Jump to content

ఈ చిట్టితల్లులకు దిక్కెవరు


Butterthief

Recommended Posts

  • ఐదుగురు ఆడపిల్లలను అనాథలను చేసి.. 
  • విషం తాగి తనువు చాలించిన తల్లి
  • ఏడాది క్రితమే తండ్రి ఆత్మహత్య
  • మగపిల్లాడి కోసం వరుస కాన్పులు
  • ఆ పిల్లలను పోషించలేక బలవన్మరణాలు
  • కడప జిల్లా నడింపల్లెలో విషాదం
 
రైల్వేకోడూరు రూరల్‌, ఆగస్టు 8: తొలి చూలు అమ్మాయి పుట్టింది! ఈసారైనా అబ్బాయి పుట్టకపోతాడా? అనుకున్నారా దంపతులు. అలా వరుసగా ఐదుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. వారిని పెంచి పోషించే ఆర్థిక స్థోమత లేక.. ఏడాది క్రితం తండ్రి ఆత్మహత్య చేసుకుంటే, తాజాగా తల్లీ విషం తాగి తనువు చాలించింది. ఫలితం..! ముద్దులు మూటగట్టే ఐదుగురు ఆడపిల్లలు అనాథలయ్యారు. కడపజిల్లా రైల్వే కోడూరు మండలం చియ్యవరం గ్రామపంచాయతీ పరిధిలోని నడింపల్లెలో జరిగిందీ విషాద ఘటన. గ్రామానికి చెందిన మడితపు శివయ్య, బుజ్జమ్మ దంపతులు రజక కులవృత్తి చేసుకుంటూ జీవించేవారు.
 
ఏడాది క్రితం శివయ్య అనారోగ్యంపాలయ్యాడు. ఆ అనారోగ్యంతో ఐదుగురు ఆడపిల్లలను, భార్యను ఎలా పోషించుకోవాలా అని దిగులుపడి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త చనిపోయినప్పటి నుండి బుజ్జమ్మ కూలిపనులు, కులవృత్తి చేసుకుని పిల్లలను పోషించుకునేది. ఇటీవలికాలంలో కూలిపనులు కూడా లేకపోవడంతో.. కులవృత్తిపై వచ్చే కాస్తోకూస్తో కాసులతోనే కాలం గడుపుతూ ఉండేది. ఒకపక్క భర్త పోయిన బాధ. మరోవైపు పెరుగుతున్న పిల్లలు. వారి పోషణ భారం మోయలేక తీవ్రమానసిక ఒత్తిడికి గురైన బుజ్జమ్మ మూడురోజుల క్రితం విషం తాగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. దీంతో పిల్లలు శిరీష (12), ప్రసన్న (10), మల్లిక (8), నందిని (6), విజిత (4) అనాథలైపోయారు.
 

హృదయవిదారకంగా.. 

ఆస్పత్రిలో మృతి చెందిన బుజ్జమ్మ మృతదేహాన్ని స్థానికులు సోమవారం నడింపల్లె గ్రామానికి తీసుకురాగా.. తల్లి మృతదేహాన్ని చూసి ఆ ఐదుగురు చిన్నారులూ భోరున విలపించారు. పెద్దకుమార్తె శిరీష ‘నువ్వు లేకుండా మేమెలా బతకగలమమ్మా’ అంటూ హృదయవిదారకంగా విలపిస్తుంటే గ్రామం శోకసంద్రమైంది. కాగా.. స్థానికులే బుజ్జమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, జడ్పీటీసీ సభ్యురాలు మారేళ్ల రాజేశ్వరి, ఎంపీటీసీ సభ్యులు రవి, రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వల్లూరు గంగన్న, పలు ఆశ్రమాల ప్రతినిధులు ముందుకు వచ్చి పిల్లల పోషణకు తాము సహకరిస్తామన్నారు.
 
ఐసీడీఎస్‌ అసిస్టెంట్‌ సీడీపీవో లూకు, మహిళామండలి సభ్యులూ పిల్లలను పరామర్శించి ఆదుకుంటామన్నారు. కానీ, వీరిలో ఒక్కరు కూడా తగిన ఆర్థిక సహాయం చేయకపోవడం గమనార్హం. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఆ పిల్లలకు తగిన సహాయం చేస్తామని వారి చదువులకు పోషణకు సహకరిస్తామని స్థానికులు తెలిపారు. ఏవైనా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకువచ్చి ఈ పిల్లల భవిష్యత్తుకు ఢోకా లేని విధంగా విద్యాబుద్ధులు చెప్పిస్తే బాగుంటుందని కూడా వారు అభిప్రాయపడ్డారు.
Link to comment
Share on other sites

Just now, Idassamed said:

Why calling twice rey Ziboomba?

BTW trailer kummindhi mee buddodiki 100 C movie.bl@st

avunu.... keka undhi ... celebration mode lo unnam abhimanulam bl@st

Link to comment
Share on other sites

2 hours ago, GunturGongura said:

nakaite oka papa ni dattatu tiskovalani undi but vache husband accept  chestado ledo

Inka acceptance kosam waiting why?? Adopt cheskovali ante cheskondi dont think of evantualities. YOLO!

Link to comment
Share on other sites

3 hours ago, GunturGongura said:

nakaite oka papa ni dattatu tiskovalani undi but vache husband accept  chestado ledo

sponsor remotely from usa 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...