bokuboy Posted May 4, 2016 Report Share Posted May 4, 2016 ఒకవైపు ఫిరాయింపులపై విరుచుకుపడుతున్నది ఆ పత్రికే! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం వైపు, ఇదే పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి వైపు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫిరాయించడాన్ని ఖండించడం ఆ పత్రిక అజెండా. జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికే చెందిన పేపర్ కావడం తో ఫిరాయింపుదారులపై విరుచుకుపడటం.. వారు అమ్ముడుపోయారని కథనాలు రాయడం.. వారు ఎంతకు అమ్ముడుపోయారో వివరించడాన్ని ఈ పత్రిక బాధ్యతగా తీసుకుంది. ఈ ఫిరాయింపుదారుల వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండటంతో ఆ ఆందోళన అంతా ఈ పత్రిక కథనాల్లో కనిపిస్తూ వచ్చింది. మరి వార్తా కథనాల విషయంలో ఈ విధంగా ముందుకుపోతున్న సాక్షి ఇదే సమయంలో తెలంగాణలో శవంగా మారిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని ఆధారంగా చేసుకుని పేలాలు ఏరుకునే పనిని కూడా చేయడం ఆశ్చర్యకరంగా మారింది! జగన్ పత్రికకు మరీ ఇంత కక్కుర్తా! అనే అభిప్రాయం వినిపిస్తోందిప్పుడు. ముష్టి డబ్బు కోసం జగన్ పత్రిక ఇంతకు దిగజారుతుందా... ఆ పత్రికను మేనేజ్ చేస్తున్న వాళ్లు కనీస ఇంగితం కూడా లేదా?! అనుకోవాల్సి వస్తోంది! విషయం ఏమిటంటే... తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై వైకాపా వాళ్లు అయితే విరుచుకుపడుతున్నారు. ఆయన ఎంపీ హోదాకు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర స మితి వైపు వెళ్లిపోవచ్చు... ఎంపీ హోదాలో ఎలా కొనసాగుతారు? అంటూ తెలంగాణలో ఇంకా మిగిలిన వైకాపా నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడాన్ని సెలబ్రేట్ చేసుకొంటున్నాడు శ్రీనివాసరెడ్డి. అందులో భాగంగా పత్రికలకు ప్రకటనలు ఇచ్చాడు! అన్ని పత్రికలకూ తొలి పేజీ ప్రకటనలు ఇచ్చి.. తను గులాబీ తీర్థం పుచ్చుకొంటుండటాన్ని ఘనంగా ప్రచారం చేసుకుంటున్నాడు శ్రీనివాసరెడ్డి. తొలి పేజీలో చిన్న సైజ్ లో పొంగులేటి ఇచ్చిన యాడ్ ను సాక్షి పేపర్ కూడా ప్రముఖంగా ప్రచురించింది! వైకాపా నుంచి ఒక ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరితే .. అతడిపై వైకాపా నేతలు విరుచుకుపడుతుంటే… అదే ఎంపీ ఇచ్చి చిన్న యాడ్ కోసం కక్కుర్తి పడించి సాక్షి. అంటే… జగన్ పార్టీ నుంచి వెళ్లిపోయిన వ్యక్తి పై అతడి యాడ్ ను తీసుకోకపోవడం అనే చిన్న పాటి ఆగ్రహాన్ని కూడా ప్రదర్శించలేకపోయింది ‘సాక్షి’. అతడి సంబరాన్ని యాడ్ గా ప్రచురించి డబ్బే ప్రధానం తప్ప..జగన్ కు జరుగుతున్న నష్టం లెక్కలోనిది కాదు అని సాక్షి చాటదలిచింది. మరి సాక్షి పేపర్ వాళ్లు ఆ యాడ్ తీసుకోనంత మాత్రాన పొంగులేటి వైకాపాలో నే మిగిలిపోతాడా? ఆ యాడ్ సాక్షి తీసుకోకపోయినా జరిగే నష్టం జరుగుతుంది కదా.. అనుకోవచ్చు. మరి అనునిత్యం విలువల గురించి కథనాలు రాస్తూ.. పొంగులేటి యాడ్ తో విదిల్చే చిల్లర కోసం కక్కుర్తి పడటం ఏ మేరకు కరెక్టో.. తెలంగాణలో వైసీపీ శవంగా మారిన నేపథ్యంలో దాని ఊరేగింపుపై చిల్లర ఏరుకోవడం ఎంత వరకూ సబబో.. సాక్షి డైరెక్టర్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది! Quote Link to comment Share on other sites More sharing options...
Buttertheif Posted May 4, 2016 Report Share Posted May 4, 2016 Lol Quote Link to comment Share on other sites More sharing options...
Guts_guns_and_love Posted May 4, 2016 Report Share Posted May 4, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
johnubhai_01 Posted May 4, 2016 Report Share Posted May 4, 2016 raajakeyam rowdism okkati kaadu ra rei Quote Link to comment Share on other sites More sharing options...
ranku_mogudu Posted May 4, 2016 Report Share Posted May 4, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
Buttertheif Posted May 4, 2016 Report Share Posted May 4, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
BabuRa0 Posted May 5, 2016 Report Share Posted May 5, 2016 lol Jaffas Quote Link to comment Share on other sites More sharing options...
ceelogreen Posted May 5, 2016 Report Share Posted May 5, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.