Jump to content

పాలకులకు క్రమశిక్షణ లేకుంటే రాష్ట్రం ఎలా దిగజారుతుందో తెలంగాణ నిదర్శనమన్నారు నారా లోకేశ్


sri_india

Recommended Posts

636053583621423667.jpg
 
 సీఎం కేసీఆర్‌ ఫాంహౌజ్‌లో పడుకుంటే ఫలితాలిలాగే ఉంటాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. తెలంగాణలో దొరల పాలనను తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోందన్నారు. గత 45 రోజుల పరిస్థితి చూస్తుంటే సొంత పార్టీ నాయకులే నిలదీసే పరిస్థితి రానుందన్నారు. ముఖ్యమంత్రి అంటే చాలా కష్టడాలని, కేసీఆర్‌ ఫాంహౌజ్‌ పాలనతో మిగులు రాష్ట్రం కూడా లోటు బడ్జెట్‌లోకి వెళ్లిపోయిందని ఎద్దేవా చేశారు. 66 మంది పార్టీ కార్యకర్తలకు సంక్షేమ నిధి కింద చెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు సంక్షేమ నిధి కింద రూ.10 కోట్లు పంపిణీ చేశామన్నారు. 656 కుటుంబాలకు ప్రమాద బీమా కింద సాయం అందించామన్నారు. ‘‘టీడీపీ నుంచి టీఆర్‌ఎ్‌సలో చేరిన ఒకాయన ఇటీవల నాకు పదేపదే ఫోన్ చేశాడు. ఓసారి మాట్లాడితే పోలా.. అని ఫోన్ ఎత్తి, అన్నా బాగున్నావా? అని అడిగిన. ఏం బాగున్నమన్నా, ఇక్కడేం బాగలేదు. పార్టీలో చేరే ముందు సీఎం కేసీఆర్‌ నాతో మూడు గంటలు మాట్లాడిండు. చేరినప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌ కూడా ఇచ్చిండు. ఇగొ ఇప్పటి వరకు మళ్ల కలవనియ్యలే. అంటూ తన గోడు వెళ్లబోసుకున్నడు’’ అని లోకేశ్ తెలిపారు. ‘‘మరి, మీ ఇంచార్జి మంత్రితో మాట్లాడకపోయినవా? అం టే.. అన్నా, నీకు నోరున్నది నాకు చెప్పుకున్నవు. నేను మంత్రిని. నాకు నోరు లేదు. అంటూ సదరు మంత్రి జవాబిచ్చారని ఆ నాయకుడు వాపోయినడు’’ అని లోకేశ వివరించారు. నీళ్లు రాకున్నా, విద్యుత్తు రాకున్నా ఆంధ్రా పార్టీ అడ్డుపడుతోందంటూ టీడీపీని టీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శిస్తున్నారు.
 
మరి దళితులకు మూడెకరాలు పంపిణీకి, మైనారిటీలు, ఎస్టీలకు రిజర్వేషనలకు కూడా ఆంధ్రాపార్టీ అడ్డుపడుతోందా? అని లోకేశ్‌ నిలదీశారు. పాలకులకు క్రమశిక్షణ లేకుంటే రాష్ట్రం ఎలా దిగజారుతుందో తెలంగాణ నిదర్శనమన్నారు. ఈ పరిస్థితిని ప్రజల్లోకి కార్యకర్తలు తీసుకెళ్లాలని లోకేశ పిలుపునిచ్చారు. కాగా, మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు బాసటగా పోరాటం చేయాలని టీటీడీపీ నిర్ణయించింది. ఇందుకోసం పార్టీ ఆధ్వర్యంలో త్వరలో దీక్ష చేపట్టనుంది. గురువారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ అధ్యక్షతన ఎన్టీఆర్‌భవనలో ముఖ్యనేతల సమావేశం జరిగింది. రాష్ట్రంలో భూసేకరణ, రైతుల రుణమాఫీ, మల్లన్నసాగర్‌ నిర్వాసితుల ఆందోళన, ఎంసెట్‌ -2 లీకేజీ, విద్యార్థుల ఇబ్బందులపై చర్చించారు.
Link to comment
Share on other sites

Eedi Matta. Ap lo sand scam sesi 10gadu ee Pappu gadu. Daily Crores of people money officially looted by him. Veedi Gola bharinchaleka CBN sand free Chesi 10gadu. But still it's going in coastal areas.

Link to comment
Share on other sites

2 hours ago, TOM_BHAYYA said:

lokesh cheppindhi aksharaaala 100% nijam.. memu lokesh anna ni gelipinchukuntam eesaari 

Mee lanti vallani memu nammam sir, gelipistam gelipistam antu last ki maa loki babu GU lo gunapam dimputaru.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...