Jump to content

Pichekki Sachipovali Janam S G S chuste... lol


solman

Recommended Posts

  • Replies 97
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • solman

    55

  • BabuRa0

    6

  • k2s

    4

  • NinduChandurudu

    3

Top Posters In This Topic

ఒక పది రోజుల నుంచి ఫెస్బుక్ లో ఎం అప్డేట్ చెయ్యట్లేదు..ఈ పోస్ట్ తర్వాత మళ్ళీ ఇంకెన్ని రోజులకో తెలీదు... మీ అందరికి దుర్ముఖి నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు....

క్రేజ్ అమ్మ మొగుడు పవన్ కళ్యాణ్ సరికొత్త చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ చూసా.... చూసా అనేకంటే చూడాల్సి వచ్చింది... జానీ అపజయం తర్వాత పవన్ కళ్యాణ్,ఎట్టి పరిస్థితుల్లో గొప్ప సినిమా చెయ్యాలి అని అత్తారింటికి తర్వాత వేరే ఏ పని లేకుండా,వేరే ఎం సినిమాలు చూడకుండా ఫామ్ హౌస్ లో ప్రకృతి లో మమేకం అయ్యి రాసుకున్న కథ సర్దార్ గబ్బర్ సింగ్....

ఈయన నోట్లో పెన్ను పెట్టుకుని దీర్ఘం గా ఆలోచిస్తూ కథ రాస్తున్నప్పుడే మహేష్ ఆగడు రవితేజ కిక్ 2 తీసారు.... ఈ రెండు సినిమా ల సమాహారం గా వచ్చిన మూడవ మణి రత్నం సర్దార్ గబ్బర్ సింగ్... 2 గంటల 43 నిమిషాల ఈ చిత్ర అనుభూతి మాటల్లో చెప్పలేను....కాని ఇంత గొప్ప చిత్రాల గురించి మాట్లాడకపోతే అది చారిత్రిక తప్పిదం

మానవత్వం మంట కలిసింది
మంచి తనం మట్టి కొట్టుకు పోయింది
దరిద్రం డిస్కో డాన్స్ ఆడింది
దౌర్భాగ్యం తొడ కొట్టి నవ్వింది

ఈ సినిమా లో హీరో హైదరాబాద్ లో పోలీస్.... ఆయన ఇంట్రడక్షన్ ఇండో నేపాల్ బోర్డర్ లో అవుద్దీ.... దేనికి అని అడిగితె డిప్ప మీద కొడతా....మేమడగకుండా చూడాలా....

తర్వాత హైదరాబాద్ వస్తే ఆ అబ్బాయ్ హీరో ని రత్తన్పూర్ ట్రాన్స్ఫర్ చేస్తారు....

హిరో వెళ్తాడు....హీరోయిన్ ఉంటది....విలన్ ఉంటాడు....

ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యా జజ్జినక.... షెడ్ కి వెళ్లిన సుమన్ శెట్టి,షెడ్ లో ఉన్నట్టుండే జబర్ దస్త్ గాంగ్ తో హీరో అల్లరి చేసి నవ్వులు పూయించాలని చుసిన విధానం చుస్తే ఒక రకం అయిన వైరాగ్యం బాధ జానీ సినిమా అన్ని గుర్తుకు వస్తాయి...

సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒక నాలుగు కాయితాలు గాల్లోకి ఎగిరాయ్....అంతే ఆ తర్వాత జనాల ప్రాణాలు గాల్లోకి ఎగురుతాయ్

అసలు కొన్ని కారక్టర్స్ దేనికి ఉన్నాయో అర్ధం కాదు... ఓపెన్ చేసిన థ్రెడ్స్ క్లోజ్ అవ్వవ్....అసలు ఆ సినిమా నే

హిందీ డబ్బింగ్ సినిమాకి తెలుగు డైలాగ్స్ పెట్టి మలయాళం సబ్ టైటిల్స్ వేసి నేపాల్ లో రిలీజ్. చేసినంత నాన్ సింక్ లో ఉంటది ఈ సినిమా...

ఈ సినిమా లో 
పవన్ కళ్యాణ్ కి 16
విలన్ కి 6
హీరోయిన్ కి 4
బ్రహ్మి కి 2
ఆలీ కి 3
ముకేష్ ఋషి కి 3

మిగతా ప్రతి వాడికి ఒక్కోటి చొప్పున ఇంట్రడక్షన్ సీన్స్ ఉన్నాయి.... స్లో మో షాట్స్.... కెమెరా యాంగిల్స్ ఎడిటింగ్ కట్స్ బాక్ గ్రవుండ్ మ్యూజిక్ ఇలా అన్ని ఉన్నాయ్....

కాజల్ మొదటి సారి ముసలి గా కనిపిస్తే ఆయన మరో సారి ముసలి గా ఉన్నారు...

బ్రహ్మి నవ్వించటానికి పడిన కష్టం చుస్తే....అయ్యో పాపం అనిపిస్తుంది....

ఈ సినిమాలో లాజికల్ ఎర్రర్స్ మీద ఒక పుస్తకం ఎం ఖర్మ ఒక శాఖా గ్రంధాలయం పెట్టొచ్చు

బ్రహ్మి ఆలీ చేసే కామెడీ కంటే విలన్ సీరియస్ గా చేస్తుంటే ఎక్కువ నవ్వొచ్చింది నాకు....

పవన్ కళ్యాణ్ ఈ కథ రాయటం గొప్ప కాదు....ఈ కథ తో నిర్మాతని ఒప్పించటం గొప్ప.... సంపత్ నంది కి భారీ ప్రమాదం తృటి లో తప్పి ఆ బుల్లెట్ బాబి కి తగిలింది...మాడు పగిలింది

డైరెక్టర్ తన దర్శకత్వ ప్రతిభను చెలరేగి చూపించాడు... అయినా మనలో మన మాట..... లాస్ట్ ఓవర్ 168 రన్స్ కొట్టాలి ఒక వికెట్ ఉంది అన్నప్పుడు ఎవరు మాత్రం ఎం చేస్తాడు.... అదే చెయ్యగలిగాడు దర్శకుడు....కనీసం నాట్ ఔట్ గా మిగులుదాం అని చూసాడు కాని.....అతను కొట్టిన బంతి అటు పక్క ఉన్న బాట్స్మెన్ కి తగిలి గాల్లోకి లేచి కాచ్ ఇచ్చి ఔట్ ఆయాడు..... అక్కడ పవర్ క్రియేటివ్ కలం చెలరేగి పోయింది.....పవర్ బాబి గళం మూగబోయింది

సినిమా లో కామెడీ కి నవ్వు రాదు
సెంటిమెంట్ కి ఏడుపు రాదు
ఎమోషనల్ సీన్స్ లో కసి రాదు
పాటలలో రిలాక్సేషన్ రాదు
కాని టన్ను ల కొద్ది భయం లిటర్ల కొద్ది నిద్ర వస్తాయి....

పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ లో వేసే నృత్య విశ్వరూపాన్ని ఆహా వెండి తేరా మీద మొండి గ చూడాల్సిందే....

పంచ్ డైలాగ్స్ దండి గ ఉన్నాయ్.... అందులో ఒకటి బ్రూస్లీ కి బాబాయ్ లా ఉన్నాడు అని...

కేవలం బ్రూస్లీ కి బాబాయ్ మాత్రం కాదు...మ్ తుఫాన్ కి బాబాయ్...ఆరెంజ్ కి బాబాయ్...వరుడు కి మామ...లోఫర్ కి బాబాయి....

ఒక శక్తి ఒక భాయ్ ఒక పరమ వీర చక్ర ఒక షాడో ఒక బాబి ఇవ్వన్ని ఒక ఎత్తు.... ఇదొక్కటే వాటాన్నిటి ఎత్తు....

1980 లో కథ బేస్ తో ఆగడు కిక్ 2 వస్తే... ఆ రెండిటి కథ మిక్సీ తో ఇది వచ్చింది.....

పవన్ కళ్యాణ్ కి కూడా ఫ్లాప్స్ వస్తాయి.... తప్పులు జరుగుతాయి...ఆయనేం అతీతుడు కాదు అని పవనిజ మతస్తులకి చెప్పటానికి చేసిన ఒక చిట్టి ప్రయత్నం సర్దార్..

ఈ సర్దార్ గబ్బర్ సింగ్ ని ఒక సర్దార్ జోక్ లా తీసుకుని వదిలెయ్యటమే....

ఆయన అభిమానులు సించుకుని రావచ్చు గాక...నా రివ్యూ వల్ల కలెక్షన్స్ తగ్గే రేంజ్ మీ హీరోది అనుకుంటే రండి... లేదా మీ మతం లో మాత్రమే బ్లాక్ బష్టర్ ని ఎంజాయ్ చెయ్యండి...ఒక రెండు రోజులు పట్టుద్ది మీకు మబ్బు ఇడతానికి.....

మీ లాంటి ఒక అభిమాని పవనిజం టీ షర్ట్ వేసుకుని మేడలో ఎర్ర తువ్వాలు వేసుకుని సినిమా స్టార్ట్ అయిన అరగంట లో నిద్ర పోవటం....ఇంటర్వల్ లో గురకలు పెటీ నిద్ర పోయిన ప్రేక్షకులు చెప్పారు సినిమా రాత ఏంటో

ధన్యవాదములు....!!

Link to comment
Share on other sites

10 minutes ago, Don_Draper said:

Producer gadu paisal ki kakruthi padi hindi lo kuda release chesadu.. dimag undali

Producer cum director cum story cum screenplay cum choreographer etc.. Anni PK ega 


bcQswTI.gif

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...