Jump to content

ఎన్టీఆర్ ఫోటో వెనుక ఆ రోజు దాగి ఉన్న విషాదం ఏమిటంట


kothibava

Recommended Posts

ఎన్టీఆర్ ఫోటో వెనుక ఆ రోజు దాగి ఉన్న విషాదం ఏమిటంటే..
 
636109136648927868.jpg

 

   ఎన్టీఆర్ ఓటు వేస్తున్నప్పటి ఈ చిత్రం 1985 మార్చి 5న జరిగిన మధ్యంతర ఎన్నికల నాటిది. దీని వెనుక ఒక విషాదం దాగి ఉంది. బహుశా ఆ ఛాయలు కనపడకూడదనే ఎన్టీఆర్ కళ్ళజోడు పెట్టి ఉంటారేమో. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక జనవరి 5, 1983లో జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్‌లోని అబిడ్స్ ప్రాంతంలో తన సతీమణి బసవ తారకమ్మతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎన్టీఆర్. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించడం, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం అందరికీ తెలిసిందే. కానీ ఆ మరుసటి సంవత్సరమే గుండెకు బైపాస్ సర్జరీ కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్ళడం, అక్కడ ఆయన భార్య బసవతారకమ్మకు కూడా ఆరోగ్య పరీక్షలు చేయించగా, ఆమెకు క్యాన్సర్ అని తెలియడం, ఆ వెంటనే అక్కడి నుండి రాష్ట్రానికి తిరిగిరాగా నాదెండ్ల రూపంలో ఒక సంక్షోభం ఎదురుకావడం... ఇలాంటివన్నీ వెంటవెంటనే జరిగాయి. ఎన్టీఆర్ ఈ గొడవల్లో ఉండగానే అటు భార్యకు కాన్సర్ ముదిరిపోయింది. వ్యాధి బయటపడే నాటికే నాల్గవ దశలో ఉందని తెలిసింది. డాక్టర్లు చేసేదేమీ లేదని తేల్చేసారు. చివరి క్షణాల్లో అటు సహధర్మచారిణితో పూర్తి సమయం గడపలేక, ఇటు ప్రజలను, పాలనా వ్యవహారాలను, పార్టీని గాలికి వదలలేక... రెండు బాధ్యతల నడుమ...  ఎన్నో ఇబ్బంధులను ఎన్టీఆర్ ఎదుర్కొన్నారు.  చివరికి కాన్సర్ బయటపడిన 3 నెలల లోపే, అక్టోబర్ 1,1984న సాయంత్రం 6.15 ని.లకు మద్రాసులో, తన 59వ ఏట బసవ తారకమ్మ మృతిచెందారు .

 

                   ఆ తర్వాత శాసనసభను రద్దు చేసి, ప్రజలలో తనపై ఉన్న విశ్వసనీయతను నిరూపించుకునేటందుకు మధ్యంతర ఎన్నికలకు ఎన్టీఆర్ వెళ్లారు. మార్చి5, 1985న మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఆ రోజు ఎన్టీఆర్ తాను ఒక్కరే వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకుంటున్న చిత్రం ఇది. మునపటి సమయంలో భార్యతో కలిసి ఓటు వేసిన ఎన్టీఆర్.. మధ్యంతర ఎన్నికల సమయంలో మాత్రం భార్య మృతిచెందడంతో ఒంటరిగానే ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది
ఆ ఎన్నికల్లో పోటీ చేసిన 250 సీట్లకు 202 సీట్లు సాధించి తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ తాను పోటీ చేసిన 3 చోట్లా (హిందూపురం, గుడివాడ, నల్గొండ) అద్భుత విజయం సాధించారు
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...