rajurocking50 Posted April 14, 2016 Report Share Posted April 14, 2016 నాలుగు రోజులకోసారి ప్రజలకు నీటి సరఫరా మంత్రి, ఎమ్మెల్యే, ఇరిగేషన్ అధికారుల మాట బేఖాతర్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారి చేతివాటం రూ.వేల కోట్లను గడిస్తున్న సర్కారు సంగారెడ్డి పట్టణ ప్రజలకు నాలుగురోజులకోసారి మంజీర నీరు సరఫరా అవుతోంది. అదే బీరు కంపెనీలకు మాత్రం నిత్యం మంజీర నీరు అందుతోంది. స్థానిక ప్రజల దాహార్తిని తీర్చడానికి నీటి పారుదల శాఖ మంత్రి హరీశరావు హైదరాబాద్‌కు మంజీర నీటి సరఫరాను నిలిపివేయించారు. కానీ, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు మాత్రం దర్జాగా బీరు కంపెనీలకు రోజూ లక్షలాది లీటర్ల మంజీర నీటిని సరఫరా చేస్తుండడం గమనార్హం. ఇందుకు సదరు కంపెనీలు వాటర్‌వర్క్ అధికారి ఒకరికి రూ.లక్షలు ముట్టజెపుతున్నట్టు సమాచారం. ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి, సదాశివపేట పట్టణాలతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చడానికి బీరు కంపెనీలకు మంజీర నీటి సరఫరా నిలిపేయాలని గతంలో మంత్రి హరీశరావు అధికారులను ఆదేశించారు. ఇదే విషయమై సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులకు సూచించారు. సింగూరు ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా పడిపోవడంతో బీరు కంపెనీలకు మంజీర జలాలను సరఫరా చేయరాదని నీటిపారుదల శాఖ అధికారులకు తెలిపారు. కానీ వారి మాటలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా మెట్రోవాటర్ వర్క్స్ అధికారి ఒకరు నిత్యం లక్షల లీటర్ల మంజీర నీటిని బీరు కంపెనీలకు సరఫరా చేయిస్తున్నారు. ఇందుకు ఆయా బీరు కంపెనీలు సదరు అధికారికి లక్షల రూపాయలను ముట్టజెపుతున్నట్టు తెలిసింది. అడుగంటిన సింగూరు గతేడాది జిల్లాలో వర్షాభావం, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వరదల రూపంలో మంజీర నది ప్రవహించకపోవడంతో సింగూరు ప్రాజెక్టు అడుగంటింది. 30 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 0.571 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ప్రాజెక్టులో 1.5 టీఎంసీల నీళ్లు ఉన్నప్పుడే రెండు నెలలక్రితం మంత్రి హరీశరావు హైదరాబాద్‌కు మంజీర నీటి సరఫరాను నిలిపివేయించారు. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు నీటిని సరఫరా చేయాలని ఆయన ఆదేశించారు. అయితే ఆ ఆదేశాలు అమలు కావడం లేదు. మూడు, నాలుగు రోజులకోసారి ఉదయం గంటసేపు మాత్రమే ప్రజలకు మంజీర నీరు సరఫరా అవుతోంది. ఇందుకోసం మున్సిపల్ అధికారులు ఒక్కో ఇంటి నుంచి నెలకు రూ.150 చొప్పున బిల్లులు వసూలు చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టులో ఉన్న కొద్దిపాటి మంజీర నీటిని వర్షాకాలం వచ్చేవరకు వాడుకునేందుకు వీలుగా నాలుగు రోజులకోసారి సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మిగిలిన మూడురోజులు బోరుబావుల నీటిని వాడుకుంటూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినా ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించడం లేదు. రోజూ నాలుగు బీరు కంపెనీలకు... సంగారెడ్డి మండలం కోత్లాపూర్‌లో ఒకటి, కొండాపూర్ మండలం మల్లేపల్లి వద్ద మూడు బీరు కంపెనీలున్నాయి. ఈ కంపెనీలలో బీరు తయారీకి వారంలో ఆరు రోజులు మంజీర నీరు సరఫరా అవుతోంది. సింగూరు ప్రాజెక్టు నుంచి పెద్దాపూర్ ఫిల్టర్ బెడ్స్‌కు వస్తున్న ఈ నీటిని హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ వారు నాలుగు బీరు కంపెనీలకు అందిస్తున్నారు. ఒక్కో కంపెనీకి రోజు 500 కిలోలీటర్ల(ఒక కిలో లీటర్‌కు వెయ్యి లీటర్లు) నీటిని సరఫరా చేస్తున్నారు. ఒక కిలోలీటరుకు రూ.240, నిర్వహణ కోసం రూ.3 చొప్పున మెట్రో వాటర్ వర్క్స్ వారు బిల్లు వసూలు చేస్తున్నారు. రోజుకు ఐదు లక్షల లీటర్ల చొప్పున మంజీర నీటిని సరఫరా చేస్తున్నందుకు ఒక్కో బీరు కంపెనీ సుమారు రూ.లక్షా 20వేలు చెల్లిస్తున్నది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా మంజీర నీటిని సరఫరా చేయిస్తున్న మెట్రోవాటర్ వర్క్స్ అధికారి ఒకరికి లక్షల రూపాయల్లో మాముళ్లు ముట్టజెపుతున్నట్లు తెలుస్తున్నది. ఆదివారం మంజీర నీటిని సరఫరా చేయకపోవడంతో ఆయా బీరు కంపెనీలు బహిరంగ మార్కెట్‌లో ఆర్వో ప్లాంట్ల నుంచి నీటిని కొనుగోలు చేస్తున్నాయి. ఈ ప్లాంట్ల ద్వారా 24 పైసల నుంచి 30 పైసల చొప్పున రోజుకు 2,20,000 లీటర్ల నీటిని కొనుగోలు చేస్తున్నాయి. అందుకోసం బీరు కంపెనీలు రోజు సుమారు 5 నుంచి 6 లక్షల రూపాయలను చెల్లిస్తున్నాయి. మంజీర నీటిని సరఫరా చేసే మెట్రో వాటర్ వర్క్స్‌కు, బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసే నీటికి బీరు కంపెనీలు దాదాపు ఒకే మొత్తంలో చెల్లిస్తున్నాయి. అయితే మంజీర నీటితో తయారు చేసే బీరు రుచికరంగా ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అందుకే మంజీర నీటిని తీసుకోవడానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు పేర్కొన్నాయి. సర్కారు ఆదాయం కోసమే... బీరు కంపెనీలకు మంజీర నీటిని సరఫరా చేయడం ద్వారా ప్రభుత్వం కూడా రూ.వేల కోట్లు ఆదాయం పొందుతున్నది. మల్లేపల్లి వద్ద ఉన్న రెండు బహుళజాతి సంస్థలైన బీరు కంపెనీలు 8 లక్షల నుంచి 9 లక్షల కేసుల బీరును తయారుచేస్తున్నాయి. ఒక్కో కేసుకు 12 బాటిళ్లుంటాయి. అలాగే మల్లేపల్లి వద్ద ఉన్న మరో బీరు కంపెనీ ఈ నెలలో 18 లక్షల కేసుల బీరును తయారు చేయాలన్న లక్ష్యంతో ఉన్నది. కొత్లాపూర్ వద్ద ఉన్న బీరు కంపెనీ 3 లక్షల కేసుల బీరును తయారు చేస్తున్నది. మల్లేపల్లి, కోత్లాపూర్ వద్ద యూబీ కంపెనీలు తమ బీరును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మిగిలిన రెండు బహుళజాతి కంపెనీలు తెలంగాణతో పాటు ఏపీ, కేరళ, ఒడిషా, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, గోవా, ఛత్తీ్‌సగఢ్‌లకు సరఫరా చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తేలికపాటి బీరును 23 రూపాయల చొప్పున కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నది. ఇదేబీరును ప్రభుత్వం బ్రేవరేజ్ కార్పొరేషన్ ద్వారా మద్యం షాపులకు రూ.71.50 పైసల చొప్పున అమ్ముతున్నది. ఈ బీరు బాటిళ్లపై బ్రాండ్లను బట్టి ఎంఆర్‌పీ ధర రూ.90 నుంచి రూ.95గా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సా్ట్రంగ్ బీరు బాటిల్‌ను బ్రాండ్‌లను బట్టి రూ.25 నుంచి రూ.30 చొప్పున కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం బ్రేవరేజ్ కార్పొరేషన్ ద్వారా మద్యం షాపులకు రూ.82కు విక్రయిస్తున్నది. ఈ బాటిళ్లపై బ్రాండ్లను బట్టి ఎమ్మార్పీ ధర రూ.105 నుంచి రూ.120 ఉన్నది. అంటే ఒక్కో తేలికపాటి బీరు బాటిల్‌పై రూ.48, స్ర్టాంగ్ బీరు బాటిల్‌పై సగటున రూ.60 చొప్పున ప్రభుత్వం ఆదాయం పొందుతున్నది. నెలకు లక్షలాది బీరు బాటిళ్ల అమ్మకం ద్వారా వేల కోట్ల రూపాయలను సమకూర్చుకుంటున్నది. అందుకే కాబోలు ప్రజలకు తాగునీటి కన్నా బీరును సరఫరా చేయడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందన్న మాట! శీతల పానీయాల తయారీ సంస్థకు సంగారెడ్డి సమీపంలోని శీతల పానీయాలు తయారు చేసే సంస్థకు కూడా మంజీర నీరు సరఫరా అవుతోంది. రోజుకు 6 లక్షల లీటర్ల చొప్పున నెలకు 20 రోజుల పాటు మంజీర నీటిని సరఫరా చేస్తున్న మెట్రోవాటర్ వర్క్స్‌కు శీతల పానీయాల సంస్థ నెలకు సుమారు రూ.25లక్షల బిల్లును చెల్లిస్తున్నది. అయితే శీతల పానీయాల సంస్థకు మంజీర నీటిని సరఫరా చేయడం వల్ల బీరు కంపెనీల మాదిరిగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయమేమీ లేదు. కాకపోతే మంజీర నీటిని సరఫరా చేయిస్తున్న మెట్రో వాటర్ వర్క్స్ అధికారికి మాత్రం సంస్థ నుంచి ముడుపులు అందుతున్నట్లు తెలిసింది. Quote Link to comment Share on other sites More sharing options...
Idassamed Posted April 14, 2016 Report Share Posted April 14, 2016 Hyd gone case if no water. Quote Link to comment Share on other sites More sharing options...
sampangi Posted April 14, 2016 Report Share Posted April 14, 2016 Androlla kutra Quote Link to comment Share on other sites More sharing options...
Buttertheif Posted April 14, 2016 Report Share Posted April 14, 2016 On 4/14/2016 at 4:22 PM, sampangi said: Androlla kutra Expand Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.