Jump to content

ఆసుపత్రుల్లో కులాన్ని బట్టి రోగికి వైద్యం - kottesam gattiga


ziboomba1

Recommended Posts

కళాశాలల్లో కులక‌ల్లోలం 
రాజధాని ప్రాంతంలో పెచ్చరిల్లుతున్న వికృత సంస్కృతి 
ఈ కులం అమ్మాయి ఆ కులం అబ్బాయితో మాట్లాడకూదు 
ఇంటి పేరుతోనే పిలుచుకోవాలి 
ఒక వైపు బెంచీల్లో ఒకే సామాజికవర్గం విద్యార్థులు 
హాస్టల్‌ గదుల్లోనూ ఇంతే 
ఇతర జిల్లాలూ ఇందుకు మినహాయింపు కాదు 
వైద్య కళాశాలల్లోనూ ఇదే జాడ్యం 
వాటి అనుబంధ ఆసుపత్రుల్లో కులాన్ని బట్టి రోగికి వైద్యం 
ఎ.కిశోర్‌బాబు, ఈనాడు - అమరావతి

‘నీ ఇంటి పేరేంటి’...ప్రశ్నించారా యువకులు.‘ఎందుకు’... ప్రశ్నించాడు ఆ విద్యార్థి. ‘ఎదురు మాట్లాడకుండా అడిగినదానికి చెప్పు’...గద్దించారు. 
ఇంటి పేరు చెప్పగానే ‘ఓహ్‌...నువ్వు మా వాడివేనా. సరే క్లాసులో ఈ వైపు బెంచీల్లో కూర్చో’మని ఆదేశించారు.అటువైపే ఎందుకూ అన్నట్లు చూశాడతను. 
‘నువ్వు మన కులం కదా... మనవాళ్లంతా ఈ వైపే కూర్చోవాలి. అదిక్కడ రూలు’ అంటూ ఈలలేసుకుంటూ వెళుతున్న వాళ్లను విస్తుపోయి చూస్తూ కూలబడ్డాడా యువకుడు. ‘మీనా, వినయ్‌’లు (పేర్లు మార్చాం) ఇంజినీరింగ్‌ తొలి ఏడాది. ఒకే తరగతి, మంచి స్నేహితులు. మీనా స్కూటిపై వినయ్‌ అప్పుడప్పుడు సరదాగా షికారు చేసేవాడు. అది ఆమె కులం విద్యార్థులకు నచ్చలేదు. ‘వాడితో నీకు మాటలేంటి’ అంటూ ఆమెను, ‘మా కులం అమ్మాయితో నీకు పనేంటిరా’ అంటూ అతణ్ని బెదిరించారు. ఖాతరు చేయకుండా మరునాడు వారిద్దరూ కబుర్లాడుతూ కనిపించారు. ఆ సాయంత్రం మీనా కులం కుర్రాళ్లు వినయ్‌ను దూరంగా ఈడ్చుకెళ్లి దాడి చేశారు. ఎంతలా అంటే ఇప్పుడు వారిద్దరూ ఒకర్నొకరు చూసుకోవడానికే భయపడేంతగా!

019ap-main5a.jpgవేవో సినిమాల్లో కనిపించే దృశ్యాలు కావు. విజయవాడ నగరం నడిబొడ్డున కొన్ని కళాశాలల ప్రాంగణాల్లో కనిపించే కుల వికృత కేళికి చిరు ఉదాహరణలు. 
నవ్యాంధ్ర రాజధానికి కేంద్రాలైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కొన్ని కళాశాలలు ఇందుకు నిలయాలైపోయాయి. యువతకు ప్రయోజక పాఠాలు బోధించాల్సిన విద్యా ప్రాంగణాలు వారిలో సామాజిక విద్వేషాలు నూరిపోస్తున్నాయి. ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా వాతావరణం ఉన్నా గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో మరీ అధికం.

యువతకు ప్రయోజక పాఠాలు బోధించాల్సిన విద్యా ప్రాంగణాలు వారిలో సామాజిక విద్వేషాలు నూరిపోస్తున్నాయి. చదువుసంధ్యలతో అలరారాల్సిన విద్యాలయాలు కులాల కుమ్ములాటలకు నిలయాలుగా తయారవుతున్నాయి. ఈ జాడ్యం నవ్యాంధ్ర రాజధానికి కేంద్రాలైన కృష్ణా, గుంటూరు జిల్లాలు మొదలు రాష్ట్ర మంతటా కొంచెం హెచ్చుతగ్గులతో కనిపిస్తోంది. ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా వాతావరణం ఉన్నా గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో మరీ అధికం. ఇక్కడ కొన్ని కళాశాలలైతే అవి ఫలాన కులం కళాశాలలనేంతగా ముద్రపడిపోయాయి. పదో తరగతి వరకూ ఎలాంటి సమస్యల్లేకుండా అంతా కలసి చదువుకున్న విద్యార్థులు జూనియర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అడుగు పెట్టగానే వారికి తెలీకుండానే ఈ కులాల అడుసు తొక్కేస్తున్నారు. అక్కడున్న కుల, రాజకీయ శక్తులు వారిని కులాల వారీగా విభజించేసి వేడుక చూస్తుంటారు.

కొన్ని కళాశాలల్లో విద్యార్థులను ఇంటి పేరుతోనే పిలుస్తుంటారు. అది ఆ సామాజికవర్గానికి వారిచ్చుకునే గౌరవమట. కళాశాలలో కొత్తగా విద్యార్థి అడుగు పెడితే అక్కడ ఎదురయ్యే మొదటి ప్రశ్న ‘మీ ఇంటి పేరు ఏంటి, మీదే కులం’ అనే. సమాధానం చెప్పడమే తరువాయి ఇక ఆ విద్యార్థి ప్రమేయం లేకుండానే ఆ సామాజిక వర్గంలో చేరిపోవాల్సిందే. మరుక్షణం నుంచి ఆ విద్యార్థి మిగిలిన సామాజికవర్గం వారితో మాట్లాడకూడదు. ఒక కులం అమ్మాయి మరో కులం కుర్రాడితో మాట్లాడటానికి అసలు వీల్లేదు. ఎవరైనా ఈ నిబంధనలను మీరితే ఇక అంతే. ఆ అబ్బాయిపైన ఆమె సామాజికవర్గం విద్యార్థులు దాడులు చేస్తారు. ఈ గొడవలు ఎంతలా ఉంటాయంటే హత్యలకు దారి తీసేంతలా. గతంలో విజయవాడలో ఇలాంటి కేసులు అనేకం నమోదయ్యాయి.

ప్రత్యేక వరుసలు 
కొన్ని ప్రముఖ కళాశాలల్లోని తరగతి గదుల్లో విద్యార్థులు సామాజికవర్గాలుగా విడిపోయి ఒకవైపు వరుసలో కూర్చొంటుంటారు. ఏ కులం విద్యార్థులు ఆ కులం విద్యార్థులతో కలిసి ఒకే వరుస బెంచీల్లో కూర్చోవాలి. దశాబ్దాలుగా ఇది గుంటూరు, విజయవాడల్లో జరుగుతోంది.

సి... పార్టీలు 
విద్యార్థుల్లో కులపిచ్చి ఏ స్థాయిలో ఉంటుందంటే ఏకంగా భారీ స్థాయిలో ‘కులం పార్టీలు’ నిర్వహించేంతగా. వాటి ముద్దుపేరు ‘సి పార్టీలు’. ఈ పార్టీలకు అన్ని కళాశాలల్లోని ఆయా సామాజికవర్గం విద్యార్థులు హాజరవుతారు. ఆ కులం రాజకీయ నేతలు వస్తారు. ఎన్నికల సమయంలో అయితే కొంతమంది నేతలు ఖర్చుపెట్టి మరీ వాటిని ఏర్పాటు చేయిస్తున్నారు.

హాస్టళ్లలోనూ 
ఇక్కడ మరింత దారుణంగా ఉంటుంది. కొన్ని హాస్టళ్లలో ఒక్కో అంతస్థులోని గదులన్నీ ఒకే సామాజికవర్గం విద్యార్థులకు కేటాయిస్తున్నారు. ఇక వారు మిగిలిన వారితో కలవరు, మాట్లాడరు. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు వారితో కలిసి మెస్‌లో భోంచేయరు కూడా.

గురువా... మీరు కూడానా! 
విద్యార్థులకు సుద్దులు చెప్పాల్సిన గురువులూ కొంతమంది కులాల కోలాటమేస్తున్నారు. మార్కులు వేయడంలో వారు తమ కులం ‘మార్కు’ చూపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇతర సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులను కొంతమందిని కావాలనే ముందు సంవత్సరంలోకి పంపకుండా ఆపేస్తున్నారనే విమర్శలున్నాయి.

ఎందుకిలా 
ఇదంతా రాజకీయమేనని చెప్పాలి. కొంతమంది నేతలు తమ వెంట బలగంగా విద్యార్థి సైన్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. కుల వైషమ్యాలే పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. బెజవాడలో దశాబ్దాల క్రితం ఇద్దరు నేతలు ఆరంభించిన సామాజికవర్గ విద్యార్థి సంఘాలే ఇప్పటికీ అక్కడ కళాశాలల వాతావరణాన్ని శాసిస్తుంటాయి. మిగిలిన ప్రాంతాల్లోనూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విద్యార్థుల వెనుక ఎవరో ఒక నేత కీలక పాత్ర పోషిస్తూనే ఉంటారు. విద్యార్థుల సంఘాల పేరు ఏదైనా వాటి లక్ష్యం మాత్రం అక్కడ కుల బల ప్రదర్శనే. ఈ నేతల గురి కూడా కేవలం ఇంటర్‌ నుంచి ఇంజినీరింగ్‌, డిగ్రీ విద్యార్థులపైనే ఉంటుంది.

కేసుల చిక్కులు 
ఈ కులాల కొట్లాటలో విద్యార్థులు తమకు తెలీకుండానే కేసుల్లో చిక్కుకుంటున్నారు. అప్పుడు వీరు ఆ సామాజికవర్గం నేతను ఆశ్రయించాల్సి వస్తోంది. దాన్ని ఆ నేతలు తమకు అనుకూలంగా మలచుకుని విద్యార్థులను తమ చెప్పుచేతల్లో ఉండేలా చూసుకుంటున్నారు. కేసుల్లో చిక్కుకుని భవిష్యత్తును నాశనం చేసుకున్నవారు ఎంతో మంది ఉన్నారు. వారికి వీసాలు, పాస్‌పోర్టులు రావు, రౌడీలుగా ముద్రపడుతున్నారు. ఇటీవల కాలంలో కళాశాలల్లో జరిగే ఘర్షణల్లోకి బ్లేడ్‌ బ్యాచ్‌, రౌడీషీటర్లు లాంటి అసాంఘిక శక్తులు ప్రవేశిస్తున్నారు. విద్యార్థులు వారితోనూ జతకట్టి భవిష్యత్తును దుర్భరం చేసుకుంటున్నారు.

‘ఆట’స్థలం వారిదే 
అమలాపురంలోని ఓ ప్రముఖ డిగ్రీ కళాశాలలో రెండు ఆటస్థలాలుంటే వాటిని కూడా సామాజిక వర్గాల వారీగా విభజించేసుకున్నారు. ఆయా కులం విద్యార్థులే ఆయా మైదానంలో ఆటలు ఆడుకోవాలి. పిఠాపురం వద్ద కొన్ని కళాశాలల్లో విద్యార్థులు కులాల వారీగా విడిపోయి తరగతి గదుల్లో కూర్చొంటుంటారు.

కులాన్ని బట్టి వైద్యం 
¹×ల జాడ్యం వైద్య కళాశాలలను కూడా పట్టి పీడిస్తోంది. ఓ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులు కూడా సామాజిక వర్గాల వారీగా విడిపోయారు. కులాల పేరిట వాట్సాప్‌ గ్రూప్‌లు నిర్వహిస్తున్నారు. దాని అనుబంధ ఆసుపత్రిలో అయితే వైద్య విద్యార్థులు, వారికి పాఠాలో బోధించే అధ్యాపకులు రోగిని అడిగే మొదటి ప్రశ్న ‘నీదే కులం’ అనే.

మాకిది మామూలే 
‘మా కళాశాలల్లో సి పార్టీలు మామూలే. సహజంగా ఇతర సామాజికవర్గం వారు మా కళాశాలలో చేరరు. మా తరగతిలో మా సామాజికవర్గం విద్యార్థిని నేనొక్కడ్నే. దాంతో బలమైన సామాజికవర్గానిదే ఆదిపత్యం. లెక్చరర్లు కూడా ఆ వర్గం వారే ఎక్కువ. వాళ్లు సరిగ్గా తరగతులకు రాకపోయినా, పరీక్ష సరిగా రాయకపోయినా మార్కులు ఎక్కువ వేస్తుంటారు. ఇది మాకు తెలుసు. కానీ ఏం చేయలేని పరిస్థితి’

-ఇంజినీరింగ్‌ విద్యార్థి(కంప్యూటర్స్‌),

మొదటి సంవత్సరం, విజయవాడ 
రెండేళ్లుగా పైతరగతికి వెళ్లకుండా ఆపేస్తున్నారు 
సీ పార్టీలకు ఇక్కడ మామూలే. మా కళాశాలలో ఒక సామాజికవర్గానిదే ఆధిపత్యం. మేం వారితో మాట్లాడకూడదు. వాళ్లు ఏం చేసినా చెల్లుతుంది. తరగతులకు రాకున్నా అధ్యాపకులు వారిని పై తరగతికి పంపించేస్తున్నారు. మా తరగతిలో వేరే సామాజిక వర్గం విద్యార్థిని కావాలనే రెండేళ్లుగా అదే సంవత్సరంలో ఉంచేస్తున్నారు.

-ఇంజినీరింగ్‌ విద్యార్థి(మెకానికల్‌), 
మొదటి సంవత్సరం, విజయవాడ 
గొడవలు సహజమే 
మా కాలేజీలో గొడవలు మామూలే. మేం ఇతర సామాజికవర్గం అబ్బాయిలతో మాట్లాడకూడదు. అలా ఎప్పుడైనా మాట్లాడితే గొడవలు జరుగుతూ ఉంటాయి. క్లాస్‌మేట్స్‌ అందరితో మాట్లాడకుండా ఉండమంటే ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఎందుకొచ్చిన గొడవల్లే అని వూరుకుండిపోతున్నాం.

-ఇంజినీరింగ్‌ విద్యార్థిని(కంప్యూటర్స్‌), 
మొదటి సంవత్సరం, విజయవాడ 
ఇదో రుగ్మత 
దో సామాజిక రుగ్మత. విద్యా సంస్థల్లో కుల విబేధాలు సహజమే. కాకుంటే ఇక్కడ కాస్త ఎక్కువ. దీనికి రాజకీయ నేతలే బాధ్యులు. ఈ కుల జాడ్యం కొన్ని సార్లు అధ్యాపకులను ప్రభావితం చేస్తోంది. వారు మిగిలిన సామాజికవర్గం విద్యార్థుల పట్ల పక్షపాతం చూపుతున్నారనేదాంట్లో అనుమానమేం లేదు. అన్ని డిగ్రీ కళాశాలల్లో మానవీయ విలువలు, వృత్తి ధర్మాలు అనే ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇంజినీరింగ్‌ కళాశాలల్లోనూ దీన్ని ఏర్పాటు చేసి విద్యార్థుల్లో పరివర్తన తీసుకురావాల్సిన అంశముంది.

-మ్యాథ్యూ శ్రీరంగం, రీడర్‌, లయోల కళాశాల 
విశ్వ విద్యాలయ ప్రాంగణాల్లోనూ... 
రాష్ట్రంలో కొన్ని విశ్వవిద్యాలయాల ప్రాంగణాలు కూడా కులాల కంపు కొడుతున్నాయి. ప్రాంతమేదైనా అక్కడ కనిపించే దృశ్యాలు మాత్రం దాదాపు ఇలాంటివే. ఓ ప్రముఖ వర్సిటీలో విద్యార్థులు ఏకంగా కులాల పేరుతో విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేసుకుని పోరాటాలకు దిగుతుంటారు. మరో వర్సిటీలో తరగతిలోని బెంచీల నుంచి హాస్టల్‌ గదుల కేటాయింపు వరకూ కులాల సంఘర్షణ జరుగుతుంటుంది. ఇంకో వర్శిటీలో మేము మాత్రం తక్కువా అంటూ అధ్యాపకులు, విభాగాధిపతులు కూడా కులాల వారీగా చీలిపోయి కుంపట్లు రాజేస్తున్నారు. ఇక్కడ ఒక సామాజిక వర్గం అధ్యాపకులు మిగిలిన సామాజికవర్గం విద్యార్థులను కావాలనే ఫెయిల్‌ చేస్తున్నారని బహిరంగ ఆరోపణలున్నాయి. ఎదురు తిరిగిన విద్యార్థులపై పునః మూల్యాంకనంలో కక్ష తీర్చుకుంటుంటారనే అభిప్రాయమూ ఉంది. ఇక్కడ అధ్యాపకులే తెరెవెనుక ఉండి విద్యార్థులతో ‘సి పార్టీ’లు నిర్వహిస్తుంటారు. గుంటూరులోని ఓ ప్రముఖ కళాశాలలో ఒకే సామాజికవర్గం వారినే అధ్యాపకులుగా, విభాగాధిపతులుగా నియమిస్తుంటారు. అక్కడ ఆధిపత్యం కూడా ఆ వర్గం విద్యార్థులదే.

వాళ్లే ఎందుకు 
16-22 ఏళ్ల మధ్య యువత దూకుడుగా ఉంటారు. దేనికైనా త్వరగా ఆకర్షితులవుతుంటారు. నేతలకు కావాల్సిందీ అదే. 22ఏళ్లు దాటిన వారిలో కాస్త ఆలోచన ఉంటుంది. వారితో నేతలకు పనిలేదు. ఈ లోపే కుర్రాళ్లను తమ రాజకీయ స్వప్రయోజనాలకు వాడుకోవాలి. అందుకే బడి నుంచి కొత్తగా కాలేజీలో అడుగు పెట్టిన కుర్రాడికి కులం మత్తు రుచి చూపిస్తారు. ఆ వర్గం మొత్తం అతడి వెనుకే ఉన్నట్లు, కళాశాలలో వారు చెప్పిందే వేదం అన్నట్లు భ్రమలు కల్పిస్తారు. విందులు, వినోదాలు, షికార్లు, దౌర్జన్యాలతో కుర్రాడు త్వరగా అటు ఆకర్షితుడైపోతాడు. ఇక ఆ సామాజిక వర్గం నేత ర్యాలీ, సభ ఉందంటే చాలు ఆ నేత ఎలాంటివాడనే కనీస ఆలోచన కూడా లేకుండా కుర్రాళ్లంతా అక్కడ వాలిపోతుంటారు. ఇటీవల ఓ కళాశాలలో ఓ కులం విద్యార్థులు తమ హీరో సినిమా బ్యానర్‌ కడితే మరో సామాజికవర్గం దానిపై గొడవకు దిగి చివరకు కళాశాలకు నోటీసు వచ్చేంత వరకూ వ్యవహారాన్ని తీసుకెళ్లారు. ఈ రొంపిలోకి ఒక్కసారి విద్యార్థి దిగితే ఇక ఇంతే. స్కూల్లో టాపర్లుగా నిలిచిన వాళ్లూ ఇంటర్లో ఫెయిలవుతున్నారు. బెజవాడ పటమటలోని ఒక ప్రముఖ కాన్వెంట్‌లో టాపర్‌గా నిలిచిన విద్యార్థి కులాల కుంపటికి ఆకర్షితుడై ఇంటర్‌ తప్పాడు. విజయవాడ, గుంటూరు నగర వీధుల్లో ఇలాంటి వాళ్లు ఎంతో మంది కనిపిస్తుంటారు.

Link to comment
Share on other sites

2 minutes ago, nokia123 said:

vammo...endhidhi...._%~

manchidhi ayyindhi nenu andhra lo chadavakapovatam....

same here atleast HYD lo putanu kabatti na caste naku 10th varaku telidu ....edo form fill cheyali ante apudu telisindi  

Link to comment
Share on other sites

11 minutes ago, nokia123 said:

vammo...endhidhi...._%~

manchidhi ayyindhi nenu andhra lo chadavakapovatam....

 

7 minutes ago, samaja_varagamana said:

same here atleast HYD lo putanu kabatti na caste naku 10th varaku telidu ....edo form fill cheyali ante apudu telisindi  

Chala sekalunnayi ga...

Africa lo putta anu correct set ayuddi

Link to comment
Share on other sites

kotta em undi eppudu nunchi unnade kada mari comedy ga anta pedda headlines esi cheppalsindi em undi andarki telsina vishayame. Gajji galla gurinchi gajji paper la ne veskunnaru kada. Kids ni kampu chesede parents parents ki aa gajji lekunte kids ki ela vastadi. so parents mentality marali appude bagupadtadi navyandhra lekunte assame

Link to comment
Share on other sites


My name is Rejoice ,am single, never married, I'm here searching for friendship. i came across your profile on site today, i became interested in you. Please write me to my email ( [email protected] ) for more introduction. Because I'm not often on these site. So i can send you my pictures and discuss something very important with you, i hope we can be best of friends
 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...