Jump to content

అమరావతి శ్రీమంతుడు...సీఆర్డీఏ అర్బన్‌ డిజైనర్‌


comradee

Recommended Posts

అమరావతి శ్రీమంతుడు
పర్యావరణ పరిరక్షకుడు...సీఆర్డీఏ అర్బన్‌ డిజైనర్‌
రాజధాని నిర్మాణ ప్రణాళిక అమోఘం: రోవన్‌ మెకాయ్‌
amr-st1a.jpg

విజయవాడ: వూరు కాని వూరు.. భాష కాని భాష.. దేశం కాని దేశం.. అయినా తెలుగు ప్రజలతో మమేకం. మెడలో బ్యాగ్‌తో... సైకిల్‌పై సవారీ చేస్తూ కనిపిస్తారు. నగర వీధుల్లో చక్కర్లు కొడుతూ అమరావతి నిర్మాణంలో నేనుసైతం అంటూ దూసుకుపోతున్నారు బ్రిటన్‌(యూకే)కు చెందిన రోవన్‌ మెకాయ్‌. రాజధాని అమరావతికి సంబంధించిన అర్బన్‌ డిజైనర్‌ ఈయనే. గతేడాది నవంబరు నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ)లో రాజధాని పట్టణ అభివృద్ధికి సంబంధించిన డిజైన్లు రూపొందిస్తున్నారు. బ్రిటన్‌కు చెందిన మెకాయ్‌ లీడ్‌ విశ్వ విద్యాలయంలో మల్టీ డిసిప్లేనరీ డిజైన్‌, కమ్యూనిటీ ప్లానింగ్‌, సస్‌టైనబుల్‌ డెవలప్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేశారు. యూనివర్శిటీ ఆఫ్‌ వెస్ట్‌ మినిస్టర్‌లో పీజీ(అర్బన్‌ డిజైనింగ్‌) చేశారు. విద్యాభ్యాసం అనంతరం సీఆర్డీఏలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ‘న్యూస్‌టుడే’తో ఆయన మాట్లాడుతూ విజయవాడ ప్రజల జీవన శైలి, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజధాని అమరావతి నిర్మాణం తదితర అంశాలపై తన అనుభవనాలను పంచుకున్నారు.

అమరావతి అద్భుత కట్టడం
ప్రపంచ దేశ రాజధానుల జాబితాలో అమరావతి చరిత్రలో నిలిచిపోతుంది. నాకు భాష రాదు. కాని ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసు. ఎలాంటి చేయూత లేకుండా రాజధానిని నిర్మించాలనే ధైర్యం, ఆలోచన చాలా గొప్పవి. రైతుల నుంచి భూములు తీసుకొని అందులో రాజధానిని నిర్మించి.. అదే రాజధానిలో వారిని భాగస్వామ్యులను చేయటం చారిత్రాత్మకం. ప్రభుత్వ ఆలోచన చాలా గొప్పది. నూతన రాజధాని నిర్మాణానికి ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చి మేమున్నామనే భరోసా ఇవ్వటం సాధారణ విషయం కాదు.

చెమటోడ్చే ప్రజలే ఇక్కడి ఆస్తి
నేను విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్‌కి వెళుతూ ఉంటాను. అక్కడ ప్రజలు జీనవ శైలి అంటే నాకు చాలా ఇష్టం. బతుకు దెరువు కోసం ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకోవటం నన్ను చాలా ఆకట్టుకుంటోంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడ ప్రజలు ఏదో ఒక వ్యాపారంలో హడావిడిగా ఉంటారు. వ్యర్థం అనే ప్రతి వస్తువుకూ జీవం పోసి ప్రజల అవసరాలకు అనుగుణంగా అందుబాటులోకి తీసుకురావటం బాగుంది. ఆదివారం సెలవు దినాల్లో విజయవాడ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలకు వెళ్లటం అలవాటు చేసుకున్నాను. చక్కని సంప్రదాయబద్ధమైన మనుషులు. నన్ను ఆశ్చర్యంగా చూసి.. చూడటమే కాదు.. మంచినీరు, తేనీరు ఇచ్చి మర్యాదలు చేస్తున్నారు. అయితే పదేళ్ల క్రితం నేను విద్యార్థిగా ఉన్నప్పుడు భారతదేశానికి వచ్చాను. రాజస్థాన్‌, గోవా, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో పర్యటించినా.. తెలుగు ప్రజలు చూపించని ఆదరాభిమానాలు నేనెక్కడా చూడలేదు.

ఎక్కడికైనా సైకిల్‌ మీదే
మెకాయ్‌ ఎంత దూరమైనా సైకిల్‌ మీదే ప్రయాణిస్తాడు. సహద్యోగులు కార్లు, ద్విచక్రవాహనాలు వినియోగిస్తున్నా తాను మాత్రం సైకిల్‌ కంటే మించిన వాహనం లేదని చెబుతాడు. సైకిల్‌ తొక్కడం ద్వారా నగర ప్రజలకు కాలుష్య పరరంగా తన నుంచి ఎలాంటి హానీ లేకుండా చేస్తున్నానని ఇంకా నగరంలో అనేక మంది ప్రజలు సైకిల్‌ను తప్పని సరిగా వినియోగించాలని కోరుతున్నాడు.

amr-st1b.jpg

స్నేహపూరిత స్వభావం
బ్రిటన్‌ నుంచి ఇండియాకు వచ్చేటప్పుడు చాలా భయం వేసింది. తెలియని మనుషుల మధ్య పనిచేయటం ఎలాగో నాకు పాలుపోలేదు. దేవుడా..! నీవే దిక్కు అంటూ.. వచ్చాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఇక్కడ ఏం లేకపోయినా, ఎవరు తెలియకపోయినా బతకొచ్చు. అందరితోనూ కలిసిపోయాను. నాకు మంచి గౌరవం ఇస్తున్నారు. మంచి స్నేహితుడిగా చేస్తున్నారు. నేను భారతీనగర్‌లో ఉంటున్నాను. ఉదయం అక్కడ సమీపంలోని పార్కులో బ్యాడ్మింటన్‌ ఆడుతున్నాను. అక్కడి వారు నాకు బాగా నచ్చారు.

స్వతహాగా తెలుగింటి వంటలు
ఉప్మా-పెసరట్టు వాసన చూస్తే మెకాయ్‌కు ఎక్కడ లేని ఆకలి పట్టుకొస్తోందట. విజయవాడలో దొరికే పునుగులు, మిరపకాయ బజ్జీలు, రకరకాల దోసెలు నోరూరించేస్తున్నాయని చెప్పాడు. విజయవాడ వచ్చిన తొలి రోజుల్లోనే హోటల్‌లో భోజనం చేసిన ఆయన ఇంటిలోనే భోజనాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. అన్నం, గుత్తి వంకాయ కూర, మటన్‌ బిర్యానీ, జీడిపప్పు వేపుడు, గుమ్మడికాయ శెనగల కూరలు వండటం నేర్చుకున్నారు.

కొత్తగా నగర నిర్మాణం
రాజధాని అమరావతి నగర నిర్మాణాన్ని అన్ని వర్గాల ప్రజలు నివశించేందుకు అనుగుణంగా డిజైన్‌ చేస్తున్నారని మెకాయ్‌ వివరించారు. సామాజిక జీవనం, మౌలిక సదుపాయాలే ఏజెండాగా.. విశాలవంతమైన రహదార్లు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, భూగర్భంలో విద్యుత్తు లైన్లు, టెలిఫోన్‌ లైన్లు ఏర్పాటు చేసే విధంగా డిజైన్‌ చేయటం సరికొత్త ఆలోచన. రాజధాని అభవనాలు అందుబాటులోకి వస్తే అమరావతి సుందర నగరంగా బాసిల్లుతుందని చెప్పారు.

amr-st1c.jpg

ప్రజాస్వామ్య వ్యవస్థ బాగుంది
భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఉంది. వివాహ వ్యవస్థకూ సముచిత స్థానం ఉంది. కర్నూలులో ఇటీవల ఒక వివాహానికి హాజరయ్యాను. చాలా చక్కగా వివాహం జరిగింది. నూతన దంపతులు ఒకరికి ఒకరు ప్రమాణాలు చేసుకోవటం.. జీవితాంతం నీకు తోడుగా ఉంటానని వరుడు వధువుకు ప్రమాణం చేయటం. జీవితాంతం నీ అడుగులో అడుగేస్తానని వధువు వరుడికి ప్రమాణం చేయటం లాంటి మంత్రాలను స్నేహితులను అడిగి తెలుసుకొని, పెళ్లి తంతు ఇంత భారీగా చేస్తారా అని ఆశ్చర్యపడ్డాను.

తెలుగు సినిమాలు బాగున్నాయ్‌..
సమయం దొరికినప్పుడల్లా సినిమాలకు వెళుతున్నాను. ఈ మధ్య చాలా తెలుగు సినిమాలు చూశాను. కాని వాటి పేర్లు నాకు తెలియదు. చాలా భాగం ప్రేమకథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు వస్తున్నాయి. చాలా బాగున్నాయి. తెలుగు సినిమాలను ఎలాగైనా అర్థం చేసుకువాలనే స్నేహితుల వద్ద నుంచి తెలుగు భాషను నేర్చుకుంటున్నాను. బాగున్నారా.. ఏమి చేస్తున్నారు.. లాంటి కొంచెం అనే పదాలు వినియోగిస్తున్నాను. ఇంకో మూడు నెలల్లో పూర్తిగా తెలుగులో మాట్లాడగలను. నాకు నచ్చిన చిత్రం లాగన్‌. అమీర్‌ ఖాన్‌ అంటే అభిమానం. మా అమ్మ క్లారె షారూక్‌ఖాన్‌ అభిమాని. బ్రిటన్‌లో షారూక్‌ సినిమాలు ఏవి వచ్చినా వదలకుండా చూస్తారు.

amr-st2h.jpg

 
Link to comment
Share on other sites

×
×
  • Create New...