Jump to content

Dora Ban Tv5


BabuRa0

Recommended Posts

1 hour ago, dalapathi said:
KSR LIVE SHOW -కొమ్మినేని వివరణ
Share|
 
article20160502_25.jpg

మిత్రులందరికి ముందుగా క్షమాపణలు.గత ఏభై రోజులుగా ఎందరో మెస్సేజీలు ఇస్తున్నా, మెయిల్స్ పంపుతున్నా సమాధానం ఇవ్వనందుకు మన్నించాలని కోరుతున్నాను.నేనే కావాలనే ఎవరికి సమాదానం ఇవ్వలేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి.ఎన్.టి.వి లో రోజూ ఉదయం వచ్చే కెఎస్ ఆర్ లైవ్ షో లో ఎందుకు మీరు కనిపించడం లేదని చాలామంది అడుగుతున్నారు. కొద్దికాలం ఆగి సమాధానం ఇవ్వాలని అనుకోవడం వల్ల రిప్లై ఇవ్వలేదు తప్ప వేరే కాదు.చాలామంది నా పట్ల ఎంతో అభిమానం చూపుతూ మాట్లాడుతున్నారు.వారందరికి ధన్యవాదాలు.

నిజమే.నేను ఆ షో చేయలేకపోవడానికి ప్రధానంగా రాజకీయాలే కారణం.సహజంగానే అదికారంలోకి వచ్చిన కొందరు పెద్దలు తమ ప్రభావం చూపాలని అనుకున్నారు. అందులో భాగంగానే నన్ను ఆ షో నుంచి తప్పించాలని ప్రత్యక్షంగానో,పరోక్షంగానో వత్తిడి చేశారు.ప్రజాస్వామ్యంలో అన్ని అభిప్రాయాలకు అవకాశం ఉంటుందని నమ్మేవారిలో నేను ఒకడిని, నాకుగా నేను తెలిసి ఎవరికి అనుకూలంగానో, వ్యతిరేకంగానో వ్యవహరించాలని అనుకోను.ఎప్పుడైనా పొరపాట్లు జరిగితే జరిగి ఉండవచ్చు.కాని నిజాయితిగా, నిర్మొహమాటంగా ,నిష్పక్షపాతంగా ఉండాలన్నదే నా అభిప్రాయం. అందుకు అనుగుణంగానే టివీ డిబేట్ లు ఉండాలన్నది నా లక్ష్యం .అందువల్ల పలు సమస్యలు వచ్చే మాట వాస్తవమే.అయినా వాటిని తట్టుకుని ముందుకు సాగాలి.కాని ప్రభుత్వాలకు ఉండే అపరిమితమైన అదికారబలం ముందు వ్యక్తులు నిలబడడం కష్టం.అదే సమయంలో ఒక వ్యక్తి కోసం సంస్థలు దెబ్బతినరాదని నేను భావిస్తాను. వందల మంది ఆధారపడే సంస్థలు బాగుండాలి. అందుకే నేను ఎన్.టి.వి నుంచి తప్పుకోవడానికి సిద్దమయ్యాను.లేకుంటే ఇప్పటికే ఒకసారి మూడు నెలలపాటు ఎపిలో టీవీని బంద్ చేశారు.మళ్లీ నా కారణంగా టీవీ ఆగిపోయే పరిస్థితి రాకూడదు.ఆ ఉద్దేశంతో బాధ్యతల నుంచి తప్పుకోవడానికి నిర్ణయించుకున్నాను.కాని ఎన్.టి.వి యాజమాన్యం, చైర్మన్ చౌదరి గారు నా పట్ల సహృదయతతో, గౌరవంతో అందుకు ఒప్పుకోలేదు. దాంతో కొంతకాలం టీవీ షో నుంచి తప్పుకోవాలని అనుకున్నాము.కొద్ది కాలం తర్వాత పరిస్థితులు మారతాయని,అప్పుడు తిరిగి షో చేయాలని అనుకున్నాము.ఆ క్రమంలో నేను కొంత కాలం యాజమాన్యం సహకారంతోనే కెనడా వెళ్లి వచ్చాను.అయితే తిరిగి వచ్చాక కూడా ఇంకా సమస్య ఒక కొలిక్కి రాలేదు.సంప్రదింపులు జరుగుతున్నాయని యాజమాన్యం వారు చెప్పారు.మళ్లీ ఉద్యోగం నుంచి తప్పుకుంటానని,సంస్థ నా వల్ల ఇబ్బంది పడవద్దని యాజమాన్యానికి తెలిపాను.కాని వారు అంగీకరించలేదు.మరికొంత సమయం ఇవ్వాలని కోరారు.దాంతో నేను కూడా మరీ మొండిగా ఉండరాదన్న ఉద్దేశంతో యాజమాన్యం నా పట్ల చూపిన ఆదరణకు కృతజ్ఞతగా ఉండాలని భావించాను. బహుశా మరి కొంతకాలం షో లోకి రాలేకపోవచ్చని అనుకుంటున్నాను.ఒకందుకు సంతోషంగా ఉంది.నేను ఎక్కడా ఆత్మ గౌరవాన్ని వదలుకోలేదు.ప్రజల పక్షాన,ఎవరు తప్పు చేసినా మాట్లాడే బాట నుంచి వైదొలగలేదు.నా అబిప్రాయాలు కొందరికి నచ్చకపోవచ్చు.కాని ఒక జర్నలిస్టు చేసే వ్యాఖ్యలకే ప్రభుత్వంలో అగ్ర స్థానంలో ఉన్నవారు భయపడతారా అనుకునే వాడిని.వాడి ఉద్యోగం తీయించుతారా అని అనుకుంటుండేవాడిని.కొందరు గొప్ప జర్నలిస్టులకు ఎదురైన అనుభవాలు తెలుసు.నిజానికి నేను అంత గొప్పవాడినేమీ కాదు.ఆ విషయంలో నాకు స్పష్టత ఉంది.కాని నేను ఎక్కడా రాజీపడకుండా ఉద్యోగం పోగొట్టుకోవడానికి కూడా సిద్దపడి నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను.అలాగే ఒక పార్టీ పట్ల అబిమానమో, ద్వేషమో లేవు.వ్యక్తులపై ఎలాంటి అగౌరవం లేదు. పరిస్థితులు మారతాయని , అధికారంలో ఉన్నవారు ప్రజాస్వామ్య విలువలకు ఎప్పటికైనా గౌరవం ఇస్తారని ఆశిస్తున్నాను.

 

http://kommineni.info/articles/dailyarticles/content_20160502_25.php?p=1462202257771

Z6y3GE.gifZ6y3GE.gif

Link to comment
Share on other sites

3 minutes ago, psycopk said:

yedava panulu chestu media ni face cheyali ante kastam kada.. anduke ban media..

ABN gaadu eppudu Kavitha and dhani driver ranku vidoe bayata pedathado. choodali..

appudu gaani buddhi raadhu..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...