Jump to content

లాడెన్ వర్ధంతిని అమెరికా యూనివర్సిటీల్లో జరుపుకునేందుకు అనుమతిస్తారా?


rajurocking50

Recommended Posts

భారత్‌లో భావస్వేచ్ఛ‌పై అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు మండిపడ్డారు. భావస్వేచ్ఛ పేరుతో జాతి వ్యతిరేక నినాదాలు చేసే వారిపై చర్యలు తీసుకోవడంపై ఎవ్వరికీ అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదని పార్లమెంట్‌లో చెప్పారు. భారత్‌లో భావస్వేచ్ఛ‌పై ఆంక్షలుపెడుతున్నారంటూ అమెరికా సహా ఇతర దేశాల నుంచి వస్తోన్న ఆరోపణలకు వెంకయ్య ఘాటుగా సమాధానమిచ్చారు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో లాడెన్ వర్ధంతి జరుపుకుంటామంటే ఒప్పుకుంటారా అని వెంకయ్య నిలదీశారు. రిచర్డ్ వర్మ పేరు తీసుకోకుండానే చురకలంటించారు. భావస్వేచ్ఛకు కూడా లక్ష్మణ రేఖ ఉంటుందని, జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. పాక్‌లో కోహ్లీ అభిమానికి 24 గంటల్లో కోర్టు జైలు శిక్ష విధించిన సంగతిని వెంకయ్య గుర్తు చేశారు. భారత్‌లో ఉన్న భావస్వేచ్ఛ గురించి చెబుతూ మేధావి అని పిలవబడుతున్న ఒకాయన ప్రధాని మోదీ చనిపోతే తదుపరి ప్రధాని ఎవరౌతారు అంటూ కథనం రాశాడని వెంకయ్య చెప్పారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వమయ్యుంటే ఈ పాటికి ఆ మేధావిని జైలుపాలు చేసేవారని వెంకయ్య చెప్పారు. ఎమర్జెన్సీలో తనను కూడా జైలుపాలు చేశారని చెప్పారు. అనేకమంది నేతలను జైళ్లలో మగ్గేలా చేశారని చెప్పారు. భావస్వేచ్ఛ గురించి తమకు పాఠాలు చెప్పే ప్రయత్నం చేయవద్దని వెంకయ్య తేల్చి చెప్పారు.

Link to comment
Share on other sites

Eppudayithe congress motham nasanam avutundho, appudu gaani set kadhu..

congress desa drohulu..

 

 

ee religions unantha kalam congress will play trump card and try for comeback same as modi ni degrade chestunaru succesfully.

 

ee religious reservation system is key here,

Link to comment
Share on other sites

×
×
  • Create New...