Jump to content

వారే…బాబు గారి ఆఫీసు ఊడ్వడానికయిన ఖర్చెంతో తెలుసా..!


mudragadav2

Recommended Posts

chandrababu-at-velagapudi.jpg

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితి బాగోలేదు. అస్త‌వ్య‌స్తంగా ఉన్న ప‌రిస్థితిని గాడిలో పెట్ట‌డానికి చంద్ర‌బాబు చాలా క‌ష్ట‌ప‌డుతున్నారు. రోజుకి 18గంట‌ల పాటు ఆయ‌న శ్ర‌మిస్తున్నారు. చివ‌ర‌కు సొంత మ‌నవ‌డితో కూడా ఆడుకోవ‌డానికి ఆయ‌న‌క‌కు తీరిక‌లేదు..ఈ మాట‌లు విన‌ని రోజు లేదు. అన‌ని నాయ‌కుడు లేడు. వాటిని వ‌ల్లించ‌ని సానుకూల మీడియా క‌నిపించ‌దు. కానీ చిత్రంగా ఆచ‌ర‌ణ‌లో వ్య‌వ‌హారం దానికి భిన్నంగా ఉంటుంది. ఎంత విచిత్ర‌మంటే,..ఇప్ప‌టికే అనేక లెక్క‌లు అప్ డేట్ పాఠ‌కుల దృష్టికి తెచ్చింది. చంద్ర‌బాబు విమాన‌యానాల‌ ఖ‌ర్చు ఏడాదికి 10 కోట్లు. ఇక ఆయ‌న అనుంగుడు దేవినేని ఉమా రోజుకి ఖ‌ర్చు ప్ర‌యాణ ఖ‌ర్చు 56 వేల రూపాయ‌లు. ఒక్క ఏడాదికి 2.06 కోట్లు. ఎక్క‌డ తిరిగార‌ని మాత్రం అడ‌గొద్దు. ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి వారు డ్రా చేసిన లెక్క‌ల‌వి.

ఇక ఇప్పుడు మైండ్ బ్లాక్ అయ్యే మ‌రో లెక్క బ‌య‌ట‌కొచ్చింది. చంద్ర‌బాబు హైద‌రాబాద్ విడిచిపెట్టి ఏడాది ఏడాది దాటింది. గ‌డిచిన ఏడాది కాలంలో ఆయ‌న హైద‌రాబాద్ ఆఫీసులో అడుగుపెట్టిన సంద‌ర్భం ఒక‌టి అరా మించి క‌నిపించ‌దు. కానీ ఆయ‌న ఆఫీసు ఊడ్వ‌డానికి అవుతున్న ఖ‌ర్చు వింటే మీరు నోరెళ్ల‌బెడ‌తారు.. ఎంత అనుకుంటున్నారా..జ‌స్ట్ 2 కోట్లు మాత్ర‌మే. ఏడాదికి రెండు కోట్ల రూపాయ‌ల చొప్పున రెండేళ్ల‌కు ఈ ఖ‌ర్చు 4 కోట్ల‌కు సుమారుగా చేరిపోయింది.

ఇది ఒక నెల‌కు సంబంధించిన‌, ఒక బ్లాక్ కేటాయించిన వివ‌రాల జీవో..అన్నింటికీ ఇదే రీతిలో ఉన్నాయి.

 

13920844_1768271340123464_79575178136633

హైద‌రాబాద్ లోని L , D , J , H బ్లాక్ లలో కొన్ని గదులని ఇప్ప‌టికీ సీఎం పేషీగా కొన‌సాగిస్తున్నారు. కేవ‌లం ఆ నాలుగు బ్లాకుల‌లోని కొన్ని గ‌దుల‌కే ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన సొమ్ము నెల‌కి అక్షరాల 15,15,332.
ఇక బ్లాకులు వారీగా ఖ‌ర్చులు ఇలా ఉన్నాయి..

L బ్లాక్ – 4,53,027 Rs
D బ్లాక్ – 4,31,350 Rs
J బ్లాక్ – 3,10,856 Rs
H బ్లాక్ – 3,20,099 Rs

మొత్తం క‌లిపితే ప‌దిహేను ల‌క్ష‌ల‌, ప‌దిహేను వేల‌, మూడు వంద‌ల ముప్పై రెండు రూపాయ‌లు. అది కూడా కేవ‌లం ఒక్క నెల‌కి మాత్ర‌మే. ఒక్క నెల‌కే ప‌దిహేను ల‌క్ష‌ల‌తో హౌస్ కీపింగా అని ఆశ్చ‌ర్య‌పోకండి. అది ఏడాది మొత్తం క‌లిపితే మీ గుండె ఆగిపోయేటంత లెక్క అవుతుంది ..గ‌డిచిన రెండేళ్ల అది సుమారు నాలుగు కోట్ల‌కు చేరుతోంది. అది కూడా కేవలం సెక్రటేరియట్ లో చంద్రబాబు మరియు ,సీఎం పేషీగా ఉపయోగించుకొనే గదులు ఊడవటానికి అయ్యే ఖర్చు . దీనికి ఇంకా మిగతా మంత్రులు , మిగిలిన ఆఫీస్ ల ఖర్చు కలపితే ఏ స్థాయిలో ఉంటుందో అంచ‌నాకి కూడా అంద‌డం లేదు.

అంటే ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్రంగా ఉండ‌డంతో కేవ‌లం రూమ్స్ శుభ్రం చేయ‌డానికి రెండు కోట్లు చొప్పున ఖ‌ర్చు పెడుతున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం..నిజంగా ఆర్థిక ప‌రిస్థితి బాగుంటే ఇంకెంత ఖ‌ర్చు పెట్టేసునో అని ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు. సీఎం పేషీలో ఓ 20 గ‌దులు ఉన్నాయ‌నుకుంది. ఒక్కో గ‌దికి ఒక‌రిని పెట్టినా 20 మంది అవ‌స‌రం అవుతారు. మ‌రో 10 మందిని అద‌నంగా నియ‌మించినా 30 మంది సిబ్బంది స‌రిపోతారు. వారంద‌రికీ చాలా ఉదారంగా స‌గ‌టున 20వేల రూ. ల వేత‌నం ఇచ్చార‌నుకుందాం. అప్పుడు మొత్తం ఖ‌ర్చు 6 ల‌క్ష‌ల‌వుతుంది. భారీగా ఖ‌ర్చు చేస్తే 6 ల‌క్ష‌లు నెల‌కి అయ్యింది. సంవత్స‌రానికి 70 ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతుంది. అద‌నంగా ఇత‌ర ఖ‌ర్చుల‌కు మ‌రో 30 ల‌క్ష‌ల రూ.లు లెక్కేసినా కోటి రూపాయ‌లు దాటే అవ‌కాశం లేదు. కానీ ఖ‌జానా నుంచి దానికి రెట్టింపు రిలీజ్ కావ‌డం గ‌మ‌నిస్తే అంద‌రికీ అనుమానం రావ‌చ్చు.

అందుకు త‌గ్గ‌ట్టుగానే స‌ర్కారీ వారి వ్య‌వ‌హారం ఉంది. ఈ కాంట్రాక్ట్ ఎస్ కే ఎంట‌ర్ ప్రైజెస్, కూక‌ట్ ప‌ల్లి పేరు మీదుగా సాగుతోంది. అంటే కూక‌ట్ ప‌ల్లి ఎమ్మెల్యే కృష్ణారావు కి చెందిన సంస్థ‌కు కోట్ల రూపాయ‌ల ఆంధ్రా ప్ర‌జ‌ల క‌ష్టార్జితం ఎలా క‌ట్ట‌బెడుతున్నారో ఇట్టే అర్థ‌మ‌వుతోంది. టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన ఆ కృష్ణారావుకి ఇప్ప‌టికీ టీడీపీ ప్ర‌భుత్వం నుంచి అందుతున్న ప్ర‌యోజ‌నాలు గ‌మ‌నిస్తే ఈ ఫిరాయింపుల భాగోతం కూడా అర్థ‌మ‌వుతుంది. వారి అంత‌ర్గ‌త సంబంధాల తీరు బోధ‌ప‌డుతుంది. నేను నిప్పు ..అని చెప్పుకునే చంద్ర‌బాబు పాల‌న‌లో హౌస్ కీపింగ్ లోనే ఈస్థాయి భాగోతాలు సాగుతుంటే ఇక వేల కోట్ల ప్రాజెక్ట్ లలో ? అది ప్రస్తుతానికి మీ ఊహకే వదిలేయాల్సి వ‌స్తోంది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...