Jump to content

సర్దార్ పై డైరెక్టర్ బాబి తండ్రి సంచలన వ్యాఖ్యలు


rajurocking50

Recommended Posts

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమాపై ఉన్న భారీ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే తొలి రోజు రూ.31 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన స‌ర్దార్ రెండో రోజుకే నెమ్మ‌దించింది. టోట‌ల్‌గా సినిమాకు డివైడ్ టాక్ రావ‌డంతో పాటు ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను కూడా పూర్తిగా మెప్పించ‌క‌పోవ‌డంతో సినిమాను అంద‌రూ ప్లాప్ అని తేల్చేస్తున్నారు. ఈ టైంలో స‌ర్దార్ సినిమాపై డైరెక్టర్ బాబి తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు ఇండ‌స్ర్టీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.

బాబి తండ్రి స‌ర్దార్ సినిమాను చూసి బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా సినిమా ఎలా ఉంద‌ని విలేక‌ర్లు అడిగారు. ఇందుకు ఆయ‌న స్పందిస్తూ  “ఈ సినిమాలో కొత్త పవన్ కళ్యాణ్ ని చూశాం… బాబి దర్శకత్వ ప్రతిభ ఏమిటో…. అసలీ సినిమా ఏంటి.. చాలా రేంజ్ కెళ్లింది..ఎవడీకీ అర్థం కాదు.. పిచ్చెక్కి చచ్చిపోవాలి జనం..” అని ఆయన అన‌డంతో మీడియా వాళ్ల‌తో పాటు అక్క‌డున్న వాళ్లంద‌రూ ఒక్క‌సారిగా అవాక్క‌య్యార‌ట‌.

తన కొడుకు దర్శకత్వం వహించిన సినిమా గురించి తండ్రి బహిరంగంగా ఎందుకు ఇలాంటి కామెంట్లు చేశార‌న్న‌దే ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది. స‌ర్దార్ సినిమాకు కేవ‌లం డైరెక్ట‌ర్‌గా బాబి పేరు వేశారే త‌ప్ప‌…అస‌లు సినిమా మొత్తం ప‌వ‌న్‌క‌ళ్యాణే తీసుకున్నాడ‌న్న టాక్ ఉంది. దీంతో ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక ప్లాప్ టాక్ రావ‌డంతో బాబి తండ్రి ప‌వ‌న్‌ను టార్గెట్‌గా చేసుకుని సెటైర్లు వేశార‌ని ఇండ‌స్ర్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

 

evadu abba intha hype ichindi old man ki anukuna but ippudu media is telling he is directors father

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...