Jump to content

గూగుల్‌ను మించిపోయిన ఫ్రీడం


alpachinao

Recommended Posts

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది నిరంతరం శోధన చేసే గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ను సైతం ఓ వెబ్‌సైట్‌ మించిపోయింది. రూ.251కే ఫోన్‌ అందిస్తామని ప్రకటించి సంచలనం సృష్టించిన రింగింగ్‌బెల్స్‌ కంపెనీ గురువారం నుంచి బుకింగ్స్‌ ప్రారంభిస్తామని తెలిపింది. దీంతో ఈ ఫ్రీడం ఫోన్‌ను కొనేందుకు దేశవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఉదయం నుంచి ఒక్కసారిగా రింగింగ్‌ బెల్స్‌ వెబ్‌సైట్‌కు లాగిన్‌ అవ్వడంతో విపరీతమైన రద్దీ నెలకొంది. దీంతో కొద్ది క్షణాల్లోనే ఈ వెబ్‌సైట్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. ఫోన్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి, నిజంగా వస్తాయా.. అన్నది పక్కనబెడితే.. ఈ వెబ్‌సైట్‌ మాత్రం బాగా హిట్‌ అయ్యింది. గురువారం ఉదయం రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన వెంటనే.. ఫ్రీడం 251 వెబ్‌సైట్‌కు సెకండ్‌కి ఆరు లక్షల హిట్స్‌ వచ్చాయి. అదే గూగుల్‌కు సెకండ్‌కి 40వేల హిట్లు వస్తాయి. అంటే గూగుల్‌తో పోలిస్తే.. ఫ్రీడమ్‌కు సెకండ్‌కు 15రెట్ల ఎక్కువ హిట్లు వచ్చాయన్నమాట.

ఇంత ఎక్కువ హిట్లు రావడంతో సర్వర్‌ ఆగిపోయిందని.. 24 గంటల్లో అప్‌గ్రేడ్‌ చేసి బుకింగ్‌ పునః ప్రారంభిస్తామని రింగింగ్‌బెల్స్‌ ప్రకటించింది. మరోవైపు రూ.251కే స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకున్న యువత ఫోన్‌ బుక్‌ చేసుకునేందుకు ఎదురుచూస్తున్నారు.

Link to comment
Share on other sites

:giggle:

 

pichi ekincharu manollu

 

entha mandi pedavalu vunaro mana desam lo telisipothundi

 

USA amazon lo LG 12$ phone pedithey atte vundindi chala rojula tharuvatha  out of stock ayindi

Link to comment
Share on other sites

Ee freedom 251 phone previous ga rining bells ane compnay ikon ane name tho 4000 ki ee phone sale pettindi....kani asalu avaledu...so ippudu they are selling it for 251 for a loss margin to get rid of the stock

Link to comment
Share on other sites

×
×
  • Create New...