Jump to content

Sakshi Journalism Exam Tomorrow


BuzzShah

Recommended Posts

సాచ్చి జర్నలిజం పరీక్ష రేపే. లీకైన క్వశ్చన్ పేపర్.

ప్ర (౧) : జర్నలిజం అనగా? 
జ : జర్నీ చేస్తూ జగన్ భజన చెయ్యడం. అంతా జగనుమయం. 
జగమంతా జగనుమయం.

ప్ర (౨) : జర్నలిస్ట్ అనగా? 
జ : జర్నీల లిస్ట్ రాసే వాడు.

ప్ర (౩) : ప్రతి రోజూ ఎవ్వరి గురించి రాయాలి? 
జ : చంద్రబాబు గురించి. అది కూడా చెడుగానే.

ప్ర (౪) : అతి ఎక్కువగా ఉపయోగించాల్సిన పదం? 
జ : పచ్చ పార్టీ

ప్ర (౫) : జగమంత కుటుంబం ఎవరిది? 
జ : జగనన్నది.

ప్ర (౬) : చంచల్ గూడా దేనికి ప్రసిద్ది? 
జ : చంచల్ గూడా అన్న పేరే వినలేదు.

ప్ర (౭) : రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం? 
జ : ఇడుపుల పాయ.

ప్ర (౮) : రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన తీర్ధ యాత్ర? 
జ : ఓదార్పు యాత్ర.

ప్ర (౯) : జగనన్న ఏ దీక్ష అయినా ఎన్ని గంటలు? 
జ : నలబై ఎనిమిది గంటలు.

ప్ర (౧౦) : సాచ్చి జర్నలిజం ను ఒక్క మాటలో చెప్పాలంటే? 
జ : గురివింద గింజ తన నలుపెరగదు. జగనన్న తన తప్పెరగడు.

ప్ర (౧౧) : జగనన్న ఎక్కడికెళ్ళినా వేసే ఫోటో కింద తప్పక రాయాల్సిన పదం? 
జ : హాజరైన అశేష జనసందోహం లో ఒక భాగం.

ప్ర (౧౨) : జగనన్న ఎక్కడికెళ్ళినా మీరు తప్పక కాంటాక్ట్ చెయ్యాల్సిన విభాగం? 
జ : ఫోటోషాప్ విభాగం. అన్ని ఫోటోలు మిక్స్ చేసి అశేష జనసందోహంలో ఒక భాగంని సృష్టించే అతి ముఖ్యమైన విభాగం.

ప్ర (౧౩) : సాచ్చి జర్నలిస్ట్ కుండాల్సిన అతి ముఖ్య గుణం? 
జ : పక్కోడి మీద పడి ఏడవడం.

ప్ర (౧౪) : ప్రపంచంలోని ప్రవచనాలన్నీ చెప్పిందెవరు? 
జ : వైఎస్

ప్ర (౧౫) : నవ్వితే ఏడుస్తున్నట్లు , ఏడుస్తుంటే నవ్వుతున్నట్లు కనిపించే ఏకైక వ్యక్తి ఎవరు? 
జ : జగన్

ప్ర (౧౬) : లక్ష కోట్లు అనగా? 
జ : తెలియదు

బోనస్, ప్రమోషన్ క్వశ్చన్..

ప్ర : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? 
జ : జగన్..

తప్పు.. సాంబా వీడికి భవిష్యత్ లో బోనస్ కట్ చేసి డిమోషన్ ఇచ్చెయ్యరా!!!!

సార్! సార్! సార్! తప్పయ్యింది.. జవాబు మళ్ళీ చెప్తా..

ఆ సరే చెప్పు..

జ: జననేత జగనన్న..

ఆ ఇప్పుడు దార్లోకొచ్చావ్.. మన పాట పాడుకుంటూ పన్లోకెళ్ళిపో..

జగనన్నా జగనన్నా! జగమంతా జగనన్నా!! 
ఈడీనా బోడీనా! మోడీతో రాజీనా!! 

 

Link to comment
Share on other sites

×
×
  • Create New...