Kool_SRG Posted March 17, 2016 Report Share Posted March 17, 2016 రోజా సస్పెన్షన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు హైదరాబాద్: వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానాన్ని సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుదపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. వివరాల్లోకి వెళితే.. గత అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేశారు. శాసనసభ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రోజా తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రోజా వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని మంగళవారం సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. భోసలే.. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపేందుకు జస్టిస్ రామలింగేశ్వరరావుకు అనుమతిస్తూ పరిపాలన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బుధవారం ఈ వ్యాజ్యంపై విచారణ సాగింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు గురువారం జారీ చేస్తామని ప్రకటించారు. ఈ కేసులో రోజాపై విధించిన సస్పెన్షన్‌ను కొట్టివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదావేస్తూ జస్టిస్ రామలింగేశ్వరరావు ఆదేశాలిచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రోజా హాజరయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts