Jump to content

గబ్బర్సింగ్ 3 టైటిల్ ఇదే


rajurocking50

Recommended Posts

గబ్బర్ సింగ్ కు సీక్వెల్ గా సర్దార్ గబ్బర్ సింగ్ ను రూపొందించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మొదటి సినిమాకి స్టోరీ ప్రకారం ఇది సీక్వెల్ కాకపోయినా గ‌బ్బ‌ర్‌సింగ్ స్టైల్లోనే ఈ సినిమా తెర‌కెక్కింది. గబ్బర్ సింగ్ లో పోలీస్ పాత్ర విపరీతంగా నచ్చడంతోనే.. అదే కేరక్టర్ తో తనే స్టోరీ – స్క్రీన్ ప్లే రాసుకుని సర్దార్ చేశాడు పవన్. తాజాగా స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు గ‌బ్బ‌ర్‌సింగ్ క్యారెక్ట‌ర్‌కు కొన‌సాగింపుగా గ‌బ్బ‌ర్‌సింగ్ 3 కూడా వ‌స్తోంది. ఇది నిజ‌మే స‌ర్దార్ సినిమా అయిపోయాక క్లైమాక్స్ టైటిల్స్‌లో ‘రాజా సర్దార్ గబ్బర్ సింగ్’ అంటూ నేమ్ కార్డ్ వేసి సినిమాని క్లోజ్ చేస్తారు.

 

ఈ మూవీలో ఓ యువరాణిని చేసుకుంటాడు కాబట్టి.. అలా రాజా సర్దార్ గబ్బర్ సింగ్ అని పక్కనున్నవాళ్లతో అనిపిస్తారు కూడా. ఈ డైలాగ్ ఎలా ఉన్నా చివ‌ర్లో రాజా స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ అని వేయించ‌డంతో ఇప్పుడు గ‌బ్బ‌ర్‌సింగ్ 3 వ‌స్తోంద‌న్న చ‌ర్చ‌లు కూడా స్టార్ట్ అయ్యాయి. రీసెంట్ గా సర్దార్ ప్రమోషన్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా ఇలాంటి మాటే ఒకటి చెప్పాడు. ఈ కేరక్టర్ ని ఫ్యూచర్ లో ఎవరైనా కంటిన్యూ చేసినా అదో ట్రంప్ కార్డ్ గా ఉండాలనే… గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ ని అదే మ్యూజిక్ తో చేసినట్లు చెప్పాడు. అంటే వ‌చ్చే రెండు మూడేళ్ల‌లో గ‌బ్బ‌ర్‌సింగ్ 3 కూడా రాజా స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ పేరుతో వ‌స్తుంద‌నుకోవ‌చ్చు.

 

Link to comment
Share on other sites

  • 3 years later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...