Jump to content

అక్రమ వలసదారులందరూ అమెరికా వదిలి వెళ్లిపోవాల్సిందే: ట్రంప్


rajurocking50

Recommended Posts

రిపబ్లికన్‌ల తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్ధి రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్ మరోసారి కలకలం రేపారు. అమెరికాలో ఉంటోన్న అక్రమ వలసదారులందరినీ వెళ్లగొడతానని చెప్పారు. ఇందు కోసం తాను చట్టాన్ని తీసుకొస్తానన్నారు. అమెరికాలో కోటీ పది లక్షల మంది అక్రమ వలసదారులున్నారు. వీరిలో మూడు లక్షల మంది భారతీయులున్నారు. తాను అధికారంలోకి వస్తే వీరందరినీ వారివారి స్వదేశాలకు పంపించేస్తానని ట్రంప్ చెప్పారు. అక్రమ వలసదారులను సరైన పద్ధతిలో సాగనంపుతామన్నారు. మార్చ్ ఒకటిన సూపర్ ట్యూజ్‌డే కానుంది. ఆ రోజు 11 రాష్ట్రాల్లో ప్రిలిమినరీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో టెక్సాస్ రాష్ట్రం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారని పరిశీలకులు భావిస్తున్నారు. ఈయన ప్రత్యర్ధులైన మార్కో రుబియో, టెడ్ క్రుజ్ మాత్రం ట్రంప్ చెబుతోన్న చట్టంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ మాత్రం తన ఫార్ములాపై ధీమాగా ఉన్నారు. స్వీయ బహిష్కరణ ద్వారా చాలా సులభంగా వారంతట వారే అమెరికా వదిలివెళ్లిపోతారని ట్రంప్ చెప్పుకొచ్చారు. తాను అధ్యక్షుడినైతే తొలుత సరిహద్దు భద్రత సంగతి చూస్తానని రుబియో చెప్పారు. దేశంలోకి ప్రజలు వచ్చి పోయే పద్ధతిని మరింత సమర్థంగా అమలు చేయాలని సూచించారు. అంతవరకూ ఏం చేసినా లాభం లేదని చెప్పారు. క్రూజ్ మాట్లాడుతూ అమెరికా ఎప్పుడూ చట్టబద్దమైన వలసదారులకు ఆహ్వానం పలుకుతుందన్నారు. చట్టవ్యతిరేకంగా అమెరికా పౌరసత్వం పొందేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Link to comment
Share on other sites

Total 17 million +


Ikkada vallu andaru pothe evvaru clean chestharu?



Meeku oka vishyam telavali.

GC lottery vuntadi.


Every year 60k green cards given to different country vallaki

Ind paki leevu list lo.

Aa lottery ki anyone can apply


Mostly English rani vallani select chestharu. Enduko telusu kondi?


Only these topics used to gain political benefits.


Latino vote demographics towards to dems.


So reps trying to get anti Latino vote one way or other.

So ila matlaadali.


Dems eddam ante reps theddam ani okka rule pass avvatam leedu

Link to comment
Share on other sites

×
×
  • Create New...