Jump to content

Mega confusion


Potugaduu

Recommended Posts

పవన్‌కళ్యాణ్‌ తన కొత్త సినిమాకి డైరెక్టర్‌ని మార్చేయడం, చిరంజీవి హీరోగా నటించనున్న 'కత్తి' సినిమా ఇంకా పట్టాలెక్కకపోవడం.. ఇవన్నీ మెగా అభిమానుల్ని గందరగోళంలో పడేస్తున్నాయి. రామ్‌చరణ్‌ హీరోగా 'తని ఒరువన్‌' తెలుగు రీమేక్‌ పట్టాలెక్కినప్పటికీ, ఆ సినిమా విషయంలోనూ గందరగోళం యధాతథంగా వుంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మొన్నామధ్య సినిమాకి సంబంధించి ఓ ఫొటో విడుదలయ్యింది. అంతే, మళ్ళీ న్యూస్‌ లేదు. 

ఇక, అంతా ఎదురుచూస్తోన్న 'కత్తి' రీమేక్‌పై క్లారిటీ లేకపోవడం అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తోందనే చెప్పాలి. ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరన్నదానిపై ఇప్పటిదాకా కన్‌ఫ్యూజనకే కొనసాగుతోంది తప్ప, క్లారిటీ రావడంలేదు. దర్శకుడు వినాయక్‌గానీ, నిర్మాత రామ్‌చరణ్‌గానీ, హీరో చిరంజీవిగానీ 'కత్తి' రీమేక్‌పై అప్‌డేట్స్‌ ఇచ్చే ప్రయత్నమే చేయకపోవడం ఆశ్చర్యకరం. సినిమా లాంఛనంగా ప్రారంభమయ్యిందంతే. 

ఒకేసారి మూడు మెగా సినిమాలు పట్టాలెక్కుతుండడంతో 'మెగా' పోటీ.. అంటూ అభిమానులు పండగ చేసుకున్నారు ఆ మధ్య. అయితే, దేనికదే కన్‌ఫ్యూజన్‌లో పడిపోయింది. ఇంకేముంది, చిరంజీవితో పవణ్‌కళ్యాణ్‌ పోటీ అన్నారు. అంతకు ముందేమో బాబాయ్‌ - అబ్బాయ్‌ మధ్య పోటీ అన్నారు. ప్రస్తుతానికైతే క్లారిటీ వున్నది 'తని ఒరువన్‌' రీమేక్‌కి మాత్రమే. టైటిల్‌ 'ధృవ' అంటూ ప్రచారమే జరుగుతోంది. ఇక్కడా స్పష్టత లేదాయె.! సెప్టెంబర్‌ నెలాఖరుకి ఈ చిత్రం విడుదల కానుంది.

కొసమెరుపు: చిరంజీవి ఈజ్ బ్యాక్.. అన్నట్లుగా ఓ సినిమా ఫంక్షన్లో.. చిరంజీవి లైవ్ పెర్ఫామ్ చేయడం. మెగాస్టార్ డాన్స్ చూసే అవకాశం చాన్నాళ్ళ తర్వాత అభిమానులకు కలిగింది.. ఆ ఫంక్షన్ పుణ్యమా అని.

 

 

Already ee movies originals ni naku thelsintha varaku 60% Telugu people dekesaru. Inka veellu ilage nanchithe migilina 40% ki kuda original movies reach ayipothay. Appudu there will be no use of remaking.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...