్‌ !


ticket

Recommended Posts

విభ‌జ‌న చ‌ట్టం అడ్డుపెట్టుకొని, లేదా కీల‌క కార్యాల‌యాల‌న్నీ హైద‌రాబాద్‌లో ఉన్నాయి కాబ‌ట్టి తామేం చేసినా చెల్లుతుంద‌నే భావ‌న‌తో తెలంగాణ ప్ర‌భుత్వం చేసిన ప‌నికి సుప్రీంకోర్టు అడ్డుప‌డింది. 13 జిల్లాల సొమ్మును అప్ప‌నంగా కొట్టేసేందుకు వేసిన ఎత్తును అడ్డుకోవ‌డంలో ఏపీ ప్ర‌భుత్వం పై చేయి సాధించింది.

ఆంధ్రప్రదేశ్‌ విభజన తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లల మధ్య ప‌లు అంశాల విష‌యంలో తగాదాలు జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఉన్నత విద్యా మండలి నిధులు, వ్యవహరంపై రెండు రాష్ట్రాల మద్య తగదా నెలకొంది. ఏపీ ఉన్నత‌ విద్యా మండలి ఉనికిలో లేదని, ఆ సంస్థకు సంబంధించిన ఆస్తులన్నీ తెలంగాణ ఉన్నత విద్యా మండలికే చెందుతాయంటూ తెలంగాణ స‌ర్కారు త‌మ ఖాతాలోకి జ‌మ చేసుకుంది. దీనిపై ఏపీ ప్ర‌భుత్వం ఉమ్మడి హైకోర్టులో ఫిర్యాదు చేయ‌గా తెలంగాణ ప్ర‌భుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఏపీ ఉన్న‌త విద్యా మండలి సుప్రీం కోర్టులో సవాల్‌ చేసింది. ఈ కేసుపై న్యాయమూర్తులు జస్టిస్‌ వి.గోపాలగౌడ, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతూ తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ తరపున సీనియర్‌ న్యాయవాది పీపీ రావు వాదనలు వినిపిస్తూ, విభజన అనంతరం 13 జిల్లాల ఏపీలో పరీక్షలు నిర్వహించేందుకు గాను ఫీజులు వసూలు చేశామని, ఆ మొత్తాల ప్రత్యేక అకౌంట్లలో జమ చేశామని, వీటిని కూడా తెలంగాణ ఉన్నత విద్యా మండలికే చెందుతాయని తీర్పు ఇవ్వటం సమజసం కాదన్నారు. 13 జిల్లాలోల వసూలు చేసిన ఫీజు మొత్తాన్ని తిరిగి తమకు అప్పగించేలా తక్షణం ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీంతో జస్టిస్‌ గోపాల గౌడ స్పందిస్తూ, “ఏపీలో వసూలు చేసిన ఫీజు మొత్తాలను తిరిగి వారికి ఇవ్వటానికి తెలంగాణ మండలికి అభ్యంతరం ఎందుకు?” అని తెలంగాణ త‌ర‌ఫున వాదిస్తున్న‌ సీనియర్‌ న్యాయవాది హిరేన్‌ రావల్‌ను ప్ర‌శ్నించింది. దీనికి రావ‌ల్‌ స్పందిస్తూ విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాల పట్ల తమకు స్పష్టత రావాల్సి ఉన్నదని చెప్పారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం విచార‌ణ స‌మ‌యానికి ముందురోజే తెలంగాణ స‌ర్కారు అఫిడవిట్‌ను దాఖలు చేసిందని, దానిని అధ్యయనం చేసేందుకు తమకు కొంత సమయం కావాలని కోరారు. దీంతో, కేసు తదుపరి విచారణ ను 23వ తేది మంగళవారానికి వాయిదా వేస్తున్నాట్లు జస్టిస్‌ గోపాలగౌడ ప్రకటించారు.

చూస్తుంటే….ఆంధ్రప్రదేశ్‌ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం తిప్ప‌లు పెడుతుంద‌నే విష‌యంలో అత్యున్నత న్యాయ స్థానమైన‌ సుప్రీం కోర్టుకు క్లారిటీ వ‌చ్చిన‌ట్లే ఉంది.

Link to comment
Share on other sites

×
×
  • Create New...