Jump to content

Great human being in TG/AP #GodPK pawan kalyan babu


sri_india

Recommended Posts

Nee Abhimanulugaa puttadam meemu chesukunna adrustham kalyan babu 

 

 

636034915058793574.jpg

 


తన సినిమాలతోనే కాదు.. నిజజీవిత ప్రవర్తనతో కూడా ఎంతో మంది అభిమానుల మనస్సులను దోచుకున్న కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌. ఫ్యాన్స్‌ పవన్‌ కల్యాణ్‌ను కేవలం సినిమా హీరోగానే చూడరు.. నిండైన వ్యక్తిత్వం ఉన్న వాడిగా, మంచి మనసున్న వ్యక్తిగా భావిస్తారు. పవన్‌ కూడా అభిమానుల అంచనాలకనుగుణంగానే నడుచుకుంటారు. తనకు నచ్చిన వాళ్లకు బహుమతులు పంపడం, సహాయం చేసిన వారికి రాతపూర్వకంగా ధన్యవాదాలు తెలపడం అయన స్టైల్‌. అలా తన మిత్రుడు తివిక్రమ్‌ శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ పవన్‌ రాసిన ఉత్తరమంటూ ఒక లేఖ ఆన్‌లైన్‌లో సందడి చేస్తోంది.


గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ‘ఆధునిక మహాభారతం’ పుస్తకాన్ని తన స్వంత ఖర్చులతో పవన్‌ పునర్ముద్రణ చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పుస్తకాన్ని తనకు పరిచయం చేసిన త్రివిక్రమ్‌కు, రీ ప్రింట్‌కు అంగీకరించిన శేషేంద్ర శర్మ కుమారుడు సాత్యకికి పవన్‌ ఆ లేఖలో కృతజ్ఞతలు తెలియజేశారు.


‘ఓ దేశ సంపద ఖనిజాలు కాదు. నదులు కాదు. అరణ్యాలు కాదు. కలల ఖనిజాలతో చేసిన యువత మన దేశానికి నావికులు అని శేషేంద్ర శర్మ గారు రాసిన మాటలు ఆయన్ని అమితంగా ఇష్టపడేలా చేశాయి. నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా? అని ఆయన వేసిన ప్రశ్న నాకు మహావాక్యం అయింది.


నాకు మహా ప్రీతిపాత్రమైన ‘ఆధునిక మహాభారతం’ గ్రంథం సమాజ శ్రేయస్సు కోసం పాటుపడేవారికి అందుబాటులో ఉండాలనే నా ఆకాంక్ష.. ఈ గ్రంథాన్ని మరోమీ ముందుకు తీసుకువచ్చేలా చేసింది. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన శేషేంద్ర శర్మ గారి అబ్బాయి, కవి సాత్యకి గారికి, నాకీ మహాకవిని పరిచయం చేసిన నా మిత్రుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ గారికి నా కృతజ్ఞతలు’ అని ఆ లేఖలో రాశారు. ఈ లేఖలో పవన్‌ కల్యాణ్‌ సంతకంతో పాటు కింద 18-5-2016 డేట్‌ కూడా ఉంది. అయితే ఇది లేఖా?, లేకపోతే ఆ పుస్తకం కోసం రాసిన ముందుమాట అనేది తెలియలేదు.

 

Link to comment
Share on other sites

10 minutes ago, biscuitRAJA000 said:

Ee writing edo sgs cinema  lo concentrate chesunte cinema babhubali ni left leg tho tannedhi@~`

raja SGS will answer all your questions

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...