Jump to content

ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి Pulka Gallu

Balibabu

Recommended Posts

నీతులు ఎప్పుడూ మన కోసం కాదు. ఎదుటివారికి చెప్పడానికే ఉంటాయి. 'ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి' అని ఆచార్య ఆత్రేయ ఏనాడో చెప్పారు కదా. పని కావడం ముఖ్యం. అది ఎలా జరిగిందన్నది ప్రధానం కాదు. ఆ పని సరైన మార్గంలో చేశామా? తప్పుడు మార్గంలో చేశామా? అని ఆలోచిస్తే ఏ పనీ కాదు. గమ్యం చేరుకోవడమే ప్రధానం. రాజమార్గంలో వెళ్లామా? దొడ్డిదారిన వెళ్లామా? అనేది పట్టించుకోనక్కర్లేదు. ప్రతీ ఒక్క విషయం పట్టించుకొని అంతా పంచాంగం ప్రకారం చేస్తే అసలుకే ఎసరొస్తుంది. ఇదీ ఈ కాలపు నీతి. ఇదీ ఈ తరం ధర్మం. రాజకీయంగా అయినా, సామాజికంగా అయినా ఇదే ఇప్పుడు నడుస్తోంది.
ఆంధ్రాలో వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ టీడీపీలో చేరగానే గతంలో చంద్రబాబు గురించి భూమా నాగిరెడ్డి ఏం చెప్పారు? ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చెప్పారు? చదవండి అని జగన్‌ మనస్సాక్షి 'సాక్షి' పత్రిక ప్రచురించింది. గతంలో భూమా నాగిరెడ్డి ఏమన్నారు? ''మేం దూకుడుగా వెళితేనే చంద్రబాబు నాయుడుకు నచ్చుతాం. అప్పుడు ఆయన మమ్మల్ని ఉపయోగించుకున్నాడు. టీడీపీలో ఉన్నప్పుడు అవమానం జరిగితే చంద్రబాబు ముందు ఏడ్చినా పట్టించుకోలేదు. ఆయనకు ఓదార్చడం రాదు. అసలు ఆ అలవాటు ఉందో లేదో తెలియదు. ప్రతిదీ రాజకీయమే. ఇతర పార్టీలోకి వెళ్లి మళ్లీ టీడీపీలోకి వస్తే ఏపాటి గౌరవం ఉంటుందో మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి'' అని అన్నారు.
గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఏమన్నారు? ''తలసాని శ్రీనివాస యాదవ్‌ ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలి. మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్లూ...ఇది న్యాయమా? టీడీపీలో గెలిచి రాజీనామా చేయకుండా హీరో మాదిరిగా మంత్రి పదవిలో కొనసాగుతున్నారంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా తమ్ముళ్లూ...ఇది న్యాయమా? ఇలాంటి సమయంలో అలాంటి వ్యక్తుల్ని చిత్తుచిత్తుగా ఓడించాలి'' అన్నారు. కాని తలసాని నియోజకవర్గంలోని ప్రజలు టీడీపీనే చిత్తుగా ఓడించారు. అంటే వారు తలసాని చర్యను సమర్థించినట్లే కదా.
భూమా గతంలో టీడీపీని విమర్శించారు కాబట్టి ఇప్పుడు అదే పార్టీలో ఎలా చేరారనేది సాక్షి ప్రశ్న. రాజ్యాంగాన్నే పబ్లిగ్గా ఉల్లంఘిస్తున్న నాయకులు నైతిక విలువలను పాటిస్తారా? గతంలో ఉన్న మాటలను గుర్తు పెట్టుకుంటారా? రాజకీయాల్లో అందరూ 'గజనీ'లే. ఎవరు ఎవరిని ఏమన్నదీ అందరికీ గుర్తుంటుంది? ఆ మాటలు గుర్తు పెట్టుకొని పంతాలకు పట్టింపులకు పోరు. గతంలో చంద్రబాబును తిట్టాను కదా. ఆ పార్టీలోకి ఏ మొహం పెట్టుకొని పోవాలి? అని భూమా అనుకోలేదు. భూమా తనను తిట్టాడు కాబట్టి పార్టీలోకి తీసుకోను అని బాబు భీష్మించుకోలేదు.
నాయకులంతా పంతాలు పట్టింపులకు పోతే అసలు ఫిరాయింపులే ఉండవు కదా. కాబట్టి నాయకులు గతంలో ఇలా అన్నారని, ఇప్పుడిలా చేస్తున్నారని మొత్తుకున్నందువల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఫిరాయించిన వారిని ప్రజలు ఛీ కొడుతున్నారని వైసీపీ నాయకులు అన్నట్లు సాక్షి ప్రచురించింది. ప్రజలు నిజంగా అలా ఛీకొడితే పార్టీలు మారినవారు వేరే పార్టీల్లో చేరి గెలుస్తూనే ఉన్నారు కదా. ఫిరాయింపులనేవి ఓ సంప్రదాయంగా మారిపోయాయి. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో నాయకులే కాకుండా యూనివర్శిటీల్లో చదువుకునే విద్యార్థులు కూడా ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఇదేంటయ్యా అని ప్రశ్నిస్తే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి మాట్లాడతామంటున్నారు.
'మన దేశం వాళ్లు పాకిస్తాన్‌ జిందాబాద్‌ అంటే ఏమైనా నష్టమా?' అని ఒకాయన ప్రశ్నించాడు. ఇలాంటివారిని మేధావులు, అభ్యుదయవాదులమని ప్రచారం చేసుకునేవారు వెనకేసుకొస్తున్నారు. అలాగే పార్టీలు మారడం నైతికంగా తప్పని అంటే ప్రజాస్వామ్యం ఆ స్వేచ్ఛ ఇచ్చిందని అంటున్నారు. అది వాస్తవమే కదా. పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తే స్పీకర్‌ వాటిని ఆమోదించకుండా ఏళ్ల తరబడి సొరుగులో పడేసినా పట్టించుకునేవారు లేరు.
ఒక పార్టీ ఎమ్మెల్యే వేరే పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఇదేమిటని అడిగే వారు లేరు. దీని ముందు పార్టీ ఫిరాయింపులు పెద్ద నేరం కాదనే భావన ప్రజల్లో ఉంది. రాజీనామా చేసి మరో పార్టీలోకి పోవడం కనీస నైతిక బాధ్యత. అదెప్పుడో మంట కలిసింది. కాబట్టి మన దేశంలో నీతి సూత్రాలు వల్లించడం పనికిమాలిన పని.

Link to comment
Share on other sites

so... prathi party lonu avamaname anna maata!!

×
×
  • Create New...