rajurocking50 Posted March 12, 2016 Report Share Posted March 12, 2016 అసెంబ్లీ సమావేశాలకు రానీయకుండా తనను ఏడాది పాటు తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ చేసిందని.. దానిపై న్యాయ పోరాటం చేయడానికి రెడీ అని సవాల్ చేసిన చిత్తూరు జిల్లా నగరి వైకాపా ఎమ్మెల్యే రోజాకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. శాసనసభ తీసుకున్న నిర్ణయంపై తామేమీ చేయలేమని సుప్రీం కోర్టులోని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ తెగేసి చెప్పడంతో.. రోజా ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఎలాగైనా న్యాయపోరాటం చేయాలనుకున్న వైఎస్సార్సీకి ఇది గట్టి ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. అయితే రోజా తరఫు న్యాయమూర్తి మాత్రం మరో బెంచ్ కు వెళతాం అని చెప్పడం కొసమెరుపు. ఏది ఏమైనా ఫలితం ఉండదనేది కొందరి అభిప్రాయం. గత అసెంబ్లీ సమావేశాల్లో రోజా అసభ్య పదజాలంతో సభామర్యాదలను మంటగలిపారనే నెపంతో ఏడాది పాటు ఆమెను శాసనసభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఓ మహిళా శాసనసభ్యురాలిపై ఇలాంటి చర్య తీసుకోవడం.. బహుశా శాసనసభ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. తమ ఎమ్మెల్యేను ఏడాదిపాటు శాసనసభకు రానీయకుండా నిషేధం విధించడానికి స్పీకర్ కు ఎలాంటి అధికారం లేదని జగన్ అండ్ బ్యాచ్ వాదిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి అధికారం స్పీకర్ కు లేకపోయినా… సభలోని మెజారిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ కాదనలేరని ఒకవేళ అది తప్పని కోర్టుకు వెళ్లినా ఫలితం ఉండదని గతంలోనే శాసనభావ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు విపక్షసభ్యులకు సూచించిన విషయం తెలిసిందే. టీడీపీ అంతు చూస్తానని సవాల్ చేసి మరీ సుప్రీంకోర్టుకు వెళ్లిన రోజాకు అక్కడ కూడా చుక్కెదురవడంతో ఆమె పరువు మరోసారి పోగొట్టుకున్నట్లయ్యిందన్న రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. Link to comment Share on other sites More sharing options...
posaanisam Posted March 12, 2016 Report Share Posted March 12, 2016 Link to comment Share on other sites More sharing options...
NotGuilty Posted March 12, 2016 Report Share Posted March 12, 2016 Aniya ni susi nersukove kuja Link to comment Share on other sites More sharing options...
Recommended Posts