Jump to content

AP lo diamonds dorikai


kittaya

Recommended Posts

కరువు నేలలో వజ్రాలున్నట్లు పరిశోధకులు తేల్చేశారు
13-09-2016 11:26:43

636093628036674708.jpg
  • బూదికొండ అటవీ ప్రాంతంలో వజ్ర నిక్షేపాలు
  • కళ్యాణదుర్గం అటవీప్రాంతంలో సర్వే సన్నాహాలు
  • 153 హెక్టార్లలో గుర్తింపు
  • పరిశోధక తవ్వకాలకు కేంద్రం అనుమతి
అనంతపురం, ఆంధ్రజ్యోతి ప్రతినిధి : కరువు నేలలో వజ్రాలున్నట్లు పరిశోధకులు తేల్చారు. జిల్లాలోని కళ్యాణదుర్గం అటవీ ప్రాంతంలో వజ్ర నిక్షేపాలున్నట్టు కనుగొన్నారు. దీంతో నమూనాల సేకరణకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన అడ్వయిజరీ కమిటీ గొట్టపు బావుల తవ్వకాలకు అనుమతులిచ్చింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం మండలంలోని పిల్లలపల్లి అటవీప్రాంతంలో 153 హెక్టార్లలో ఈ నిక్షేపాలున్నట్టు గుర్తించారు. అందులో 64 గొట్టపుబావుల తవ్వకానికి కేంద్రం అనుమతిచ్చింది. నేషనల్‌ మైనింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ) ఆధ్వర్యంలో తవ్వకాలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు వారు కళ్యాణదుర్గంలో మకాం వేసి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. అడవుల్లో పరిశోధనకు సర్వే సన్నాహాలు జరుగుతున్నాయి. 
 
153 హెక్టార్లు.. 64 గొట్టపు బావులు..
పిల్లలపల్లి అటవీ ప్రాంతంలో 153 హెక్టార్లలో వజ్ర నిక్షేపాలున్నట్టు గుర్తించారు. వాటి నమూనాలు సేకరించేందుకు వెంటనే 64 గొట్టపు బావులు తవ్వాలని కూడా సూచించారు. కొండ ప్రాంతం కావడంతో ఎక్కడెక్కడ బోర్లు వేయాలో గుర్తించేందుకు అటవీశాఖ అధికారులతో పాటు ఎన్‌ఎండీసీ అధికారులు సంయుక్తంగా పర్యటించనున్నారు. కొండల్లో భారీ వాహనాలు వెళ్లేందుకు ముందుగా రహదారులు ఏర్పా టు చేసుకోవాల్సి ఉండడంతో దానికోసం ప్రణాళికాబద్ధంగా చిత్రపటాలను తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆ కొండ ప్రాంతంలో వజ్ర నిక్షేపాలు ఉన్న విషయం గోప్యంగా ఉంది. 1984 నుంచి అంతరిక్ష సర్వేలు సాగుతున్నప్పటికీ అక్కడ నిక్షేపాలున్నాయన్న విషయం బయటకు పొక్కలేదు. కేంద్ర ప్రభుత్వం సూచనతో వజ్రాల వేట కోసం ఎన్‌ఎండీసీ అధికారులు కళ్యాణదుర్గం ప్రాంతంలో మకాం వేశారు. కరువు విలయతాండవం చేసే అనంతపురం జిల్లాలో వజ్ర నిక్షేపాలున్నట్టు కేంద్ర అనుమతులతో బయటపడడంతో జిల్లా వాసు ల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. 
 
వజ్రకరూరులో 40 ఏళ్ల క్రితమే తవ్వకాలు..
జిల్లాలోని వజ్రకరూరు ప్రాంతంలో వజ్ర నిక్షేపాలున్నట్లు గుర్తించిన పరిశోధకులు నలభై ఏళ్ల కిందటే తవ్వకాలు ప్రారంభించారు. జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఈ తవ్వకాలు సాగాయి. ఆశించిన స్థాయిలో వజ్రాలు లభ్యం కాకపోవడంతో ఇరవై ఏళ్ల కిందటే తవ్వకాలను ఆపేశారు. లభించే వజ్రాలకంటే తవ్వకాల ఖర్చు అధికంగా ఉండడంతో నిలిపేసినట్టు సమాచారం. అనంతరం పదేళ్ల పాటు ఓ ప్రయివేటు సంస్థ వారు తవ్వకాలను చేపట్టింది. గిట్టుబాటు కాలేదనే కారణంతో వారు కూడా తవ్వకాలను నిలిపేశారు. కానీ ఇప్పటికీ వర్షాలు కురిసిన ప్రతిసారీ వజ్రకరూరు ప్రాంతంలో వజ్రాల వేట సాగుతూనే ఉంది. ఇరుగుపొరుగు రాష్ర్టాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా వజ్రకరూరు పొలాల బాట పడతారు. ఈ అన్వేషణలో ఏటా ఒకరిద్దరికీ వజ్రాలు దొరుకుతున్నట్టు స్థానికుల సమాచారం. ఈ విషయంలో అదును కోసం కాచుకుని ఉన్న వజ్రాల వ్యాపారులు వాటిని గుట్టుచప్పుడు కాకుండా కొని సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. వజ్రకరూరులో ప్రత్యక్షంగా భూముల్లో వజ్రాలు దొరుకుతుండడం, తాజాగా కళ్యాణదుర్గం అడవుల్లో ఆ నిక్షేపాలున్నట్టు కనుగొనడం చూస్తే అనంతపురం జిల్లాలో వజ్రాల గనులు ఉన్నాయనే విషయం స్పష్టమవుతోంది. 

మెరుపుతోనే గుర్తింపు.. 
భూమి లోపలి పొరల్లో ఉన్న కార్బన్‌ వజ్రాలుగా మారుతున్నట్టు నిపుణులు తెలుపుతున్నారు. కనికరాళ్ల రూపంలో ఉన్న వజ్రాలను సూర్యకిరణాల ద్వారా ఏర్పడే కాంతి మూలంగా గుర్తిస్తారు. ఆ రాయి నుంచి వచ్చే మెరుపును బట్టి వజ్రంగా నిర్ధారిస్తారు. మెరుస్తు ఉండే రాయి దొరగ్గానే గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారుల చెంతకు చేరుతారు. వ్యాపారులు వాటిని సూక్ష్మ పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు. మట్టిలో మబ్బుగా ఉన్న ఆ రాయిని ఏదో ఒక మూల తగిన ఆయుధంతో చెక్కగానే కాంతి ప్రవేశించి ప్రకాశించడమే వజ్రం లక్షణంగా భావిస్తున్నట్టు వ్యాపార వర్గాల సమాచారం. రాతి నుంచి ప్రసరించే కిరణాల సంఖ్యను బట్టి ధరను కూడా నిర్ణయిస్తున్నట్టు తెలుస్తోంది. వజ్ర నిక్షేపాలు వున్న ప్రాంతంలో మెరిసే రాళ్లను తవ్వకాల ద్వారా వెలికి తీసి పరీక్షిస్తారు. వజ్రాలుగా నిర్ధారణ అయితే వాటిని సంబంధిత యంత్రాల ద్వారా మలిచి విలువను బట్టి మార్కెట్‌కు విక్రయిస్తారు.
Link to comment
Share on other sites

16 minutes ago, Naaperushiva said:

intha pedda maatalu endhuku ley baa.......valla talent vallu choopincharu...thappu mana valladhi kooda

All vidhalugu e north ollu M peduthunaruga manaki

Link to comment
Share on other sites

22 minutes ago, mettastar said:

All vidhalugu e north ollu M peduthunaruga manaki

adhi mana thappe baa...Tamil nadu and gujarat ni choosi nerchukovaali....crisis lo vunnappudu anni parties kalisi maree pani chesthaayi....central tho baaga lobbying chesthaaru.....manollu alaa kaadhu...mundhu party tharuvaathe state anattuntaaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...