Jump to content

Eenadu review ...


sri_india

Recommended Posts

కథేంటంటే..; సత్యం (మోహన్‌లాల్‌) ఓ మెకానిక్‌. తమ్ముడు (రెహమాన్‌)తో పాటు హైదరాబాద్‌లో ఓ గ్యారేజ్‌ నడుపుతుంటాడు. దాని పేరే ‘జనతా గ్యారేజ్‌’. అక్కడికి  సమస్య అంటూ ఎవరొచ్చినా దానికి పరిష్కారం చూపిస్తుంటారు. దాంతో సత్యంకి శత్రువులు పెరుగుతారు. వాళ్లు చేసిన దాడిలో తమ్ముడ్ని కోల్పోతాడు. తమ్ముడు కొడుకు ఆనంద్‌ (ఎన్టీఆర్‌)ని మాత్రం చిన్నప్పుడే ఈ జనతా గ్యారేజ్‌కి దూరంగా పెంచడానికి మేనమామ (సురేష్‌)కి ఇచ్చి ముంబై పంపించేస్తాడు. ఆనంద్‌కి అసలు తనకంటూ ఓ కుటుంబం ఉందని కూడా తెలియకుండా పెంచుతాడు మేనమామ. 
ఆనంద్‌కి ప్రకృతి అంటే ఇష్టం. చిన్న మొక్కకి హాని జరిగినా తట్టుకోలేడు. అందుకోసం ఎంతమందినైనా ఎదిరిస్తాడు. తనకీ ముంబైలో శత్రువులు పెరుగుతారు. కొన్ని కారణాల వల్ల ఆనంద్‌ తొలిసారి హైదరాబాద్‌ రావాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చాక సత్యంని కలుస్తాడు. దానికి కారణం ఏమిటి? సత్యం తన పెదనాన్న అని ఆనంద్‌కు తెలిసిందా? లేదా? జనతా గ్యారేజ్‌కి ఆనంద్‌ అవసరం ఏమొచ్చింది? ఇలాంటి విషయాలన్నీ  సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 
ఎలా ఉందంటే..; మొక్కల్ని ప్రేమించే ఓ కుర్రాడు.. మనుషుల్ని ప్రేమించే  ఓ పెద్దాయన ఎలా కలుసుకొన్నారు. వారిద్దరూ కలిశాక ఏమైంది? 
అనేదే ఈ సినిమా. కథ పరంగా... దర్శకుడు పెద్ద  కసరత్తు చేయలేదన్న భావన కలుగుతుంది.  చెడుపై మంచి పోరాటం చేయడం.. చివరికి గెలవడం అన్ని కథల్లోనూ కనిపించేదే. ‘జనతా గ్యారేజ్’ కథ కూడా అదే. జనతా గ్యారేజ్‌ అనేది ఓ సైన్యం. పేదల కష్టాల్ని తీరుస్తుంటుంది. వాళ్ల దగ్గరకు వచ్చిన సమస్యల్ని పరిష్కరిస్తుంటుంది. సినిమా ప్రారంభంలో ఎన్టీఆర్‌ చుట్టూ నడిపించిన సన్ని శాలు.. ఆకట్టుకుంటాయి . ఫస్టాఫ్‌లో మోహన్‌లాల్‌ పాత్రే కీలకంగా అనిపిస్తుంది. ఎప్పుడైతే జనతా గ్యారేజ్‌లో  ఆనంద్‌ ఎంట్రీ ఇచ్చాడో... అక్కడి నుంచి అసలు సిసలైన హీరోయిజం మొదలవుతుంది.

 

 

కథపై పెద్ద కసరత్తు చేయకపోయినా కొన్ని సన్నివేశాల్ని బాగానే రాసుకొన్నాడు దర్శకుడు. ముఖ్యంగా రాజీవ్‌ కనకాలకు సంబంధించిన సమస్యని పరిష్కరించే సన్నివేశం బాగుంది. అక్కడ దర్శకుడు తనలోని రచయితని పూర్తిస్థాయిలో బయటపెట్టాడు. అలాంటి ఇంకొన్ని సన్నివేశాలు ఉండి ఉంటే బాగుండేది. పతాక సన్నివేశాలు రొటీన్‌గా సాగాయి. కథానాయికల పాత్రల పరిధి చాలా తక్కువ. బలమైన ప్రతినాయకుడు లేకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తుంది. పాత్రల మధ్య సంఘర్షణ మరికాస్త ఉండి ఉంటే ఇంకాస్త బాగుండేది. ఆ విషయంలో దర్శకుడు తడబాటు కనిపిస్తుంది. 
 

ఎవరెలా చేశారంటే..; ఎన్టీఆర్‌ లుక్‌ కొత్తగా ఉంది. కాకపోతే నాన్నకు ప్రేమతోలోనూ ఇలానే గడ్డంతో కనిపించాడు కాబట్టి.. ఆ  ఛాయలు కనిపిస్తాయి.ఈ సినిమాలో కాస్త ఒళ్లు చేశాడు. నృత్యాలు ఎప్పట్లా ఆకట్టుకొనేలా ఉన్నాయి.  డైలాగ్‌ పలికే విధానంలో మార్పు చూపించాడు. కీలకమైన పాత్రలో మోహన్‌లాల్‌ నటన ఆకట్టుకొనేలా ఉంది. ద్వితీయార్థంలో ఆ పాత్రకు ప్రాధాన్యం తగ్గినట్టు అనిపిస్తుంది. సమంత.. నిత్యలు నామ్‌కే వాస్తే. సాయికుమార్‌ ఓకే అనిపించారు. ఉన్ని ముకుందన్‌ పాత్రని మలచడంలో దర్శకుడు ఇంకాస్త శ్రద్ద చూపించాల్సింది. 
టెక్నికల్‌గా బలమైన టీమ్‌ని ఎంచుకొన్నాడు కొరటాల. దేవిశ్రీ పాటల్లో రెండు పాటలు అభిమానుల్ని అలరిస్తాయి. నేపథ్య సంగీతం మాత్రం ఒకేలా సాగింది. తిరు కెమెరా పనితనం ఆకట్టుకొంటుంది. యాక్షన్‌ సన్నివేశాల్ని బాగా పిక్చరైజ్‌ చేశారు. దర్శకుడిగా.. రచయితగా కొరటాలకు పడాల్సిన మార్కులు పడవు. శ్రీమంతుడు.. మిర్చి సినిమాల్లోలా సంభాషణల్లో పదును అంతగా కనిపించలేదు. 
బలాలు 
+  ఎన్టీఆర్‌.. మోహన్‌లాల్‌ 
+   ప్రారంభ సన్నివేశాలు 
+  రెండు పాటలు

+  సాంకేతిక అంశాలు

బలహీనతలు 
- పాత్రల మధ్య సంఘర్షణ లోపించటం

- బలమైన ప్రతినాయకుడు లేకపోవటం

చివరగా.. జనతా గ్యారేజ్‌ను  మరింత ముస్తాబు చేసి ఉండాల్సింది

గమనిక; ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...