Jump to content

చంద్రబాబు రిషితేశ్వరి కేసు నిందితులను ఎందుకు కాపాడుతున్నారు..


raithu_bidda

Recommended Posts

అసలైమైంది ఏమైంది..
నాన్న వరాల తల్లి, అమ్మ గారాలపట్టి. ఒక్కగానొక్క ముద్దుల కూతురు వరంగల్‌ జిల్లా నుండి తన జీవిత లక్ష్యాన్నిసాధించాలని బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌లో రాణించాలని గతేడాది గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చేరింది రిషితేశ్వరి. వచ్చిన మొదటి రోజే చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. కొద్ది రోజులు భరించింది వేదింపులు సహించలేక, ఆ అవమానాన్ని భరించలేక సరిగ్గా ఇదేరోజు తన నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దీంతో ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు తీవ్రంగా స్పందించాయి. నిందితులపై చర్యలు తీసుకోవాలని ధర్నాలు చేపట్టాయి.

ప్రభుత్వం ఏం చెయ్యాలి..
అభం శుభం తెలియని ఆమె చావుకు కారణమైన వాళ్ళని నడిరోడ్డుమీద ఈడ్చుకుంటూ తీసుకెళ్ళాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి. కానీ బాబు సర్కార్ ఆ దుర్మార్గులను కాపాడుకొస్తోంది.  దేశంలో మరెవ్వరికీ ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఆమె తల్లితండ్రులకు ధైర్యం చెప్పాలి.. నిందితులను శిక్షించడమే రిషితేశ్వరికి చేసే న్యాయం అన్న ఆ తండ్రి మాటలు నెరవేర్చాలి. యూనివర్సిటీల బయట ఔట్ పోస్టులు, ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన మాటలు నెరవేర్చలేదు. 

ప్రభుత్వం ఏం చేసింది..
రిషితేశ్వరి చనిపోయిన విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న నేపధ్యంలో బాబు ప్రభుత్వం నిజనిర్థారణ కమిటీ వేసింది.. రిషితేశ్వరి ఆత్మహత్యపై ఏర్పాటైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుబ్రమణ్యం కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ విద్యార్థినికి సంబంధించిన కొన్ని ఫొటోలు సర్క్యులేట్ చేయడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నదని కమిటీ తన నివేదికలో తెలిపినట్లు సమాచారం. వర్సిటీలోని కులసంఘాలు, వాటి కార్యాలయాలు కూడా ఆమె ఆత్మహత్యపై ప్రభావం చూపాయని ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అనంతరం
ప్రభుత్వం నిందితుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించింది. ఇప్పటివరకూ ఈ కేసులో ఎవ్వరికీ శిక్ష పడలేదు. ర్యాగింగ్ ను నిర్భయ చట్టంలో చేరుస్తామని ప్రకటించేసింది. విచారణ పూర్తిచేసి నిందితులను శిక్షించాలి. కానీ ఈ ఘటన జరిగిఏడాది గడిచినా ఇప్పటివరకూ నిందితులపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.

అసెంబ్లీని తాకింది..
రిషితేశ్వరి గతేడాది శాసనసభలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ విషయంపై విపక్షనేత జగన్,  వైసీపీ శాసన సభ్యురాలు రోజా తీవ్రంగా విరుచుకుపడ్డారు. నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి మృతికి టీడీపీయే కారణమని ఆరోపించారు.ఆత్మహత్యకు కారణమైన ప్రిన్సిపాల్‌కు టీడీపీ కొమ్ముకాస్తుందని ఆరోపించారు. తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో తెలుగుదేశం సభ్యుడు దూళిపాళ్ల నరేంద్ర చౌదరి వైసీపీ వ్యాఖ్యల్ని ఖండించారు. రిషితేశ్వరి ఆత్మహత్యను వైసీపీ రాజకీయం చేస్తోందని ఆయన ఆరోపించారు. వైసీపీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని ధూళిపాళ్ల డిమాండ్ చేశారు. వైసీపీ వ్యక్తిపైన పోరాటం చేస్తుందో, వ్యవస్థపై పోరాటం చేస్తోందో అర్థం కావడం లేదని
ఆయన చంద్రబాబు డైరక్షన్ లో టాపిక్ డైవర్ట్ చేశారు. 

ప్రిన్సిపాలే కారకుడు..
తన కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రిన్సిపాల్ బాబూరావే కారకుడని రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులకు ప్రిన్సిపాల్ బాబూరావునే కారణమని.. ఆ ప్రిన్సిపాల్ కు శిక్ష పడాల్సిందేనని కన్నీటి పర్యంతమైయ్యారు. కానీ ఈ నేరం చేసినందుకు బాబూరావుకు ఎలాంటి శిక్షా విధించలేదు. హాయ్ లాండ్ లో జరిగిన ఫ్రెషర్స్ డే పార్టీలో తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తితో ప్రిన్సిపాల్ అవార్డు ఇప్పించడమేమిటని రిషితేశ్వరి తండ్రి ప్రశ్నించారు. ఆ అవార్డు ఇచ్చిన ఫోటో తీసి అందరికీ షేర్ చేసుకోవాల్సిన అవసరమేమిటన్నారు.
అప్పట్లోనే రిషితేశ్వరి ఆత్మహత్యకు ప్రధాన కారకుడని ప్రిన్సిపాల్ బాబూరావుపై గుంటూరు జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  పిల్లలతో ప్రిన్సిపాల్ డాన్సులు చేయడం సిగ్గుమాలిన చర్య అని బాబూరావు వైఖరిని తప్పుబట్టారు. ఇంత జరిగినా కనీసం మీలో పశ్చాత్తాపం కనబడుటం లేదు. కనీసం  మీ నాన్నకు నీవైనా చెప్పంటూ పక్కనున్న ప్రిన్సిపాల్ కొడుకును చూస్తూ జడ్జి వ్యాఖ్యానించారు. 

నిందితులు, బాబూరావు ఇపుడేం చేస్తున్నారు..
ఈ కేసులో అరెస్టైన నిందితులకు కోర్టు కొద్ది రోజుల్లోనే బెయిల్ మంజూరు చేసింది. కీలక నిందితుడైన ప్రిన్సిపాల్ బాబూరావు జిల్లా కోర్టు లో లొంగిపోయి బెయిల్ కోరాడు. జిల్లా కోర్టు బెయిల్ నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. బెయిల్ తీసుకుని ప్రస్తుతం బయటే ఉన్నాడు బాబూరావు. ఈ కేసు ఈ రోజుకూ పూర్తిగా తేలకుండా పోయింది.

అభం శుభం తెలియని ఓ అమాయకురాలు మరణించాక కూడా చంద్రబాబు తీరులో మార్పు రాలేదు.. విచారణను వేగంగా పూర్తిచేసే ఆలోచన చేయలేదు.. ఇంకెవ్వరికీ ఇలాంటి గతి పట్టకుండా చేసేలా చర్యలు తీసుకోలేదు.. రిషితేశ్వరి మరణానికి న్యాయం చెయ్యలేదు.. రిషితేశ్వరి తల్లితండ్రులకు భరోసా కల్పించలేదు.. ఆమె ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీడియా ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.. ఇకనైనా చంద్రబాబు ప్రభుత్వం మేల్కొని నిందితులను శిక్షించాలి. చనిపోయిన ఓ విద్యా కుసుమానికి న్యాయం చెయ్యాలి..

Link to comment
Share on other sites

intaki ysr di natural death aa leka sonia and reliance kalisi champara.. deni meda jagan em cheyali.. em chesadu.. future lo em cheyali anukuntunadu..

elections apudu topic lepi.. votes padagane silent aaite etta??

Link to comment
Share on other sites

2 minutes ago, raithu_bidda said:

ippudu unnadi nakka prabhutvame kada brother enta arichi morapettukuna nyayam jaratadu

mana jagan only national media tho dealing kada... PM tho president tho samavesalu pedatadu kada.. ee topic gurinchi enduku raise cheytam ledu national media lo?? adi elagu state chetilo ledu kada.. why cant his MP's do something about it??

Link to comment
Share on other sites

13 minutes ago, psycopk said:

mana jagan only national media tho dealing kada... PM tho president tho samavesalu pedatadu kada.. ee topic gurinchi enduku raise cheytam ledu national media lo?? adi elagu state chetilo ledu kada.. why cant his MP's do something about it??

paritala ni hatya chesaru ani corect ga elections apude mirenduku matladutunnaru brother ipudu adhikaram lo unnadi mi prabhutvame kada case ni mundu ki enduku jarapadam ledu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...