Jump to content

నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం.. కడిగిన ముత్యం


rajurocking50

Recommended Posts

రోజా మంచి వక్త. ఏ విషయాన్నైనా అనర్గళంగా మాట్లాడగలిగే దిట్ట. గతంలో వై.ఎస్.అధికారంలో వున్నప్పుడు ఆమె ప్రతిపక్షపార్టీలో వుండేది. అప్పట్లో వై.ఎస్.ను ఎంత తీవ్రంగా విమర్శించిందో… ఇప్పుడు కూడా అధికారంలో వున్న చంద్రబాబు నాయుణ్ని అదే స్థాయిలో విమర్శిస్తోంది. పంచె కట్టుతో కనికట్టు చేసి.. రైతుల భూములను లాక్కుంటున్న భూకబ్జాదారుడు వై.ఎస్.అంటూ తీవ్ర విమర్శలు చేసింది. అలాంటి ఆమె వై.ఎస్.రెండోసారి అధికారంలోకి రాగానే ఇక లాభం లేదని కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయింది. పోతూ… పోతూ.. తెలుగుదేశంపైనా.. ఆ పార్టీ క్యాడర్ పైనా విమర్శలు బాగానే చేసింది. ఆమె చంద్రగిరిలో గల్లా అరుణకుమారిపై నిలబడి ఓడిపోయింది. దాంతో తనకు అక్కడ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు సహకరించలేదని, తనకు చంద్రబాబుపై కోపం లేకున్నా… రాజశేఖర్ రెడ్డి పరిపాలన నచ్చి చేరుతున్నానంటూ పెద్ద లెక్చరే ఇచ్చింది. ఇలా పార్టీలు మారినప్పుడల్లా నేతలు మాట్లాడటం సాధారణమే అనుకున్నా… రోజా మాటలు ఇటీవల వింటుంటే మరీ ఇంత ‘స్వామిభక్తి’ వెలిబుచ్చడం అవసరమా అనేవారూ లేకపోలేదు.
 
తెలుగుదేశం పార్టీలో వున్నప్పుడు చంద్రబాబు నాయుణ్ని ఆకాశానికెత్తేస్తూ మాట్లాడిన రోజా… ఇప్పుడు జగన్ ను కూడా ఏమాత్రం తీసిపోకుండా పొగిడేస్తోంది. ఎంతలా అంటే.. జగన్ నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం అని, ఉదయించే సూర్యుడని ఏవేవో మాట్లాడేస్తోంది. వైఎస్సార్సీ పీ ఆవిర్భావోత్సవంలో పాల్గొన్న రోజా.. జగన్ ను ఏ రేంజ్ లో పొగిడేసింది. పొగిడితే పొగిడింది.. జగన్ ప్రసన్నం చేసుకోవడానికి కాస్త వాస్తవానికి దగ్గరగా వుండేలా పొగిడి మార్కులు కొట్టేస్తే బాగుంటింది. అలా కాకుండా ‘జగన్ నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం’ అనడం జగన్ కు సింక్ అవ్వదేమోనిని కొంచెం అయినా ఆలోచించి అనుంటే బాగుండేది. ఎందుకంటే.. జగన్ ను ఇప్పటికే ‘లక్షకోట్ల అవినీతి పరుడు’ అనే ముద్ర వేసేశారు. దానికి తగ్గట్టుగానే సీబీఐ కూడా అతన్ని పదిహేను కేసుల్లో A1 ముద్దాయిగా పేర్కొంది. ఈడీ జగన్ కంపెనీల ఆస్తులను జప్తు చేస్తోంది.
 
అంతేకాదు పదహారు నెలలు జైలు జీవితం గడిపొచ్చాడు. ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. దేశం విడిచిపోరాదనే షరతులున్నాయి. ఇలాంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు.. నలుగురు మెచ్చేలా మాట్లాడితే ఎవరైనా ఆలకిస్తారు.. నమ్ముతారు. అలా కాకుండా ‘నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం.. కడిగిన ముత్యం’ఇలాంటి పెద్ద మాటలు మాట్లాడితే… మాస్ పీపుల్ ఏమైనా నమ్ముతారేమోగానీ.. కాస్తో కూస్తో చదువుకున్నవాళ్లు, విద్యావంతులు ఈ మాటలు వింటే నవ్విపోతారు. సో.. రోజా గారు ఇప్పటికైనా… జగన్ ను ప్రసన్నం చేసుకోవాలనుకుంటే వేరే రకంగానైనా మాట్లాడొచ్చు. ప్రభుత్వలు చేసే ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్నాడని, యువతకు వెన్నుదన్నుగా నిలుస్తాడని, రైతులకు అండగా వుంటాడని ఇలా ఏదైనా మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని జగన్ ఏదో హీరో చేసేసేలా మాట్లాడితే… వాస్తవాలు తెలిసిన ప్రజల్లో పలుచనపడక తప్పదు.
Link to comment
Share on other sites

×
×
  • Create New...