Jump to content

Pinky Langa's Is this real?


rowwdy

Recommended Posts

బెల్లం చుట్టూ ఈగ‌లు అన్న చందంగానే రాజ‌కీయాల్లో కూడా ఎక్క‌డ అధికారం ఉంటే అక్క‌డికే చేరిపోతారు. ఇది కామ‌న్‌. తెరాస అధినేత కేసీఆర్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు తెలంగాణ‌లో విప‌క్ష పార్టీల‌కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాజ్య‌స‌భ స‌భ్యులు చివ‌ర‌కు చాలా మంది స్థానికి సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు కారెక్కేశారు. అలా కారెక్కేముందు త‌మ‌కు సంబంధించి ఏవో కొన్ని హామీలైతే పొందారు. అయితే ఇలా వ‌చ్చి చేరిన వారంద‌రూ ఇప్పుడు త‌ల‌లు ప‌ట్టుకుంటుండ‌డమే జంపింగ్ చిత్రంలో కొత్త ట్విస్ట్‌.

పార్టీ మారిన స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధుల్లో ఇప్పుడు 40 మంది సొంత గూటికి వెళ్లిపోవ‌డ‌మో లేదా మ‌రో పార్టీలోకి జంప్ చేసే ఆలోచ‌న‌లోనో ఉన్నార‌ట‌. ఇత‌ర పార్టీల నుంచి టీఆర్ ఎస్‌లో చేరిన వారికి అక్క‌డ అప్ప‌టికే ఉన్న పాత నేత‌లు ఏమాత్రం గుర్తించ‌డం లేద‌ట‌. కేసీఆర్ కొత్త‌, పాత నాయ‌కులు క‌లిసి ముందుకు వెళ్లాల‌ని చెపుతున్నా కొత్త‌గా చేరిన వారిని ఇప్ప‌టికే ఎమ్మెల్యేలుగా ఉన్న‌వారు అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని స‌మాచారం.

కొంద‌రు ఎమ్మెల్యేలు పాత‌వారిని ఎంక‌రేజ్ చేస్తుంటే మరికొందరేమో పాత‌, కొత్త‌ల‌ను కాదని కొత్తవారిని ప్రోత్సహిస్తున్నారని స‌మాచారం. ముఖ్యంగా టీఆర్ ఎస్‌కు అంత‌గా బ‌లం లేని దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఈ ప‌రిస్థితి ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఎదుర‌వుతున్న అవ‌మానాలు భరించలేక కొంతమంది స్థానిక ప్రజా ప్రతినిధులు పార్టీ మారేందుకు మాన‌సికంగా సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. ఈ ఎఫెక్ట్‌తో మొత్తం 40 మంది ఆయా జిల్లాల్లో పేరున్న ప్ర‌జా ప్ర‌తినిధులు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఈ విష‌యం ఇప్పుడు తెరాస భ‌వ‌న్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

 

If Real is it the END of TRS according to PINKY Langas????????????????????????

Link to comment
Share on other sites

1 minute ago, TOM_BHAYYA said:

End of trs .. 2019 Lo kodangal Tiger is our CM

nomination bone lo nundi vestada leka bayata nundi vestada anedi point ikkada

Link to comment
Share on other sites

4 minutes ago, SonaParv_522 said:

nomination bone lo nundi vestada leka bayata nundi vestada anedi point ikkada

akkada nunchi vesina 2019 CM revanth reddy kotesam gatiga kotesam.....Soon Nagam also will join TDP from BJP.....kotedam doralni kotedam...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...