Jump to content

Credits to Babu- రాజ్యాంగానికి సవాల్- ఓటుకు నోటు కేసు


mudragadav2

Recommended Posts

ఓటుకు నోటు కేసు వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతోంది. ఈ కేసు గొప్పదనం ఏమిటంటే కేసులో ఏదో హడావుడి అవుతుందని ప్రజలు అనుకునే లోపుగానే ,అంతకన్నా రాజీ అయిపోయిందన్న ప్రచారం జరిగిపోవడం. ఇది నిజంగానే ఒక స్టడీ కేసుగా భవిష్యత్తులో పరిశోధకులకు ఉపయోగపడవచ్చు. కొద్ది రోజుల క్రితం ఎసిబి కోర్టు ఈ కేసుకు సంబందించి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రను విచారించి నివేదిక ఇవ్వాలని కోరిన విషయం సంచలనమే అయింది. కాని ఆ తర్వాత కేంద్రంలోని కొందరు బిజెపి పెద్దలు కాని, టిడిపి కేంద్ర మంత్రి సుజనా చౌదరి రంగంలో దిగి చేసిన ప్రయత్నాలు ఫలించినట్లే కనబడుతున్నాయి. టిఆర్ఎస్ కు చెందిన ఒక పత్రిక తొలి రోజు ఎంతో ప్రముఖంగా కోర్టు ఆదేశాల వార్తను ప్రచురిస్తే , ఆ తర్వాత ఎసిబి కోర్టు కు తెలంగాణ ఎసిబి ఇచ్చిన మెమో గురించి కాని, చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేస్తామని కోర్టుకు తెలియచేసిన విషయానికి గాని అసలు ప్రాముఖ్యత ఇవ్వకుండా లోపలి పేజీలకు , అది కూడా చాలా చిన్నవార్తగా ప్రచురించడం చూస్తుంటే ఏదో మతలబు ఉన్నట్లు కనబడుతుంది.అతే సమయంలో టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు ఈ కేసు అసలు అవినీతి నిరోధక చట్టం పరిదిలోకి రాదని, ఎన్నికల అక్రమాల కేసుగా చూడాలన్న వాదనను వినిపించడం ఆరంబించారు. అదే సమయంలో రాజ్ భవన లో రాజీ కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని,తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దీనిపై వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు బొత్స సత్యనారాయణ, కరుణాకరరెడ్డి వంటివారు ఆరోపిస్తున్నారు.ఏమైతేనేమీ ఊహించిన విదంగా తాత్కాలికంగా అయినా కేసులో చంద్రబాబు స్టే పొందగలిగారు. నిజంగా దీని గురించి వ్యాఖ్యానించాలంటే రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపివేస్తున్న ఓటుకు నోటు కేసు రాజ్యాంగ వ్యవస్థలకే సవాల్ విసురుతోంది.తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు పొందేందుకు గాను టిఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్ కు డబ్బు ఇచ్చే చేసే ప్రకియలో తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పట్టుబడడం, అదే క్రమంలో స్టీవెన్సన్ కు ఎపి ముఖ్యమంత్రి ,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు భరోసా ఇస్తూ ఆడియో టేపులో చిక్కిన వైనం దేశం అంతటా సంచలనం సృష్టించింది. ఎంతో సీనియర్ నేతగా ఉంటూ, నిత్యం నిప్పు అని,నిక్కచ్చి,తప్పు చేయలేదని కబుర్లు చెప్పే చంద్రబాబు నాయుడు ఇలా ఆడియోలో దొరికిపోయారా అని అంతా ఆశ్చర్యపోయారు.మొదట ఈ కేసుతో కొంత ఫంక్ అయినా, చంద్రబాబు తన విశ్వరూపం ప్రదర్శించి, ఏ వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయవచ్చో రుజువు చేశారు. అంతేకాక తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై పోన్ టాపింగ్ అంటూ ఎదురు కేసులు పెట్టి హడావుడి సృష్టించడం ఒక వైపు ,కేంద్రంలోని పెద్దల ద్వారా రాయబారాలు చేయించడం మరో వైపు సాగించి కేసు ముందుకు వెళ్లకుండా చేయడం లో సఫలం అయ్యారు.తెలంగాణ ఎసిబి చార్జీషీట్ లో ముప్పైమూడు సార్లు చంద్రబాబు పేరు ప్రస్తావించినా, ఆయనను నిందితుడుగా ఎసిబి చేయలేకపోవడం అంటే అది చంద్రబాబు చాతుర్యంగానే బావించాలి. చంద్రబాబు,కెసిఆర్ లు రాజీపడడం వల్ల మొత్తం కేసు అంతా నీరు కారిపోయిందని భావన ఏర్పడింది. లేకుంటే పద్నాలుగు నెలల క్రితం మొదలైన ఈ కేసు లో తెలంగాణ ఎసిబి అదనపు చార్జీషీట్ వేయలేకపోయింది?ఒక పత్రిక రాసినట్లు చంద్రబాబు ఆడియోటేపును ఇంతవరకు అసలు పోరెన్సిక్ లాబ్ కు ఎందుకు పంపలేదు? చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని హూంకరించిన కెసిఆర్ ఎందుకు జారి పోయారు?చివరికి ఎపిలో ఒక విపక్ష ఎమ్మెల్యే అయిన రామకృష్ణారెడ్డి, న్యాయవాది సుదాకరరెడ్డిలు ఎంతో శ్రమకోర్చి, ముంబైలోని పోరెన్సిక్ లాబ్ నుంచి నివేదిక తెప్పించుకుని కోర్టులో సమర్పించవలసి వచ్చింది.ఇదంతా ప్రభుత్వం చేయవలసిన పని కదా?మరి ఏడాదికిపైగా ఎందుకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు? ఇదే ఒక సాధారణ వ్యక్తి అయి ఉంటే చట్టం ,ప్రభుత్వం ఇలాగే ఉండేవా?చట్టం కొందరికి చుట్టమా?ఇక్కడ టిఆర్ఎస్ నేతలు ఆఫ్ ద రికార్డు ఒక మాట చెబుతుంటారు.ఓటు కు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేసినా న్యాయవ్యవస్థను సైతం మేనేజ్ చేయడంలో దిట్టగా పేరొందిన చంద్రబాబు తేలికగా స్టేలు పొందుతారని అంటుంటారు.ఇలాంటి వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు సవాల్ గా మారే మాట వాస్తవమే. అదే సమయంలో ఎసిబి కోర్టు న్యాయమూర్తి ఇప్పుడు ఇచ్చిన తీర్పు సంచలనం కలిగించేదే. ఆయన ఎక్కడా మొహమాటం లేకుండా కేసులోని పూర్వాపరాలు పరిశీలించి చంద్రబాబు పాత్రపై పునర్విచారణ జరపాలని ఆదేశించడం ఆహ్వానించదగిన పరిణామంగానే బావించాలి.ఇప్పుడు దీనిని లాజికల్ గా ఒక ముగింపునకు తీసుకువెళ్లవలసిన బాద్యత తెలంగాణ ఎసిబిపైన ,ప్రభుత్వంపైన ఉంటుంది?ఇది రాజకీయ వ్యవస్థకు సవాలు.ఈ కేసులో ముందుకు వెళ్లలేకపోతే తెలంగాణ ప్రబుత్వానికి ,ముఖ్యమంత్రి కెసిఆర్ కు అప్రతిష్ట వస్తుంది. కేసులో చట్టప్రకారం వ్యవహరించి, కేసులో నిందితుడుగా చేరే పరిస్థితి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు చేరితే అప్పుడు అది ఆయనకు గండంగా మారుతుంది.ఒక మాటలో చెప్పాలంటే కేసు ముందుకు వెళితే చంద్రబాబుకు, వెళ్లకపోతే కెసిఆర్ కు అప్రతిష్ట చుట్టుకుంటుంది.ఆ తర్వాత ఈ కేసును ఎలా డీల్ చేస్తుందన్నదానిపై న్యాయ వ్యవస్థ ప్రతిష్ట ఆధారపడి ఉంటుంది.అంతిమంగా రాజ్యాంగం అందరికి సమానమా?కాదా? అన్నదానికి ఓటుకు నోటు కేసు సవాల్ విసురుతోందని చెప్పాలి.(గ్రేట్ ఆంద్ర లో కూడా ప్రచురితమైంది.)

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...