Jump to content

Maggavale


ticket

Recommended Posts

న్యూఢిల్లీ : విభజన సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన హామీలనూ కేంద్ర ప్రభుత్వం నెలవేర్చలేదని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌‌రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై లోక్‌సభలో చర్చ సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎంపీ సభ దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్ హైకోర్టును వెంటనే విభజించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లవుతున్నా ప్రత్యేక హైకోర్టు లేకపోవడంతో తెలంగాణ నష్టపోతోందని ఆయన విమర్శించారు. వీలైనంత తొందరగా నిర్ణయం రావాలని లేకపోతే దేశానికి మంచిది కాదని అన్నారు. హైకోర్టు విభజనతో పాటు ఎయిమ్స్‌ ఏర్పాటు సహా చాలా అంశాలను కేంద్రం పట్టించుకోవడం లేదని జితేందర్‌రెడ్డి విమర్శించారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జితేందర్‌రెడ్డి కోరారు.

Link to comment
Share on other sites

×
×
  • Create New...