Jump to content

ప్రత్యేక హోదాను వ్యతిరేకించండి.


db_ka_ekniranjan

Recommended Posts

ప్రత్యేక హోదా పేరుతో 
పరిశ్రమలు పెట్టడంకోసమంటూ సెజ్ ల కోసమంటూ భూములు బలవంతంగా లాక్కుంటారు.

ఒక ఎకరం సరిపోయే పరిశ్రమలకు వేల ఎకరాలు లాక్కుంటారు.

ఆ భూములు వారి కులస్తులకే కారు చౌకగా కేటాయిస్తారు.
లేదా బినామీల పేరుతో కొట్టేస్తారు.

అప్పటి వరకూ గౌరవంగా బ్రతుకుతున్న రైతులు, రైతు కూలీలు అన్యాయమైపోవడమేగాక ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారు. 
ఉపాధికోసం పొట్ట చేతబట్టుకుని వలసపోతారు.

పై స్థాయి ఉద్యోగాలు వాళ్ళ కులాలకు ఇచ్చుకుంటారు. 
వారి కులస్తులకు ఏ విద్యార్హతలూ, ఏ నైపుణ్యతలు వుండనవసరం లేదు.

స్వీపర్ , కూలీ , సెక్యూరిటీ గార్డు లాంటి ఉద్యోగాలు మాత్రం ఇతర కులాలకిస్తారు.

భూములు పోయి యజమానులు కూలీలవ్వాలా?
కడుపు చేతబట్టి వలసలు పోవాలా?
అలాంటి అభివృధ్ది అవసరమా?

ఎవడికో ఉపయోగపడే అభివృద్ధికి ఆటంకం కలిగితే మనమెందుకు భాధపడడడం?
మనమెందుకు కేంద్రాన్ని నిందించడం?

బ్యాంకు లోన్లు , సబ్సిడీలు ఎవరికిస్తారు?
ఆ కులాలకు ఎటువంటి ష్యూరిటీలు అవసరంలేదు. దొంగ ష్యూరిటీలు పెట్టినా లోన్లు ఇస్తారు.
అదే సామాన్యుడికి ఎన్ని కండిషన్లో? ఎన్ని రూల్సో?
లోను అస్సలు ఇవ్వరు.

ప్రత్యేక హోదా ఇవ్వడం వలన పరిశ్రమల యజమానులకు కారు చౌకగా భూములు దక్కుతాయి. భారీ సబ్సిడీతో లోన్లు , Income Tax, sales Tax , Commercial Tax , Free Electricity లాంటి ఎన్నో పన్ను రాయితీలు పొంది మరింత ధనవంతులవుతారు. 
ఇండస్ట్రీల అడ్రసు ఆంధ్రకు మార్చి దొంగతనంగా వస్తు ఉత్పత్తిని ఇతర రాష్ట్రాలకు ఆర్డరు ఇస్తారు. ఆంధ్రలో నే వస్తూత్పత్తి చేసినట్టు చూపించే అవకాశం వుంటుంది.
మరి ఉద్యోగాలెలా వస్తాయి.

దాని వలన సామాన్యుడికీ వచ్చే లాభం ఏమీ వుండదు.

అంతేకాకుండా పన్ను రాయితీల వలన ప్రభుత్వాదాయానికి గండి పడి ఆ డబ్బు ధనవంతుల జేబుల్లోకి పోతుంది. 
దాని వలన మౌలిక సదుపాయాల కల్పనకు , సంక్షేమ పథకాలకు ఇబ్బందులు తలెత్తుతాయి.

ఏదో ఒక కులానికో , మనకు సంబంధం లేని ఎవడికో ఉపయోగపడే హోదా కోసం మనమెందుకు ప్రశ్నించడం?
మనకెందుకు ఆదర్శాలు ?

స్వార్థ పూరితంగా ఆలోచించండి.
ఎవడో దోచుకోడానికి మనమెందుకు సహకరించడం?
మనమెందుకు సమిధలవ్వడం?
ఎవడి క్రిందో బానిసగా బ్రతకడమెందుకు?

కాబట్టి ప్రత్యేక హోదాను వ్యతిరేకించండి.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...