BabuRa0 Posted April 8, 2016 Report Share Posted April 8, 2016 ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బెనిఫిట్ షో చూసిన తర్వాత చాలా మందికి కలిగిన సందేహమేమిటంటే.. అసలు ఈ కథ ను చెక్కడానికి రచయిత పవన్ కల్యాణ్ గారికి రెండున్నర ఏళ్లు ఎందుకు పట్టిందా అని! ఎంత ఆలోచించినా.. జుట్టు పీక్కున్నా ఈ విషయం ఎవరికీ అర్థం కాలేదు! ఎందుకంటే, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కథ.. కొత్త కథ కాదు! సినిమా పుట్టినప్పటి నుంచి ఎంతో మంది దర్శకనిర్మాతలు వడ్డించిన పాత చింతకాయ పచ్చడి కథే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ! అసలు ఈ సినిమా కథ.. రొటీన్ కథే అని ట్రైలర్ చూశాక అందరికీ అర్థమయ్యింది. అయితే, కనీసం స్క్రీన్‌ప్లే లో నయినా పవన్ కల్యాణ్ మ్యాజిక్ చూపిస్తాడనుకంటే.. అక్కడ కూడా పూర్తిగా నిరాశపరిచాడు పవన్ కల్యాణ్! కేవలం కథనం మాత్రమే కాదు.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చాక మనకు గుర్తిండిపోయే పాత్ర ఒక్కటి కూడా ఉండదు. కనీసం సినిమాలో కనిపించే వివిధ పాత్రల క్యారెక్టరైజేషన్ విషయంలో కూడా పవన్ ఎటువంటి క్రియేటివిటీ చూపించలేదు. ఈ మాట చెప్పడానికి కాస్త కష్టంగా ఉన్నా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కు కథ, స్క్రీన్ ప్లే అందించిన రచయితగా పవన్ కల్యాణ్ ఘోరంగా ఫెయిలయ్యాడు. గతంలో, ‘ఖుషీ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పీక్స్ లో ఉన్న తన కెరియర్ ని.. సొంత కథ ‘జానీ’ ని దర్శకుడిగా తెరకెక్కించి చేతులు కాల్చుకున్నాడు పవన్ కల్యాణ్! సరిగ్గా పదమూడేళ్ల తర్వాత మళ్లీ అదే తప్పును ఆయన రిపీట్ చేశాడు ! ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత మళ్లీ తన ‘అద్భుతమైన క్రియేటివిటీ’ ని మరోసారి ఉపయోగించి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లాంటి రొటీన్ కథను ఏకంగా రెండున్నర ఏళ్లు వండి.. ఆ రొటీన్ కథను అంతే పరమ రొటీన్‌గా తెరకెక్కేలా చేసి.. మరోసారి పెద్ద తప్పు చేశాడు పవన్ కల్యాణ్!వాస్తవానికి పవన్ కల్యాణ్‌కు సొంత కథలు తయారు చేసుకోవాల్సిన అవసరం ఇసుమంతైనా లేదు. ఆయనను ఆరాధించే యంగ్ డైరక్టర్లు.. సీనియర్ డైరక్టర్లు దక్షిణాదిన ఎంతో మంది ఉన్నారు. ఆయన ‘ఊ’ అంటే చాలు ఆయన స్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా అద్భుతమైన కథలను ఇచ్చే రచయితలు కూడా ఉన్నారు. అందుకే, దయ చేసి పవన్ కల్యాణ్ ఇక మీదటైనా సొంత కథల జోలికి వెళ్లకుండా ఆయన మీద ఎంతో అభిమానంతో.. ఆరాధన తో.. ప్రేమతో దర్శకులు, రచయితలు రెడీ చేసిన కథల్లో మంచివి సెలెక్ట్ చేసుకుంటే చాలు!పవన్ కల్యాణ్ గారు.. దయ చేసి మీరు ఇక మీదట సొంతకథలను వండకండి.. అంతటి శ్రమను మీరు తీసుకోకండి! మీ మీద ఆరాధనతో మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన కథలను తయారుచేసుకున్న దర్శకులు టాలీవుడ్‌లో చాలా మంది ఉన్నారు! దర్శకుడు బాబీ కూడా అలాంటి కథనే మీకు వినిపిస్తే.. మీరు అది వద్దని చెప్పి మీ ‘గ్రేట్ స్టోరీ’ సర్దార్ గబ్బర్ సింగ్ ను ఆయనకు అప్పచెప్పి పెద్ద పొరపాటు చేశారు! మళ్లీ మరోసారి ఈ తప్పును చేయకండి! ఇప్పటికే, మీ కలం నుంచి జాలువారిన ‘జానీ’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లాంటి రొటీన్ కథలను మేం తట్టుకోలేకపోతున్నాం! మీ క్రియేటివిటీ ని మీరు జస్ట్ యాక్టింగ్ లో చూపెడితే చాలు.. మీరు సునాయాసంగా బ్లాక్ బస్టర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు అందుకోగలరు! 1 Quote Link to comment Share on other sites More sharing options...
BabuRa0 Posted April 8, 2016 Author Report Share Posted April 8, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
rrc_2015 Posted April 8, 2016 Report Share Posted April 8, 2016 God ante Anthe ..... Ayana istam ... Y u bother middle middle Quote Link to comment Share on other sites More sharing options...
BabuRa0 Posted April 8, 2016 Author Report Share Posted April 8, 2016 Just now, rrc_2015 said: God ante Anthe ..... Ayana istam ... Y u bother middle middle Ayana baktuniga request chestunna Quote Link to comment Share on other sites More sharing options...
alpachinao Posted April 8, 2016 Report Share Posted April 8, 2016 Jaipk Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted April 8, 2016 Report Share Posted April 8, 2016 devudu em cheyyalo nuvvu cheppakudadhu Quote Link to comment Share on other sites More sharing options...
BabuRa0 Posted April 8, 2016 Author Report Share Posted April 8, 2016 Just now, alpachinao said: Jaipk Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted April 8, 2016 Report Share Posted April 8, 2016 ayana daya amana praptham anthey Quote Link to comment Share on other sites More sharing options...
rrc_2015 Posted April 8, 2016 Report Share Posted April 8, 2016 4 minutes ago, BabuRa0 said: Ayana baktuniga request chestunna Request forwarded to God and Bobby Quote Link to comment Share on other sites More sharing options...
solman Posted April 8, 2016 Report Share Posted April 8, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
timmy Posted April 8, 2016 Report Share Posted April 8, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
sampangi Posted April 8, 2016 Report Share Posted April 8, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
BabuRa0 Posted April 8, 2016 Author Report Share Posted April 8, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
nrikittu Posted April 8, 2016 Report Share Posted April 8, 2016 Singh Quote Link to comment Share on other sites More sharing options...
ceelogreen Posted April 8, 2016 Report Share Posted April 8, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.