Jump to content

కేసీఆర్.. అప్పులతో పప్పుకూర చేస్తున్నారా ?


rajurocking50

Recommended Posts

కేసీఆర్ రోజుకు అంత అప్పు చేస్తున్నారా..!తెలంగాణ రాష్ట్రం సంప‌న్న రాష్ట్రమ‌ని నిత్యం చెప్పే సీఎం కేసీఆర్ అస‌లు ఏం చేస్తున్నారు… ? చేతికి ఎముక లేనట్లుగా ఖర్చు చేయటమే కాదు.. కళ్లు చెదిరిపోయేలా పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టబెట్టేస్తానని.. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ‌ అంటూ భారీ ఆశల్ని చూపిస్తున్న ఆయన పాలన ఎలా సాగుతుంది ? ప్రభుత్వ బండిని నడిపేందుకు అత్యంత అవసరమైన ఆర్థిక ఇంధ‌నం మాటేమిటి? లాంటి ప్రశ్నలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలు వింటే గుండె గుభేల్ మనక మానదు. పేరుకు సంపన్న రాష్ట్రమే కాని.. రోజూ అప్పు తెచ్చుకోకుంటే తప్ప పూటగడవని పరిస్థితి నెలకొని ఉందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇందుకు వారు అంకెల్ని ఆధారాలుగా చూపిస్తున్నారు.

 

తాజాగా అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2014లో తెలంగాణ అప్పు రూ.83,845 కోట్లు అయితే.. 2015 నాటికి ఈ అప్పు రూ.1,00,707 కోట్లకు చేరుకుందని చెప్పుకొచ్చారు. అంతేకాదండోయ్‌.. ప్రస్తుత బడ్జెట్ లో మరో రూ.23,113 కోట్లను అప్పుగా తీసుకుంటున్న విషయాన్ని ఈటెల రాజేందర్ చెప్పారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న రూ.61,170 కోట్లను కేవలం 22 నెలల వ్యవధిలోనే రెట్టింపు అప్పులోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ సర్కారుదిగా వారు అభివర్ణిస్తున్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం 3.5కోట్ల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కరి నెత్తిన ఉన్న అప్పు రూ.17,626 ఉంటే.. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వల్ప వ్యవధిలోనే ఆ మొత్తం రెట్టింపు అయినట్లు వెల్లడించారు. రోజూ సరాసరిన కేసీఆర్ రూ.60కోట్ల అప్పు తెచ్చి బండి నడిపిస్తున్నట్లుగా ఉత్తమ్ చెప్పుకొచ్చారు. లెక్కలు మీద కాస్తంత ఐడియా ఉన్న ఎవరైనా సరే.. ఉత్తమ్ మాటలు వింటే గుండె గుభేల్ మనక మానదు. కేసీఆర్.. అప్పులతో పప్పుకూర చేస్తున్నారా ? .. తెలంగాణ ప‌రిస్థితి ఇంత దారుణ‌మా.. అనిపించ‌క మాన‌దు.

Link to comment
Share on other sites

×
×
  • Create New...